.
కాదేదీ ట్రోలింగుకు అనర్హం… నిజంగానే ఇలాగే తయారైంది…. సోషల్ మీడియాలో ఫేక్ ఖాతాలు పెరిగి, నియంత్రణ కరువై… బూతులు, వెకిలి- రోత వ్యాఖ్యలు, తిట్లతో కంపు కంపు చేస్తున్నారు అనేకులు… అసలు కామెంట్లలో వాళ్లే, పోస్టుల్లో వాళ్లే… బురద మనుషులు…
లావణ్య త్రిపాఠి… నటి, తెలుగులో పలు సినిమాలు చేసింది కథానాయికగా… పేరుకు తగిన లావణ్యవతి… వరుణ్ తేజ్‌తో ఏదో సినిమాలో (అంతరిక్షం 9000 KMPH) మొదలైన పరిచయం , ప్రణయం వైపు, అది పరిణయం వైపు వెళ్లింది… పెద్దలు తలూపారు… ఒక్కటయ్యారు… ఓ కొడుకు కూడా… వాయివ్ తేజ్… ఏదో ఆనందంగా బతుకుతోంది జంట… కానీ ట్రోలర్లు ఊరుకోరు కదా…
Ads
కనీసం అమ్మతనాన్ని గౌరవించాలనే సోయి కూడా ఉండదు ప్రబుద్ధులకు… ఆమె రీసెంటుగా ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నది… కొంత బరువు పెరిగినట్టు కనిపించింది, కావచ్చు, రెండుమూడు కిలోల పెరిగి ఉండొచ్చు… ఇంకేముంది..? దీన్ని ఆసరాగా చేసుకుని, సోషల్ మీడియాలోని కొందరు వ్యక్తులు ఆమె శరీరాకృతిపై అత్యంత అనుచిత వ్యాఖ్యలు చేశారు…
ఒక తల్లి అని కూడా చూడకుండా ఆమె శరీరాకృతిని విమర్శిస్తూ, బాడీ షేమింగ్‌కు పాల్పడటం పట్ల మెగా అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సమాజంలో ఇంకా వేళ్లూనుకుని ఉన్న ఇలాంటి సంకుచిత సంస్కృతికి తక్షణమే స్వస్తి పలకాలంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున కౌంటర్ కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి…
మాతృత్వం అనేది ఏ మహిళ జీవితంలోనైనా ఎంతో పవిత్రమైన, అద్భుతమైన ఘట్టం. గర్భధారణ సమయంలో, ప్రసవానంతరం మహిళల శరీరంలో అనేక రకాల హార్మోన్ల మార్పులు చోటుచేసుకోవడం, ఆ క్రమంలో బరువు పెరగడం అనేది పూర్తి సహజ సిద్ధమైన ప్రక్రియ.

సాధారణ మహిళలైనా, వెండితెరపై అత్యంత గ్లామరస్‌గా మెరిసే కథానాయికలైనా ఈ ప్రకృతి నియమానికి అతీతులేమీ కారు. గగతంలో ఐశ్వర్యా రాయ్, కాజల్ అగర్వాల్ వంటి అగ్ర కథానాయికలు సైతం ప్రసవానంతరం పెరిగిన శరీర బరువుతో కనిపించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి కూడా అంతే… చాలా సహజం…
నిజానికి ‘సతీ లీలావతి’ చిత్రం తర్వాత కుటుంబ బాధ్యతల్లో నిమగ్నమై, ఆమె సినిమాలకు కాస్త విరామం ఇచ్చింది… బయటికి రావడమే అరుదు… ఒక మహిళ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కోలుకోవడానికి తగినంత సమయం పడుతుంది… అలాంటప్పుడు ఆమె శరీరంలో వచ్చే సహజ మార్పులను గౌరవించాల్సింది పోయి హేళన చేయడం అత్యంత హేయమైన చర్య,..
ఈ ట్రోలర్ల ఇళ్లల్లో ఎవరూ పిల్లల్ని కనడం లేదా..? కనగానే మరింత స్లిమ్‌గా మారిపోతున్నారా..? 2012లో అందాల రాక్షసితో టాలీవుడ్‌లో ప్రయాణమైన ఆమె సినిమా జర్నీ, ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి చిత్రాలతోపాటు ‘యుద్ధం శరణం’, ‘మిస్టర్’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లోనూ కొనసాగింది… ఓటీటీ సిరీస్‌లు కూడా… తెలుగు తెరనే అంటిపెట్టుకుంది, ఎటూ పోలేదు… తెలుగింటి కోడలురా భయ్… అన్నింటికీ వెక్కిరింపులేనా..? యాణ్నుంచొస్తర్ర భయ్!!
Share this Article