.
. ( రమణ కొంటికర్ల ) .. …. ఏదైనా ఆకర్షణ ఉండాలంటే… కాస్త భిన్నంగా ఉండి ఉండాలి. అలా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించే గ్రామమే కొడిన్హి. కేరళకు చెందిన ఆ గ్రామమెందుకు వార్తల్లోకెక్కింది..?
ట్విన్ టౌన్ ఆఫ్ ఇండియా ఇదీ కొడిన్హి పేరు. కేరళలోని మలప్పురం జిల్లాలో ఉన్న ఈ చిన్న గ్రామం ప్రపంచం దృష్టినే ఆకర్షించింది. శాస్త్రవేత్తలనూ అబ్బురపరుస్తోంది. ఎందుకంటే, ప్రపంచంలోనే అత్యధిక కవలలున్న గ్రామంగా ఖ్యాతికెక్కడంతో ఇదో పరిశోధనల ప్రయోగశాలలా తయారైంది.
Ads
కొడిన్హి కేవలం 2 వేల కుటుంబాలు మాత్రమే ఉండే ఓ మారుమూల గ్రామం. కానీ, 450 మంది జంటలకు ఇక్కడ కవల పిల్లలు జన్మించారు. కవలల జననాల ప్రపంచ సగటును పరిగణనలోకి తీసుకుంటే… కొడిన్హిది ఓ రికార్డ్.
అయితే, ఇది పూర్వీకుల నుంచి జన్యుపరంగా వస్తున్న పరిణామామో.. లేక, ఇక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల నెలకొంటున్న చర్యో కావచ్చనే విషయాన్నీ ఇక్కడికొచ్చే పరిశోధకులు పేర్కొంటున్నారు. జన్యువైవిధ్యంలో కనిపిస్తున్నఅంశాలపై లోతైన ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది.
మరోవైపు ఇక్కడి సంప్రదాయ ఆహార అలవాట్లు, వాటిలో ఉండే న్యూట్రీషన్స్, యాంటీ యాక్సిడెంట్స్ వంటివీ కారణమనే వాదనా ఉంది. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, పాలు ప్రధానాహారంగా కనిపించే ఈ గ్రామంలో… అవి సంతానోత్పత్తి, పిండం ఎదుగుదల, హార్మోన్స్ సమతుల్యతకు దోహదం చేస్తాయనేదీ మరో వాదన.
బలవర్ధకమైన పౌష్ఠికాహారం వల్లే కవలల జననాలకు కారణమని చెప్పినవారూ ఉన్నారు. అలాగే పర్యావరణ పరంగా కాలుష్యానికి గురికాని ప్రకృతి వనరులు, స్వచ్ఛమైన నీరు, గాలి వంటివి కూడా కారణాలనేవారూ ఉన్నారు. అయితే, ఇదే ఫలానా కారణమని మాత్రం ఇతమిద్ధంగా ఇప్పటివరకూ మాత్రం గుర్తించలేకపోయారు.
కవల పిల్లల జననాల వెనుక కారణమేంటన్న మార్మికత ఇప్పటికీ ఇంకా ఇక్కడ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. దీంతో ఇంకా కూడా ఇక్కడ కవలల జననాలకు కారణాలేంటన్న పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శాస్త్రవేత్తలు ఇక్కడికి వస్తూనే ఉన్నారు. జంట జననాల రేటుపై అధ్యయనం చేస్తూనే ఉన్నారు. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడే ఎందుకు ఇలా కవలలు పుడుతున్నారనే మిస్టరీని పటాపంచలు చేయాలని ఎన్నో ప్రయత్నాలూ జరుగుతూనే ఉన్నాయి.
ఇక్కడి వాతావరణ, పర్యావరణ పరిస్థితులై ఉండొచ్చని కొందరు అంచనా వేశారు. ఇంకొందరు ఆహారపలవాట్లై ఉండొచ్చనీ సిద్ధాంతీకరించారు. కానీ, అవే కచ్చితమైనవని మాత్రం నిర్ధారించలేకపోయారు.
కొడిన్హి వాసులు తమ గ్రామానికి దక్కిన ప్రత్యేకతను ఓ వేడుకలా చూస్తారు. కవల పిల్లల జననాలను ఓ హోదాగా భావిస్తున్నారు. ఇందుకోసం ట్విన్స్ అండ్ కిన్ అసోసియేషన్ నూ ప్రారంభించారు.
కొడిన్హి ఒక అందమైన గ్రామం. ఎటు చూసినా కనుచూపు మేర పచ్చని ప్రకృతి, చుట్టూ కొండల వంటి పర్యాటకంతో పాటు… కవల పిల్లల జననాలతోనూ ప్రత్యేకతను సంతరించుకున్న గ్రామమిది. అందుకే కొడిన్హి ఓ టూరిస్ట్ హబ్ గా మారిపోయింది.
కొడిన్హి ఓ గ్రామంగా మాత్రమే కాదు… జంట జననాల కవలల పుట్టుకతో ఓ రహస్య, మార్మిక ప్రదేశంగానూ ఓ కుతూహలాన్ని రేపుతున్న ప్రాంతం. అందుకే ఇక్కడికి పర్యాటకులతో పాటు, ప్రయోగశీలురు, పరిశోధకులు ఇలా అంతా క్యూ కడుతున్నారు.
కోడిన్హి ఒక గ్రామం మాత్రమే కాదు- ఇది జీవిత రహస్యాలకు నిదర్శనం. దాని అసాధారణమైన జంట జననాల రేటు శాస్త్రవేత్తలను మరియు సందర్శకులను ఒకే విధంగా ఆకర్షిస్తూనే ఉంది, భారతదేశం యొక్క “ట్విన్ టౌన్”గా సరైన స్థానాన్ని సంపాదించుకుంది…
Share this Article