- ఫాఫం, అనసూయకు బట్టల్లేవు, ఎవరైనా పాత బట్టలు ఉంటే పంపించగలరు ప్లీజ్…
- రేయ్, మల్లెమాలా… ప్యాంటు వేసుకొచ్చేలోపే స్కిట్ స్టార్ట్ చేస్తారా..? అరగంట ఆగలేరా..?
- వచ్చేసారి బికినీతో వచ్చెయమ్మా, ఈటీవీ వాడి టీఆర్పీలు మస్త్ మస్త్ పెరిగిపోతయ్…
- ఆమె ప్యాంట్ మరిచిపోయి వస్తే ఎవరూ గుర్తుచేయరా, అలాగే స్కిట్ షూట్ చేస్తరా..?
- పాపం, ఆమెను ఏమీ అనకండ్రా, ప్రొడక్షన్ వాళ్లు ఏం ఇస్తే అదే వేసుకుంటుంది…
- అర్జున్‌రెడ్డి సినిమాను కంట్రవర్సీ చేయడం తెలుసు గానీ, ఈ డ్రెస్ గురించి తెలియదు…
- అనసూయ ఆంటీ, నీకు పింఛన్ వస్తలేదా..? లేకపోతే ఆ డ్రెస్ వేయడానికి సిగ్గు లేదా..?
- ఆమె కొడుకులు పెద్దవాళ్లవుతున్నారు.., డ్రెస్సులేమో చిన్నగా అయిపోతున్నయ్…
…. ఇవి ఈటీవీ వాడు యూట్యూబులో అధికారికంగా పెట్టుకున్న ప్రొమోలో జస్ట్, శాంపిల్ కామెంట్స్ ఇవి… ఇంకా పచ్చి బూతులు, కాస్త లైట్ బూతులు గట్రా బోలెడు… ఇవి గాకుండా సోషల్ మీడియాలో ఆమె ఫోటోతో పెట్టబడిన పోస్టులు, వాటికి కామెంట్లు, సైట్లలో ఈ ఫోటోకు కామెంట్లు సరేసరి… ఈమె డ్రెస్సుల వివాదం ఇప్పుడు కొత్తేమీ కాదు, ఈ తిట్లు కొత్త కాదు… అదేమంటే, మాకు ఇష్టమైన బట్టలు వేసుకునే స్వేచ్ఛ లేదా..? ఈ మగరికం ఏంది..? అంటూ కొందరి ఉల్టా కామెంట్లు… ఆమెకు కూడా తిక్కలేస్తే చెడామడా తిట్టిపారేస్తుంది… నిజమే, ఏ బట్టలు వేసుకోవాలనేది ఆమె ఇష్టమే… కానీ మనది నాగరిక సమాజం… ఆ సోయి మరిచిపోతేనే కష్టం…
నో, నో, ఆ జబర్దస్త్ షో అంటేనే బూతు… ఆ వెగటు కామెడీతోనే దానికి రేటింగ్స్, ఆ రేటింగ్స్‌తోనే ఈటీవీ మనుగడ, దాని మనుగడతోనే వీళ్లందరికీ రెమ్యునరేషన్స్… అని నిష్టూరాలు మొదలుపెట్టకండి… ఈమెతోపాటు అదే దిక్కుమాలిన షోకు రష్మి కూడా యాంకరింగ్ చేస్తుంది కదా… ఆమె కూడా గుంటూరు టాకీస్ వంటి టూహాట్ సినిమాలు చేసిన యాక్టరే కదా… ఐనా జబర్దస్త్ షోకు ఈ వెకిలి డ్రెస్సింగుతో ఎప్పుడూ రాలేదు… అంతెందుకు..? అప్పుడప్పుడూ గెస్టులుగా వచ్చే ఆడ కమెడియన్లు కూడా కాస్త పద్ధతిగానే బట్టలేసుకుంటున్నారు కదా… ఈమెకే ఎందుకిలా..?
Ads
ఏవో ప్రైవేటు వీడియోలు అయితే మీ ఇష్టం.., ఇది ఇంటిల్లిపాదీ చూసే షో… ‘‘పెద్దలకు మాత్రమే’’ అని చైల్డ్ లాక్ వేసేసుకోవాలా ఇక..? అసలు పెద్దలే చూడలేకపోతుంటే చిన్న పిల్లల మాటేమిటిలే..!! నిజానికి మల్లెమాల, రామోజీరావు తదితరులు ఎప్పుడూ ఈ షో చూడరా..? లేక చూసి తన టేస్టుకు తామే ఆనందపడిపోతుంటారా..? తమ టీమ్స్‌ను మెచ్చుకుంటూ ఉంటారా..? పైగా అక్కడే జడ్జిగా ఉండి, ఎమ్మెల్యే రోజా పకపకా నవ్వుతూ ఆనందిస్తూ ఉంటుంది… ఇప్పుడు ప్రోమోలో ఆమె కనిపించిన తీరు మీదే ఇన్నిరకాల విమర్శలు వినవస్తున్నయ్, ఇక షో ప్రసారమయ్యాక, అదీ యూట్యూబులో పెట్టాక ఇక కామెంట్ల వరదను ఊహించుకోవాల్సిందే… గుర్తుందా..? ఆమధ్య ఒకసారి ఆమె ఇలాంటి వెకిలి డ్రెస్సు ఒకటి వేసుకుని వస్తే, నెటిజనం బూతులు తిట్టేసరికి, షో టైమ్‌కు చాలా ఎడిట్ చేసి ఈటీవీ వాడు మర్యాదను, తన సిగ్గును తానే కాపాడుకున్నాడు… సో… ప్రస్తుతం ఓ పాపులర్, ట్రెండింగ్ డైలాగ్… ‘‘రేయ్, ఆమెకు అర్జెంటుగా ఓ ప్యాంటు కొనివ్వండర్రా..!!
Share this Article