.
టోటల్లీ అన్‌ఫెయిర్ బిగ్‌బాస్… ఇంకా మన భాషలో చెప్పుకోవాలంటే… నెత్తిమాసిన బిగ్‌బాస్..! అవును, నిన్నటి నిస్సారపు వీకెండ్ షో చూశాక… ప్రత్యేకించి దమ్ము శ్రీజ అనే కంటెస్టెంట్ ఎలిమినేషన్ తీరు చూశాక కలిగే అభిప్రాయం ఖచ్చితంగా ఇదే…
సాధారణంగా ఇలాంటి రియాలిటీ షోలలో ఎలిమినేషన్ ఎలా జరుగుతుంది..? ఆడియెన్స్ వేసే వోట్లేను బట్టే కదా..! షో టీమ్ లెక్కలు వేరే ఉన్నా, వాళ్లు ఎవరిని తీసేయాలనుకున్నా సరే, జనం వోట్లను బట్టే ఎలిమినేట్ చేశాం అనే బయటికి చెబుతారు కదా, జడ్జిలతో చెప్పిస్తారు కదా…
Ads
కానీ శ్రీజ ఎలిమినేషన్‌కు ఏ ప్రజాభిప్రాయమూ లేదు… ఓ దిక్కుమాలిన, తలతిక్క పద్ధతిలో బయటికి గెంటేశారు ఆమెను… నిజానికి ఆమె మొదట్లో చిరాకు పుట్టించినా, తరువాత నిలదొక్కుకుని స్ట్రాంగ్ కంటెస్టెంటుగా మారింది… అలాంటిది… కొత్తగా హౌజులోకి అడుగుపెట్టిన ‘వైల్డ్’ కార్డ్ ఎంట్రీల అభిప్రాయం తీసుకుని, ఆమెను తరిమేశారు… అదేమిటి..?
కొత్తగా వచ్చిన కంటెస్టెంట్ల వ్యక్తిగత అభిప్రాయాలు అవి… అందులో నలుగురు శ్రీజ వేస్ట్ అనగానే పంపించేస్తారా..? మరెందుకు ఈ పోల్స్, ఈ వోట్లు, ఈ ప్రజాభిప్రాయం అనే వేస్ట్ ముసుగులు… మా ఇష్టంరా భయ్, మేమెలాగైనా, ఎవరినైనా పంపించేస్తాం అని చెప్పేయిరా టోటల్లీ అన్‌ఫెయిర్ బిగ్‌బాసూ…
మొదట్లో ఆరుగురు, తరువాత ఒకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ… ఏడుగురు కామనర్లలో నలుగురు ఔట్ ఇప్పటికే… అంటే అగ్నిపరీక్ష అనే ఓ పైత్యపు తంతులో ఎంపిక చేసిన తీరే దరిద్రం అని సాక్షాత్తూ బిగ్‌బాసే చెప్పుకుంటున్నట్టు..! ఇక ఇప్పుడు ఫైర్ స్టార్స్ అట… మరో ఆరుగురిని ప్రవేశపెట్టారు… వీళ్లు కామనర్లా..? సెలబ్రిటీలా..? కంట్రవర్సీల్లో ట్రోలింగుకు గురై పాపులరైన వాళ్లే కావాలా బిగ్‌బాస్‌కు..?
రమ్య… ఆన్‌లైన్ పికిల్స్ బిజినెస్ చేసే సిస్టర్స్‌లో ఒకరు ఈమె… ఆమధ్య వీళ్లపై ఫుల్లు ట్రోలింగు నడిచింది… ఇప్పుడామె బిగ్‌బాస్ కంటెస్టెంట్… దివ్వెల మాధురి… సేమ్, ఈమె కూడా ట్రోలింగు బారిన పడిన కేరక్టరే… దువ్వాడ శ్రీనివాస్‌తో ఆమె బంధంపై సోషల్ మీడియాలో రచ్చ సాగింది కొన్నాళ్లు… వీళ్లు కామనర్లా..? సెలబ్రిటీలా..?
ఆయేషా జీనత్… తమిళ బిగ్‌బాస్ షోలో కొన్నాళ్లు రచ్చ చేసింది… తెలుగు టీవీ ఆర్టిస్టు కూడా… గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయర్ కూడా టీవీ ఆర్టిస్టులే… మరీ అంత సెలబ్రిటీలు ఏమీ కారు, సో, కామనర్లే అనుకుందాం… శ్రీనివాస్ సాయి ఏదో సినిమాలో చేసినట్టున్నాడు, ప్రస్తుతానికి ఎవరికీ గుర్తులేడు… సో, కొత్త ఆరుగురూ ఓరకంగా కామనర్లే… ఇదీ బిగ్‌బాస్ ఎంపిక తీరు..!!
Share this Article