మొన్న సొరకాయ ప్రాశస్త్యం గురించి చెప్పారు కదా… మరొక్క కూరగాయ గురించి చెప్పండి సార్ అన్నారు పలువురు మిత్రులు… నిజమే, ఒకటి చెప్పుకోవచ్చు… సొరకాయంత వైశిష్ట్యాన్ని ఆపాదించలేం గానీ, ఆరోగ్యం రీత్యా అదిరే కూరగాయ… నిజానికి అది కూరగాయే కాదు… ఆ లెక్కకొస్తే అది అసలు వృక్షజాతే కాదు… చాలామంది మాంసాహారంగా భావించి దూరం పెడతారు, కుల విశ్వాసాల రీత్యా..! వాస్తవానికి అది మాంసాహారం కాదు, జంతుజాతే కాదు… బూజు తెలుసు కదా, పోనీ మన దేహం మీద కనిపించే గజ్జి… అదుగో ఆ జాతి… శిలీంధ్రజాలం… ఫంగస్… దాని పేరు పుట్టగొడుగులు..! నో, నో, అది శాఖాహారమే అంటారు కొందరు… కానేకాదు, మాంసాహారమే అంటారు ఇంకొందరు…
అసలు అక్కడిదాకా ఎందుకు..? కోడి గుడ్డు ముందా..? కోడి ముందా..? గుడ్డు మాంసాహారమా..? శాఖాహారమా..? ఈ ప్రశ్నలకు లోకం ఉన్నంతవరకు జవాబు దొరకదు… సేమ్, పుట్టగొడుగుల మీద ప్రశ్న కూడా అంతే… సైంటిస్టులు దాన్ని ఫంగీ అనేశారు… కానీ ఆ వర్గీకరణే శుద్ధ తప్పు అనేవాళ్లు కోకొల్లలు… మీకు తెలుసో తెలియదో గానీ, ప్రపంచంలో కనిపించే జీవజాతులు అయిదు రకాలు… అవి… 1) వృక్షాలు 2) జంతువులు 3) ఫంగి 4) మొనెరా 5) ప్రొటొక్టిస్టా…. వృక్షాలు మనకు తెలుసు, జంతువులు తెలుసు… ఈ ఫంగీ కూడా తెలుసు… మరి మొనెరా, ప్రొటొక్టిస్టా..? సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి ఈ చార్ట్ చూడండి… ఇంకా ఆ సైన్స్‌లోకి వద్దు ఇక్కడ…
Ads
మరి మన పుట్టగొడుగుల గురించి ఎందుకు మాట్లాడుకోవాలి..? ఎందుకంటే..? ప్రస్తుతం కరోనా సీజన్ కాబట్టి, ఒమైక్రాన్ వంటివి చూపించి డ్రగ్ మాఫియా మనల్ని దోపిడీ చేస్తోంది కాబట్టి… మనిషి వైరస్‌తో పోరాడాలంటే ఇమ్యూనిటీ కావాలి కాబట్టి… ప్రధానంగా విటమిన్ డి, బీ12 వంటివి అత్యవసరం కాబట్టి… ఈ కాలంలో నగరాల్లో ఉన్నవాళ్లు విటమిన్ డీ కావాలంటే రోజూ అరగంటో గంటో ఎండలో గడపడం సాధ్యమేనా..? ఆ టాబ్లెట్లు మహా ఖరీదు, గతంలోకన్నా కరోనా సీజన్ రాగానే డబుల్ చేసేశారు రేట్లు… మటన్, చికెన్, ప్రధానంగా గుడ్లు తినేవాళ్లకు అవి దొరుకుతాయి… కానీ శాఖాహార కులాల మాటేమిటి..? పుట్టగొడుగులు…
కానీ వాటినీ మాంసాహారంగా భావించి కొందరు దూరం పెడతారు… నిజానికి అది మాంసం కాదు, అదొక జీవజాతి, అంతే… అత్యధిక డీ విటమిన్ లభించే సోర్స్ అది… కేలరీలు తక్కువ, కార్బొహైడ్రేట్స్ తక్కువ, ఫ్యాట్ నిల్…, సెలీనియం, ఫాస్పరస్, ఫోలేట్ పుష్కలం… అన్నింటికీ మించి యాంటక్సిడెంట్స్… విటమిన్ సి కూడా… స్ట్రెస్ తగ్గిస్తుంది, కేన్సర్ ఫైటర్, గుండె జబ్బులకు దాదాపు ఓ ఔషధం… దాని న్యూట్రిషనల్ విలువ అపారం… అవి చెబుతూ పోతే ఇక్కడ ఒడవదు… సో, ఇమ్యూనిటీ బూస్టర్ అది… మరి మాంసాహారం అంటారు కదా, ఎలా..?
నిజానికి దీనికి పత్రహరితం లేదు, సొంతంగా ఫుడ్ తయారు చేసుకోదు.., కుళ్లిన శరీరాల మీద, కుప్పల మీద పెరుగుతుంది, ప్రత్యుత్పత్తి వ్యవస్థలు లేవు అని దీన్ని ఫంగీ కుటుంబంలో చేర్చారు… కానీ పెద్ద పెద్ద చెట్ల మీద బదనికల సంగతి తెలుసు కదా… అవీ పరాన్నజీవులే, పత్రహరితం ఉండదు, మరి అవి వృక్షజాతిలో ఎలా చేరాయి..? అసలు పుట్టగొడుగులకు జంతుజాలానికి ప్రధాన లక్షణమైన మొబిలిటీయే లేదు కదా, అంటే చలనశీలతే లేదు కదా… మరి మాంసాహారం అని ఎలా అంటారు..? జీవాణువులను గాలిలోకి వెదజల్లి సంతానవ్యాప్తి చేసుకుంటయ్ పుట్టగొడుగులు… సో, నిక్షేపంగా అందరూ తీసుకోవచ్చు… అసలు మాంసమే కాదు అని యావత్ జీవ శాస్త్రజ్జులు చెబుతున్నప్పుడు, ఇంకా మాంసం అని దూరం పెట్టడం దేనికి..? ఇవీ చేపల్లాంటి న్యూట్రిషనల్ ఫుడ్డే… ఐతే ఎక్కువగా వినియోగం వద్దు… పైగా ఏది పడితే అది తింటే విషం… కొన్ని వేల రకాలుంటయ్, అందులో కొన్ని మాత్రమే తినబుల్… (ఐనా ఇప్పుడు హైజినిక్ కండిషన్స్‌లో తినబుల్ రకాల్నే పెంచుతున్నారు)… సరిగ్గా వండాలే గానీ మటన్‌తో సమానం… (చాలామంది సులువుగా అర్థం చేసుకోలేరని పుట్టగొడుగుల వర్గీకరణలోని సంక్లిష్టత, వివాదాల గురించి… దాని న్యూట్రిషనల్ వాల్యూస్ గురించి… ఎక్కువ వివరంగా చెప్పడం లేదు ఇక్కడ…)
Share this Article