ఇప్పుడు చంద్రయాన్ వంటి ఖగోళ ప్రయోగాలు అవసరమా..? ఈ ప్రశ్నను చాలామంది వేశారు సోషల్ మీడియాలో… చంద్రయాన్ అవసరం ఏమిటో, సాంకేతిక పురోగతిలో దేశం స్వయంసమృద్ధి ఎందుకు అవసరమేమిటో అర్థం చేసుకోవడం ఆయా వ్యాఖ్యదారుల అవగాహన స్థాయిని బట్టి ఉంటుంది… ఐతే..?
చంద్రయాన్ విజయాన్ని దేశం విజయంగా గాకుండా ఒక మోడీ విజయంగానో, ఒక బీజేపీ విజయంగానో చూడటం వల్ల వస్తోంది సమస్య… ఇది ఎక్కడ మోడీ ఇమేజీని మరింత పెంచుతుందో అనేది ‘ఇండియా’ విపక్షాల భయం… అందుకే నెగెటివ్ కోణాలను వెతికి వెతికి, నాగేశ్వర్ వంటి ‘మేధావులు’ కూడా దిక్కుమాలిన వ్యాఖ్యానాలకు, వార్తలకు పూనుకున్నారు… కానీ ఇదేసమయంలో ఈ ప్రచారానికి కౌంటర్లు ఇచ్చే క్రమంలో కాషాయం బ్యాచ్ కూడా అదుపు తప్పి ట్రోలింగ్‌కు దిగుతోంది… చంద్రయాన్ అవసరాన్ని ప్రశ్నించినా సరే దాన్ని దేశవ్యతిరేకంగా ముద్రవేస్తున్నారు కొందరు…
తాజాగా ట్రోలింగుకు గురైన వారిలో కార్టూనిస్ట్ మల్లిక్ ఉన్నాడు… ముందు దేశంలో పరిస్థితుల్ని చక్కదిద్ది తరువాత చంద్రుడిపైకి వెళ్దాం అని ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టాడు… ఇంకేముంది..? ట్రోలర్లు విరుచుకుపడ్డారు… కార్టూనిస్టుగా కార్టూన్లు గీసుకొని ఓ మూల కూర్చోక నీకు పాలిటిక్స్ ఎందుకోయ్ వంటి వ్యాఖ్యలూ బోలెడు… ఫాఫం, గతంలో ట్రోలింగ్ అనుభవాలు లేనట్టున్నయ్ మల్లిక్‌కు… అందుకే ఓ రిప్లై ఇచ్చాడు… కాస్త నవ్వొచ్చింది…
Ads
‘‘నేను ఎంత మేధావినంటే…’’ అంటూ స్వోత్కర్షతోపాటు మోడీ మళ్లీ ప్రధాని కావాలని, మిలిటరీ రూల్ రావాలనీ తేల్చిపారేశాడు… సరే, అది తన అభిప్రాయం… తన ఇష్టం… రెండు పేరాల్లో తన గొప్పతనం సూటిగా చెప్పుకున్న తీరు కూడా పర్లేదు, అదీ తనిష్టమే… కానీ ట్రోలర్లకు సమాధానాలు ఇవ్వాలంటే ఇక అందరూ తమతమ గొప్పతనాల గురించి ఇంతగా చెప్పుకోవాల్సి వస్తుందా అనే ఊహ కాస్త నవ్వుతెప్పించింది అంతే… తను కాస్త నయం… మరీ ఆ టీవీ ఆంటీలా అందరి మీద సైబర్ కేసులు పెట్టేస్తానని ఎగరలేదు…
Cartoonist Mallik…. Yes… నేను మేధావినే…. నేను వేల cartoons పబ్లిష్ చేశాను… వందల కథలు ప్రముఖ పత్రికలు అన్నింటిలో పబ్లిష్ అయ్యాయి… సీరియల్ నవలలు రాశాను… Tv సీరియల్స్ కి movies కి రాశాను… హిందూస్థానీ క్లాసికల్ మ్యూజిక్ లో డిగ్రీ ఉంది.. Movies కు కూడా రాసాను… వందల comedy skits కి script రాసి direct చేశాను… నన్ను largest circulated magazine 5 times cover page గా పబ్లిష్ చేసింది…. The Hindu news paper sunday supplement నా ఫోటో ని cover page గా వేసింది… అందులోనే centre spread లో నా గురించి article పబ్లిష్ చేసింది (2 pages ). ఇవే కాక చాలా చెప్పాల్సి ఉంది… కానీ అంత time నాకు లేదు….
వ్యంగ్యం వద్దు… స్థాయి మాట్లాడేవాళ్ళు వాళ్ళ స్థాయి తెలుసుకుని మాట్లాడాలి. అసలు విషయానికి వద్దాం… నేను ఏ party కి ఏ నాయకుడికి వ్యతిరేకం కాదు… I love India….సాంకేతిక ప్రగతి కి కూడా వ్యతిరేకం కాదు…. కానీ దేశాన్ని గూండాలు హంతకులు ఫ్యాక్షనిస్టులు క్రమినల్స్… అవినీతిపరులు దేశాన్ని దోచుకునే వాళ్ళు MLA లు గా MP లుగా మంత్రులుగా ఏలుతున్నారు… చిన్న పిల్లలపై అత్యాచారాలు చేస్తున్నారు… Crime rate విపరీతంగా పెరిగి పోయింది.. రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు…
ఇవన్నీ చూసి బాధ కలిగి చంద్రుడు మీద పరిశోధనల గురించి అలా రాసాను… మోడీ ఏ మళ్ళీ ప్రధాని కావాలి… లేదా మిలిటరీ rule రావాలి.. అప్పుడే దేశం బాగుపడుతుందని నా అభిప్రాయం… ఎవరైనా చెత్త కామెంట్స్ పెట్టారంటే ఆ సంస్కారం వాళ్లకి వాళ్ళ అమ్మ దగ్గరనుండి వచ్చిందని అనుకోవలసి వస్తుంది… మీ తల్లి పరువు తియ్యకండి…
ఎవడో కార్టూనిస్ట్ అంటే cartoons వేసుకుని ఒక మూల కూర్చోవాలని అన్నాడు…. పాలిటిక్స్ గురించి movies గురించి మాట్లాడకూడదంట… కార్టూనిస్ట్ touch చెయ్యని subject ఉండదు… పొలిటికల్ cartoon లేని news paper ఉండదు… ఆ సన్నాసులకి ఆమాత్రం knowledge ఉందా…
Share this Article