Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘తిరుచ్చిలో మా పోటీ అనైతికం’ – త్రిష కాళ్లల్లో లారెన్స్ కట్టెలు!

July 1, 2026 by M S R

.

లారెన్స్ ఓ వీడియో రిలీజ్ చేస్తూ… ‘‘తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో నాకు బాగా ఆదరణ ఉంది, షూటింగుకు వెళితే విరగబడతారు, కానీ అక్కడి నుంచి పోటీచేయను, ఎందుకంటే, అక్కడ టీవీకే జెండా మోసి, పార్టీ కోసం బాగా పనిచేసిన స్థానికులున్నారు, వాళ్ల అవకాశాల్ని నేనెందుకు చెడగొట్టాలి నా స్వార్థం కోసం? అని చెప్పుకొచ్చాడు…

అంటే, త్రిషకు ముందే నైతిక బంధనాలు వేస్తున్నాడా తను..? ఒకవేళ ఆమె వెళ్లి అక్కడ ఉపఎన్నికలో పోటీచేస్తే అది స్థానిక నాయకత్వాన్ని ద్రోహమే అని ముందస్తుగానే ఆమె కాళ్లల్లో కట్టెలు పెడుతున్నాడా..? తిరుచ్చి జనంలో త్రిషకు వ్యతిరేక వాతావరణం క్రియేట్ చేస్తున్నాడా? నాకు దక్కకపోతే పోనీ ఆ చాన్స్, త్రిషకు కూడా దక్కకూడదనే భావనా..? ఈ లారెన్స్ కూడా శివమణి టైపే కనిపిస్తున్నాడు…

Ads

ఎందుకంటే..? నేను రాజకీయాల్లో రావాలా వద్దా మీరే చెప్పండి అని కోరాడు మొదట్లో… తరువాత నేను పోటీ చేయను అన్నాడు… అసలు ఆ ఉపఎన్నికలో టీవీకే టికెట్ ఇస్తాను అని ఎవరు చెప్పారు తనకు..? అక్కడికి విజయ్ తనను అడిగినట్టు, టికెట్ ఖరారు చేసినట్టు, తానే రిజెక్ట్ చేసినట్టు కలరింగు, కవరింగులు దేనికి..?

తన దాతృత్వంతో అందరి మెప్పు పొందిన లారెన్స్ తన పొలిటికల్ ఎంట్రీ మీద మాత్రం వింతవింతగా ప్రవర్తిస్తున్నాడు… బరి నుంచి తప్పుకున్నాను అంటున్నాడు, అసలు బరిలో ఉండమని అడిగిందెవరు? పైగా ఎవరో నాటిన చెట్ల పళ్లను తాను తింటే అన్యాయమట, అందుకే ఆ ఎన్నిక నుంచి తప్పుకుంటున్నాడట…

అంటే త్రిష పోటీచేసినా అలాగే అర్థం చేసుకోవాలా ప్రజలు..? నిజానికి త్రిషను అక్కడి నుంచి పోటీ చేయించాలా వద్దానేది విజయ్, త్రిషల నిర్ణయం… అదేదీ తేలలేదు… పోటీచేయిస్తాడేమో కూడా… ఎందుకంటే… తన నిర్ణయాలన్నీ అలాగే ఉంటాయి… తన వ్యక్తిగత జ్యోతిష్కుడికి సలహదారు పదవి, తన నిర్మాతకు ఢిల్లీలో కీలక పదవి, తన కారు డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్టు… తనకు తెలిసిన ప్రజాస్వామ్యం, పాలన అలాగే ఉంటాయి…

(తన మంత్రి ఎవరో ఏదో మ్యాచ్ చేస్తూ కొకైన్ రెడీ చేసుకుంటున్న వీడియో జాతీయ స్థాయిలో వైరల్… ఇంకెవరో లీడర్ ప్రెస్ రిపోర్టర్లకు చెబుతున్నాడు, విజయ్ అని కాదు, కేవలం సర్ అని పిలవాలట విజయ్‌ను… మరో వీడియోలో మరో మంత్రి ఎవరిమీదో దాడి చేస్తున్నట్టుగా… రేయ్, ఎవుర్రా మీరంతా అన్నట్టుగా తయారైంది తన బ్యాచ్…)

మరోవైపు స్టాలిన్ కస్సుమంటున్నాడు… విజయ్‌కు మద్దతునిచ్చి ఊపిరి నిలిపింది తన మిత్రపక్షాలే, మూడు నెలలు లేదా ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయి రెడీ కావాలంటూ తన కేడర్‌కు పిలుపునిస్తున్నాడు… ఒకవేళ త్రిషను నిలబెడితే గెలుస్తుంది… విజయ్ ప్రేమ గట్టిది కాబట్టి కేబినెట్‌లోకి కూడా తీసుకోవచ్చునేమో కానీ…

అసలు ఆమె రాజకీయాల్లోనే లేదు, కేవలం విజయ్ ప్రేమికురాలు అనే అర్హత తప్ప మరేదీ లేదు… సో, ఆమెను నిలబెట్టి, గెలిపించి, మంత్రిని చేస్తే ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్తుంది అనుకుంటున్నారా..? నెవ్వర్… విజయ్ ధోరణే అది… జనానికీ ఎప్పుడో అర్థమైంది… ఐనా తనను సీఎంను చేశారు కదా… ఇదీ అంతే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ముట్టడి పోరాటాలన్నీ మైలేజీ పోరాటాలే… ఎవ్వడూ తగ్గట్లేదు…
  • ధర్మేంద్ర ప్రధాన్… విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగినవాడే…
  • బీజేపీ- బీఆర్ఎస్ ‘పొత్తుపొడుపు’..! అమిత్ షా సంకేతాలు ఇవే !!
  • ఈ చట్టాలు ఎందుకూ పనికిరావు – ముళ్లు పీకాల్సింది బుల్‌డోజర్లే !!
  • జస్ట్, సెకన్ల ఆపరేషన్ – ఖేల్ ఖతం – ఉగ్రవాది హతం – 141 ప్రాణాలు సేఫ్
  • అప్పటి సంచలనం… ఇప్పటి మీడియాకూ తెలియదేమో ఈ కథ…
  • ఆల్రెడీ బాలయ్య హిట్ సినిమా ఇది! మరి రీమేక్ ఎవరు చూడాలి ?!
  • డొల్ల మాటల వ్యాపారి..! మళ్లీ తెలంగాణ యాసపై అదే ఏడుపు !!
  • ఢిల్లీ అల్లర్ల వైఫల్యానికి, కల్లోలానికి ఎవరు అసలు బాధ్యులు..?
  • అబ్బో… ఈ ఉదయ్‌కృష్ణుడు మామూలోడు కాదు… ఎందుకంటే..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions