హిందూ దేవుడు కదా… ఎవరైనా ఏమైనా తూలనాడవచ్చు, కించపరచవచ్చు… నష్టం ఏమీ ఉండదు, పైగా మేధావి, సెక్యులర్ అనే పొగడ్తలు కూడా దక్కవచ్చు… ‘రామజన్మభూమి అట, ఇంకా నయం, శూర్పణఖ జన్మభూమి, రావణజన్మభూమి అనలేదు’ అంటూ కేసీయార్ వెక్కిరించాడు తెలుసు కదా… ఇప్పుడు కేసీయార్ కూడా అదే బాట… యాదాద్రి అక్షితలు పంచితే గెలిచేవాళ్లమేమో, కానీ మేం సెక్యులర్ అంటున్నాడు…
సెక్యులర్ అంటే హిందువులను ద్వేషించడం కాదు అనే బేసిక్ తెలిసినట్టు లేదు యువరాజా వారికి… దేశంలో ఇలా నోళ్లు పారేసుకున్నవాళ్లు చాలామంది ఉన్నారు… హిందూ సమాజానికి ఉన్న శాపం అది… శుభమా అని ఓ కార్యక్రమం తలపెడితే పెద్ద గురువులుగా చెప్పుకునే రాగద్వేష పీడతులైన నలుగురు శంకరాచార్యులే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు…
రాజకీయాల విషయానికొస్తే… కాంగ్రెస్ కాస్త నయం… మేం అయోధ్యకు వెళ్లం, కానీ రామభక్తుల అభిప్రాయాల్ని గౌరవిస్తాం, సుప్రీం తీర్పును అంగీకరిస్తాం అని హుందాగానైనా స్పందించింది… సరే, అయోధ్యకు వెళ్లకపోవడానికి వాళ్లు చెప్పే సాకు, అది బీజేపీ పొలిటికల్ ప్రోగ్రామ్ అని… వాళ్ల అవగాహనకు వాళ్లను వదిలేస్తే తృణమూల్ కాంగ్రెస్ మరీ ఎక్స్‌ట్రీమ్ పార్టీ… ఆ మమత బెనర్జీలాగే ఎవరు ఏం మాట్లాడతారో వాళ్లకే తెలియదు… పిచ్చి కూతలు…
Ads
ప్రత్యేకించి వాళ్ల లేడీ ఎంపీలు కూడా సేమ్… మమత మీటింగులో అప్పట్లో జైశ్రీరాం నినాదాలు చేసినందుకు భీకరంగా విరుచుకుపడి కేసులు పెట్టిందామె… దాదాపు 12 మందిని అరెస్టు చేయించింది… మొన్నటిమొన్నటిదాకా ఒక ఎంపీ మహువా మొయిత్రా నిర్వాకాలు చూశాం కదా… పైగా తను చేసింది తప్పేమీ కాదంటుంది ఆమె… అంతకుముందు ఒక ఎంపీ నస్రత్ జహాన్ మరో టైపు… ఎవరినో టర్కీ వెళ్లి పెళ్లిచేసుకుంది, నాలుగు రోజులకే వదిలేసింది…
అసలు మన పెళ్లిళ్ల చట్టం అమల్లో లేని ఆ టర్కీలో పెళ్లిచేసుకున్నాం కదా, అసలు అది పెళ్లే కాదు, విడాకులు చట్టబద్దంగా తీసుకోను అనేసింది… కోర్టు కూడా అవును, ఎక్కడో జరిగిన పెళ్లికి లీగల్ వాలిడిటీ లేదు అనేసినట్టుంది… శతాబ్ధి రాయ్ం అని మరో లేడీ ఎంపీ ఉంది… 2020 నవంబరులో ‘అసలు బెంగాల్‌లో ఎవ్వడూ జైశ్రీరాం అనడానికి వీల్లేదు, అనలేరు…’ అని ఏదో కూసింది…
ఇప్పుడు తాజాగా ఎక్కడో మాట్లాడుతూ ‘‘రాముడు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కేటగిరీయా..? (బీపీఎల్) (తెలంగాణ భాషలో చెప్పాలంటే తెల్లకార్డు) అందుకేనా బీజేపీ బీపీఎల్ లబ్ధిదారులకు కట్టించినట్టే ఆయనకు కూడా ఓ ఇల్లు కట్టిస్తోంది… ఇక లవుడికి, కుశుడికి కూడా చెరో ఇల్లు కట్టిస్తే ఈ వర్క్ పూర్తవుతుంది’’ అని వెటకారాన్ని దట్టంగా దట్టించి వదిలింది…
పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు అయోధ్యను, రాముడిని బీజేపీ నుంచి విడదీసి, తనే వివాదాన్ని పరిష్కారం చూపి, ఓ గుడి కట్టే ఆలోచన చేశాడని వీళ్లలో ఎవరికైనా తెలుసా..? అది పొలిటికల్, స్పిరిట్యుయల్ కంబైన్డ్ ప్లాన్… కానీ ఇలాంటి నలుగురు శంకరాచార్యులే తగిలినట్టున్నారు, పీవీ ప్రయత్నాలు ఫలించలేదు… అదంతా వేరే కథ… ఆయన దగ్గర ప్రజాసంబంధాల అధికారిగా పనిచేసే పీవీఆర్కే ప్రసాద్ ఓ పుస్తకంలో తనే స్వయంగా రాశాడు ఈ ప్రయత్నాల గురించి..!
Share this Article