అసలే జబర్దస్త్ బ్యాచ్ కదా… అన్నో, తమ్ముడో నేరుగా తాము బయటపడి ఎవరినీ ఏమీ అనరు… కానీ నాగబాబు తెర మీదకు వచ్చి ఏదో ట్వీటుతాడు… ఇక తమ సోషల్ బ్యాచ్ రంగంలోకి దిగుతుంది… భారీగా ట్రోలింగ్… అసలు తట్టుకోలేని రేంజ్‌లో…
కత్తి మహేష్, యండమూరి, గరికపాటి, రాంగోపాలవర్మ… ఎందరో… తను జస్ట్, ఓ జబర్దస్త్ జడ్జి అయితే ఇంత రాసుకోవడం, మాట్లాడుకోవడం అవసరం లేదు, కానీ తను యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నాడు, ఒక పార్టీ రాష్ట్ర కార్యదర్శి… ఎంత పరిణతి ఉండాలి, ఎంత లోతైన అవగాహన ఉండాలి… అబ్బే…
తను ఇన్నాళ్లూ ఒకరిని గోకడం, రక్కడమే తప్ప… ఆ పెయిన్ ఏమిటో తనకు అర్థం కాలేదు… ఇప్పుడు ఆ గోకుడు బాధ తెలిసొచ్చినట్టుంది… నిజం, సోషల్ మీడియాలో పార్టీల నడుమ, ఫ్యాన్స్ నడుమ, కులాల నడుమ, మతాల నడుమ బోలెడంత ట్రోలింగ్ వార్ జరుగుతూ ఉంటుంది… కానీ ఇది డిఫరెంట్…
Ads
తన పరివారానికే చెందిన ఓ పాపులర్ హీరో మీద… మాతో ఉండకపోతే పరాయివాడే అని పోస్టాడు తను… అంటే మీ నాయకుడి సొంత వదినకు అన్నకొడుకైనంత మాత్రాన తనకంటూ రాజకీయ అభిప్రాయాలు ఉండకూడదా..? తప్పకుండా మీకే సపోర్ట్ చేయాలా..? వేరే పార్టీ అభ్యర్థికి జై అంటే ఇక పరాయివాడు అయిపోయాడా..? అదుగో అక్కడ దెబ్బకొట్టింది ట్వీట్… పైగా నేను పోస్టింది బన్నీ గురించి కాదనే ఖండన కూడా లేదు కదా, దాంతో తననే అన్నాడని కన్‌ఫరమ్ చేసినట్టు అయిపోయింది…
మరి అల్లు అర్జున్ అలియాస్ బన్నీ కూడా తక్కువేమీ కాదు కదా… పాన్ ఇండియా హీరో… తనకూ ఫ్యాన్స్ ఉన్నారు… బన్నీ మౌనంగా ఉన్నాడు, కానీ తన బ్యాచ్ రెచ్చిపోయింది… ట్రోలింగ్ వర్సెస్ ట్రోలింగ్… గోకుడు ఎంత పెయిన్‌ఫుల్లో నాగబాబుకు అర్థమైంది… దాంతో ఎక్స్ ఖాతానే డియాక్టివేట్ చేశాడు… మళ్లీ అందరూ గేలి చేసేసరికి రీఎంట్రీ ఇచ్చాడు… ఆ ట్వీట్ డిలిట్ చేశాను బాబోయ్ అన్నట్టు మరో పోస్టు…
అంటే పరోక్షంగా ఏం చెబుతున్నట్టు… ఇక ఆపండ్రోయ్, నా ట్వీట్ డిలిట్ చేశాను, చేతులెత్తేస్తున్నాను అని చెప్పినట్టు కాదా… ఇక్కడ బన్నీ ఫ్యాన్స్ ఏదో ఘనకార్యం సాధించినట్టు కాదు, అది వాంఛనీయం కూడా కాదు… కాకపోతే నేను గోకితే ఎలా ఉంటుందో తెలుసా అని నాగబాబు ఎప్పటిలాగే వ్యవహరిస్తే… మేమూ గోకగలం, మాకూ గోళ్లున్నాయి అని ‘సొంత పరాయివాడి’ బ్యాచ్ చూపించింది…
సో, ఏతావాతా కథలో నీతి ఏమిటయ్యా అంటే… రాజకీయాల్లోనైనా సరే, విమర్శకు, దాడికి కొన్ని పరిమితులుంటాయి… అవి కొంత పరిణతిని లోబడి ఉంటాయి… అవి దాటితే ఎప్పుడో ఒకప్పుడు ఇలా ‘I Have Deleted My Tweet’ అని రాసుకోవాల్సి ఉంటుంది…!!
Share this Article