Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జస్ట్ ఓ మూస మాస్ మూవీ… ఒక హిట్ కాంబో వర్కవుట్ కాలేదు…

December 9, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …. చిరంజీవి నటించిన నూరవ చిత్రం 1988 సెప్టెంబర్ 22 న వచ్చిన ఈ త్రినేత్రుడు సినిమా … తాను నటించిన మొదటి సినిమా పునాదిరాళ్ళు అయినా ముందర 1978 సెప్టెంబర్ 22 న రిలీజయింది ప్రాణం ఖరీదు … అంజనా ప్రొడక్షన్స్ బేనరుపై నాగబాబు నిర్మించిన రెండవ సినిమా ఈ త్రినేత్రుడు . మొదటి సినిమా రుద్రవీణ క్లాస్ అయితే ఈ రెండవ సినిమా పూర్తి మాస్ …

  • 1987 లో హిందీలో వచ్చిన జల్వా సినిమాకు రీమేక్ త్రినేత్రుడు … హిందీలో నసీరుద్దీన్ షా , అర్చన , పంకజ్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు . ఈ హిందీ సినిమా కూడా Beverley Hills Cop అనే ఇంగ్లీషు సినిమా ఆధారంగా తీయబడింది …

కధంతా మాదక ద్రవ్యాలు , వాటి వలన నాశనమవుతున్న యువత , ఆ డ్రగ్ మాఫియాను అంతం చేయటమే సినిమా . షూటింగ్ ఎక్కువ భాగం గోవాలో , ఆ తర్వాత విశాఖలో జరిగింది . ఫుల్ ఏక్షన్ , ఇన్వెస్టిగేషన్ , క్రైం . ఆ తర్వాత చిరంజీవి , భానుప్రియల రొమాన్స్ . ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగుంటుంది …

Ads

రాజ్-కోటి సంగీత దర్శకత్వంలో వేటూరి , సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , జానకమ్మ , మనో , చిత్ర పాడారు . చిరంజీవి , భానుప్రియలు హీరోహీరోయిన్లు , కోదండరామిరెడ్డి దర్శకుడు . సహజంగానే పాటల , డాన్సుల చిత్రీకరణ ప్రత్యేకంగా ఉండాలి కదా ! తార నృత్య దర్శకత్వంలో డాన్సులు అంత గొప్పగా ఉండవు కానీ బాగానే ఉంటాయి .

అయిదు పాటల్లో నాలుగు పాటలు చిరంజీవి , భానుప్రియల డ్యూయెట్లే . ఓరి నాయనో సోకు షాకు కొట్టిందమ్మో ఓరి దేవుడో చిలిపి చీమ కుట్టిందయ్యో , లవ్లీ లకుముకి మోలి పిలుపుకు లవ్లో పడ్డానమ్మో , నాటుకొట్టుడు వీరకొట్టుడు కన్ను కొట్టుడు , చెంపల తళుకుల కెంపుల లేడి జోడి కావే అంటూ సాగుతాయి ఈ నాలుగు డ్యూయెట్లు . చిరంజీవి క్లబ్ డాన్స్ హే పాపా అంటూ హుషారుగా సాగుతుంది .

(నాటు కొట్టుడు సాంగ్ చిత్రీకరణలో హీరోహీరోయిన్ల బాడీ లాంగ్వేజ్ మీద అప్పట్లో విమర్శలు వచ్చినట్టు గుర్తు… తరువాత నాటు అమ్మడు అని లిరిక్స్ పల్లవి పూర్తిగా మార్చినట్టు కూడా గుర్తు… ఐటమ్ సాంగ్‌ను మించిన మసాలా పాట…)

ప్రధాన పాత్రల్లో అన్నపూర్ణ , కూలభూషణ్ కర్బంధా , రంగనాధ్ , నాగబాబు , బ్రహ్మానందం , సత్యనారాయణ , మురళీమోహన్ , నూతన్ ప్రసాద్ , ప్రసాద్ బాబు , హేమసుందర్ , అల్లు రామలింగయ్య , వయ్యారాల వై విజయ , డిస్కో శాంతి , ఏంథోనీ  తదితరులు నటించారు . Can you give me some idea అనే డైలాగును నూతన్ ప్రసాద్ బాగా పాపులర్ చేసాడు …

స్క్రీన్ ప్లేని యండమూరి వీరేంద్రనాధ్ తయారు చేయగా డైలాగులను సత్యానంద్ వ్రాసారు . కోదండరామిరెడ్డి , చిరంజీవిల కాంబినేషన్లో వచ్చి సాదాసీదాగా ఆడిన సినిమా అయింది . సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడని చిరంజీవి అభిమానులు తప్పక చూడవచ్చు . యన్టీఆర్ లాగా చిరంజీవి కూడా ఈ సినిమాలో మారు వేషాలు బాగా వేసారు .

నేను పరిచయం చేస్తున్న 1189 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #మన_దేవాలయాలు #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • NCP ఏకీకరణ..? NDA వైపు శరద్ పవార్ అడుగులు..? ఇండి కూటమికి దెబ్బ..!!
  • సువ్వి కస్తూరి రంగ – సువ్వి కావేటి రంగ … మరుపురాని పాట…
  • మన ఇంట్లో, మన కాలనీ గుడిలో దేవుడు దేవుడు కాడా..?
  • సాక్షి… విడ్డూర పాత్రికేయం… వితండ పాత్రికేయం… ఈ రెండు స్టోరీలూ అవే…
  • రిపబ్లిక్ టీవీ ఆర్నబ్ గోస్వామి ‘పొలిటికల్ లైన్’ నిజంగానే మారిందా..?!
  • ఆత్మాభిమానం ఓవర్‌డోస్… అపార్థాలు, అవమానాలు, మనోగాయాలు…
  • విడిపోయిన జంటను కలిపిన సుప్రీం ‘సిక్స్త్ సెన్స్’… కానీ..?
  • ప్రపంచాధిపత్యం కోసం మొదలైన ‘డిజిటల్ కురుక్షేత్రం’..!
  • ‘Hip’ocracy..! ఎవరు తక్కువ..? ఏం తక్కువ..? అది సినీ హిప్‌కల్చర్..!!
  • ‘పిలిచావా’ అంటూ ఆమెను పిలిచాను… నా పిలుపు ఆమెకు అందనే లేదు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions