Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రతిపక్ష నేత నిర్మాతగా సినిమా… సీఎం ఇష్టసఖి కథానాయిక… వావ్…

May 13, 2026 by M S R

.

సరదాగానే చెప్పుకుందాం… అన్నీ అనుకున్నట్టు జరగాలని ఏమీలేదు, జరగకూడదని కూడా ఏమీలేదు… త్రిష ఇప్పుడు తమిళ రాజకీయాల్లో, సినిమాల్లో సంచలనం… ఎందుకు..? సీఎం విజయ్‌ ఇష్టసఖి… అయితే ఒక తాజా వార్త ఇంట్రస్టింగ్… అదేమిటంటే..?

తమిళ శాసనసభలో కాబోయే ప్రతిపక్షనేత ఉదయనిధి… ఎలాగూ స్టాలిన్ ఓడిపోయాడు కాబట్టి, రెండో స్థానంలో ఎక్కువగా గెలిచింది డీఎంకే సభ్యులే కాబట్టి ఉదయనిధినే నియమించొచ్చు స్టాలిన్… మరోవైపు ముఖ్యమంత్రికి కాబోయే భార్యగా ప్రచారంలో ఉన్న త్రిష… ఆ ఉదయనిధి, ఈ త్రిషతో ఓ భారీ సినిమా తీయబోతున్నాడు… అదీ తాజా వార్త…

Ads

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్ కి చెందిన ‘రెడ్ జెయింట్ మూవీస్’ నిర్మిస్తోంది… ఆహా, అధికారానికీ, ప్రతిపక్షానికీ మంచి ప్రొఫెషనల్ సంబంధం…! సరే, అదే కాదు, త్రిష చేతిలో మంచి మంచి ప్రాజెక్టులున్నాయి ఇప్పుడు… సుమారు 45 ఏళ్ల తర్వాత కోలీవుడ్ దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న భారీ క్రేజీ మల్టీస్టారర్ చిత్రంలో త్రిష కీలక పాత్ర పోషించబోతోంది…

ఈ సినిమా కోసం ఆమెకు ఏకంగా రూ. 12 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినట్లు సమాచారం… మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర‘ చిత్రంలో కూడా ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే… సూర్యతో చేసిన మరో భారీ మూవీ కరుప్పు పూర్తయింది… సో, భారీ ప్రాజెక్టులతో ఆమె బిజీ బిజీ… మరోవైపు ఇంకో ప్రచారం… విజయ్ ఖాళీ చేసిన అసెంబ్లీ స్థానంలో ఉపఎన్నికలో త్రిషను నిలబెట్టి, గెలిపించుకుని, ఆమెను కేబినెట్‌లోకి తీసుకుంటాడనేది ఆ ప్రచార సారాంశం…

వ్యక్తిగత జ్యోతిష్కుడిని ఓఎస్డీగా తీసుకున్న విజయ్, ఇష్టసఖిని రాజకీయాల్లోకి తీసుకురాకుండా వదిలేస్తాడా..? ఆమెకు రాజకీయాల మీద ఆసక్తి ఉంది… ఇక చాన్నాళ్లు నటించలేదు… సో, ఈ ప్రాజెక్టులు పూర్తిచేసి, ఇక ఫుల్ టైమ్ పాలిటిక్సులో మునిగిపోతుందనే చర్చలు నడుస్తున్నాయి తమిళనాట… అసలే ఆమెను నయా జయలలిత అంటున్నారు కదా… అసలే అది తమిళనాడు… సినీ గ్లామర్‌కు, రాజకీయ పీఠానికి విడదీయలేని అనుబంధం ఉంది…

  • తమిళనాడులో సినిమాల ప్రత్యేక షోలను ప్రభుత్వం రద్దు చేసింది… కానీ విజయ్ కొలువు తీరాడు, పైగా త్రిష సినిమా… కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) సినిమా ప్రత్యేక షోలకు పర్మిషన్ మంజూరైంది…

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • విజయశాంతి “కర్తవ్యం”… అనుష్క “అరుంధతి”… సమంత “మా ఇంటి బంగారం”
  • చైనా కంట్లో నలుసు! – హఠాత్తుగా ఇండియాలో వాలిన బర్మా చీఫ్!
  • KCR’s Voice – ఆ మంత్రి కడిగేశాడట- ఈయన చూశాడట !!
  • జంబలకిడిపంబ! కాన్సెప్టే బ్లాక్‌ కామెడీ, ఆపై ఈవీవీ మార్క్!!
  • Nagabandham … పెద్ద పేరున్న టీమ్ కాదు- కానీ పాన్ ఇండియా బజ్!
  • TMC Crisis – మమత సెల్ఫ్‌గోల్! అష్ట దిగ్బంధనంలో అభిషేక్!
  • 12 ఏళ్లలో ఏడుగురు ప్రధానులు? – బ్రిటన్ రాజకీయాల ‘నగుబాట’
  • కామాఖ్య..! అంబుబాచీ రోజులు..! రజస్వల కాదు, రుతుస్రావం..!!
  • ‘టైటానిక్‌ ’తర్వాత ఓ చారిత్రక నేపథ్యంపై ఓ అందమైన ప్రేమకథ!
  • ఇక్కడ ప్రవీణ్- అక్కడ అన్నామలై… రెండూ పరస్పర భిన్న ధృవాలు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions