Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అక్కడంత అసభ్యంగా ఏముందని..? అనవసరంగా అనసూయపై ట్రోలింగ్..!

June 30, 2024 by M S R

కిరాక్ బాయ్స్, ఖిలాడీ గరల్స్… అని ఓ టీవీ షో… హైపిచ్ అరుపులు, కేకల శ్రీముఖి హోస్ట్… ఏదో ఓ సాదాసీదా టీవీ చిట్‌చాట్ షో… ఇలాంటి షోలతో ఈటీవీ ఎంతోకొంత రనవుతోంది కదాని స్టార్ మావాడు కూడా వాతలు పెట్టుకుని ఈ షో స్టార్ట్ చేశాడు… సరే, తెలుగు టీవీ షోలు అంటేనే అసభ్యత, అశ్లీలం బాపతు కదా…

రెండుమూడు రోజులుగా అనసూయను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు… ఒక ఎపిసోడ్‌లో ఏదో పోటీలో శేఖర్ మాస్టర్ తన షర్ట్ విప్పేస్తే అనసూయ ఓ జెర్కిన్ విప్పేసి, మగాళ్లు ఏం చేసినా మేమూ చేయగలం, బస్తీమే సవాల్ అన్నట్టుగా పోటీపడుతుంది… ఇక ఆమె ఫోటో పెట్టి మీమ్స్, ట్రోల్స్, స్టోరీలు సాగుతున్నయ్…

సరే, అనసూయకు ఈ ట్రోలింగ్ కొత్త కాదు గానీ… మొన్న ఎవరో సోషల్ యాక్టివిస్టు కృష్ణకుమారి అట… హవ్వ, నీకు సిగ్గుందా, బుల్లితెర మీద ఇలాంటి ప్రదర్శనలు ఎంత డేంజరో తెలుసా..? సినిమాలంటే ఇష్టముంటే వెళ్తాం, లేకపోతే లేదు, కానీ టీవీల్లో ఈ రోత అందరూ చూస్తారు ఇంట్లో… ఈ పైత్యం ఇంకెన్నాళ్లు..? ఈ మురికిమాటల్లోనా ఆడాళ్లకు మగాళ్లకు పోటీ..? ఆమె ఎవరో మిరపకాయలు తిని నేరుగా వెళ్లి శేఖర్ బుగ్గల మీద పెట్టుకుంది… ఏమిటిదంతా..? అంటూ ఫైరయిపోయిందట… కొందరు ఇదే స్టోరీగా రాసుకొచ్చారు… (ఏమిటో ఈ శేఖరుడు, టీవీ షోలలో మరీ కుర్చీ మడతబెట్టి తరహాలో కనిపిస్తుంటాడు ఎందుకో మరి…)

Ads

అసలు జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ (ఇప్పుడు మళ్లీ ఒక్కటయ్యాయి లెండి), శ్రీదేవి డ్రామా కంపెనీ మొత్తం బూతు రోతే కదా… అనసూయకు కొత్తేముంది..? ఆమె ఎదిగిందే జబర్దస్త్ యాంకర్‌గా కదా… పైగా అవి నచ్చడం లేదు కాబట్టి బయటికి వచ్చేశాను అని చెప్పిందట ఎక్కడో… బయటికి వచ్చి చేసేవి కూడా సినిమాల్లో రంగమ్మత్త, దాక్షాయణి వంటి వెకిలి పాత్రలు, వ్యాంప్ డాన్సులే కదా…

కానీ ఈ షోలో బట్టలు విప్పడం మీద మాత్రం అనసూయను పెద్దగా నిందించడానికి ఏమీలేదు… అక్కడ పెద్ద అసభ్యత కనిపించలేదు… నిజానికి ఆమె గతంలో టీవీ షోలలో వేసుకున్న డ్రెస్సులు, అప్పుడప్పుడూ ఏవో టూర్లు వెళ్తూ పెట్టే వీడియోలు, ఫోటోలతో పోలిస్తే ఓ జెర్కిన్ విప్పడం అనేది అసలు లెక్కలోకే రాదు… పైగా ఎవరైనా ఏమైనా కామెంట్స్ చేస్తే విరుచుకుపడుతుంది…

అంతెందుకు..? అదే షోలో హోస్టింగ్ చేస్తున్న శ్రీముఖి బట్టల్ని చూడండి, అనసూయ బెటర్ కదా… అంతకుముందు ఏదో సంగీతం బాపతు షోకు కూడా ఇలాగే వచ్చింది ఆమె… ఒక ఎపిసోడ్‌లో అయితే అనంత శ్రీరాం కళ్లుమూసుకుని ఏదో కామెంట్ కూడా చేశాడు… అసలు తెలుగు టీవీలు, సినిమాలు, సీరీస్‌లు బూతు ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు… పాపం, ఒక్క అనసూయనే నిందించడం, ట్రోల్ చేయడం తప్పా, కాదా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సూసైడ్ ఫ్రూటింగ్! నేరేడుపళ్లు విరగకాస్తే సీరియస్ ఎల్‌నినో‌ ఖాయం!?
  • I Stand with Srinidhi Viplava Sri … ఎందుకంటే..?
  • సింగ్ గీతం – బోలెడు బ్లండర్స్, అది ఎక్కడెక్కడ దెబ్బతిన్నదంటే..?
  • కాళ్లల్లో కట్టెలు – ఆత్మరక్షణలో కిషన్‌రెడ్డి – తేలిపోయిన పేలవ వివరణ
  • BRS + Janasena + BJP … తెలంగాణ ద్వేషి పవన్ గోకుతూనే ఉన్నాడు…
  • అంతటి సిల్క్ సయ్యా అనడిగితే… నై అనే బావమరిది ఎవడుంటాడు..?
  • అనుకున్నదే – రక్తికట్టని ‘సింగ్ గీతం’ – మరీ దయనీయం వసూళ్లు
  • A Global Traveller — మోడీ టూర్ల సెంచరీ — 78 దేశాల పర్యటనలు
  • రాజకీయ కలకలం – ఠాక్రేకు మరో భంగపాటు? – జార్ఖండ్‌లో మరో ఘట్టం
  • BJD — పట్నాయక్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం — వారసుల్లేరు, నాయకుల్లేరు

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions