Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవును…TRS పార్టీ పేరు, రిజిస్ట్రేషన్‌పై కవిత క్లారిటీ ఇవ్వాలి…

April 26, 2026 by M S R

.

మళ్లీ పుట్టిన టీఆర్ఎస్ తరఫున ‘తెలంగాణ పురుచ్చి తలైవి’ అక్క… కాదు, ఇప్పుడు అమ్మ… స్వయంగా కొన్ని సమాధానాల్ని, వివరణల్ని,  స్పష్టతను ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది… ఎందుకో, ఏమిటో కూడా చెప్పుకుందాం… టీఆర్ఎస్ అనే పార్టీ పేరును ముందే వెల్లడిస్తే, దాన్ని, అందులోని ఆత్మను చంపేసుకున్న బీఆర్ఎస్ పార్టీ అడ్డంకెులు క్రియేట్ చేస్తుందనే భావనతో ఆమె ఆ పేరును ఆద్యంతం రహస్యంగా ఉంచింది…

అవసరమే… ఆ పేరులోని ఆత్మ ఏమిటో ఆమెకు తెలుసు, అందుకే గోప్యంగానే రిజిస్ట్రేషన్ చేయించింది… అలా తనకు ఆ పేరు వచ్చేసిందనే విషయాన్ని కూడా తనను కలిసిన జర్నలిస్టులతో కూడా ఆమె షేర్ చేసుకుంది, కాకపోతే కేసీయార్ లెగసీ నాకక్కర్లేదు అని చెప్పి, అందరినీ ‘ఉద్దేశపూర్వకంగా’ మిస్ లీడ్ చేసింది, అది కూడా కాదు, ముందు లీకైతే వచ్చే నష్టాల పట్ల అప్రమత్తత అది… తప్పు లేదు…

Ads

ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటోంది..? ‘1) అది టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ, అంటే తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్, 2) నిజానికి వోటర్లను గందరగోళానికి గురిచేసే ఇలాంటి ఎత్తుగడల్ని ఎన్నికల సంఘం అంగీకరించదు,  3) తెలంగాణ పేరిట ఎన్నికల సంఘం దగ్గర రిజిష్టరైన పేర్ల జాబితాలో ఈ తెలంగాణ రాష్ట్ర సేన పేరే లేదు, సో, ఆమెకు ఆ పేరుతో పార్టీ రిజిష్టర్ కాలేదు…’

నిన్నంతా పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో బిజీ కాబట్టి, బీఆర్ఎస్ స్పందన, చిమ్మిన విషం గట్రా చూసుకుని ఉండకపోవచ్చు, ఈరోజు లేదా రేపు స్పందించి… పార్టీ పేరు, రిజిస్ట్రేషన్ మీద క్లారిటీ ఇవ్వాలి, అదే బీఆర్ఎస్‌కు సరైన కౌంటర్, జనంలోనూ అపోహలు క్రియేట్ గాకుండా ఉంటుంది… టీఆర్ఎస్ఏ అనే పేరు కూడా తప్పుకాదు… అశ్వత్థామ హతఃకుంజర అన్నట్టు ఏ సైలెంట్… లేదా టోన్ డౌన్… (కవిత అంత అనాలోచితంగా వ్యవహరించేది కాదు… కాకపోతే జనానికి క్లారిటీ అవసరం)

ఆమె పదే పదే మొత్తుకునేది తన పార్టీ సోషల్ మీడియా తన మీద దుష్ప్రచారం చేస్తున్న కేటీయార్, కేసీయార్ పట్టించుకోలేదు అని… కాకపోతే ఫేక్ పేర్లతో, క్యాంపెయిన్ బ్యాచులతో ఈ ప్రచారం సాగేది… ఇప్పుడు ఇక ఆమె స్ట్రెయిటుగా తండ్రినే ‘ఆత్మ లేని మరబొమ్మ, ఆయన చుట్టూ పందికొక్కులు’ అని టార్గెట్ చేసిందో… ఇన్నాళ్లూ ‘సార్ బిడ్డ’ బాపతు మొహమాటం పోయి, బీఆర్ఎస్ సోషల్ మీడియాతోపాటు పార్టీయే అధికారికంగా ఆమెపై ఎదురుదాడి స్టార్ట్ చేసింది… అక్షరాలా విషం…

1) ఒరిజినల్ ఒరిజినలే అంటూ మార్కెట్‌‌లోని పలు అనుకరణ ఉత్పత్తుల బొమ్మలు పెట్టి ఎద్దేవా చేసింది పార్టీ అఫిషియల్ సోషల్ ఖాతా… 2) తెలంగాణ రేవంత్ సేన, షర్మిలలాగే కాంగ్రెస్‌లో అంతిమంగా విలీనం అంటూ మరో ప్రచారం… 3) తెలంగాణ పేరిట బోలెడు పార్టీలు వచ్చాయి, పోయాయి, ఇదీ అంతే అని ఇంకో ప్రచారం… సరే, ఇదంతా కడుపుమంట…

ఒరిజినల్ బ్రాండ్ పేరును, ఆత్మను కేసీయారే స్వయంగా మంటగలుపుకున్నాక, ఆయన బిడ్డ దాన్ని చేజిక్కించుకుంటే తప్పేముంది..? షర్మిలతో పోలిక కూడా దుర్మార్గం… షర్మిల పొలిటిషియన్ కాదు, ఆస్తుల పంచాయితీలో తెలంగాణలో పార్టీ పెట్టింది… నవ్వులపాలైంది, ఆమె జగన్ తరఫున ప్రచారం చేసేది తప్ప ఆమెకంటూ ఓ పొలిటికల్, సోషల్ ఉనికి లేదు… కానీ కవిత ఏళ్లుగా జాగృతి పేరిట జనంలో ఉంది…

షర్మిల కనీసం వార్డు సభ్యురాలు కూడా కాలేదు… కవిత ఎంపీ, ఎమ్మెల్సీ, ఒక దశలో సింగరేణి అధికారిక యూనియన్ అధ్యక్షురాలు… ఆమెకూ ఈమెకూ పోలిక ఏమిటసలు..? షర్మిల, ఈమె చీరెలు సేమ్, అంచులు సేమ్ దాకా విమర్శలు వెళ్లిపోయాయి…

అసలు కాంగ్రెస్‌లో విలీనం అనే ప్రచారమూ అబ్సర్డ్… అసలు కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని సిద్దపడి, ఢిల్లీలో చక్కర్లు కొట్టి, నానా ప్రయత్నాలు చేసింది కేసీయార్ కాదా, బీజేపీలో విలీన ప్రయత్నాలు నిజం కాదా, ఇప్పటికే అవే ప్రయత్నాలు కదా… ఆమె పార్టీ, నడిపించుకోగలిగితే వోకే, లేకపోతే ఏం చేయాలో ఆమె ఇష్టం… బీఆర్ఎస్‌కు ఎందుకు కడుపుమంట..?



కేసీఆర్ మీద కోపంతో పార్టీలు పెడితే నడవవు…
తెలంగాణ పేరుతో వచ్చిన కొన్ని పార్టీలు
నవ తెలంగాణ పార్టీ ( దేవేందర్ గౌడ్)
తల్లి తెలంగాణ పార్టీ( విజయశాంతి)
తెలంగాణ జన సమితి (కోదండరాం)
తెలంగాణ రాజ్యాధికార పార్టీ( తీన్మార్ మల్లన్న)
తెలంగాణ సాధన సమితి( ఆలె నరేంద్ర)
తెలంగాణ ఇంటి పార్టీ( చెరుకు సుధాకర్)
తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్( గద్దర్)
తెలంగాణ నగారా సమితి( నాగం జనార్ధన్ 긍໖)
తెలంగాణ రక్షణ సమితి (డాక్టర్.రాజేశ్వర్ రావు)
తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ (విమలక్క)
YSR తెలంగాణా పార్టీ( మొరుసుపల్లి షర్మిల)
తెలంగాణ రాష్ట్ర సేన (దేవనపల్లి కవిత)



ఇది ఒక ప్రచారం… ఇందులో చాలావరకూ కేసీయార్ మీద కోపంతో పెట్టినవి కావు… ఎవరి సత్తా మేరకు వాళ్లు ఉనికిని కాపాడుకుంటారు… అందులో తప్పేముంది..? ఇదే కేసీయార్ టీఆర్ఎస్ పెట్టినప్పుడు ‘పుబ్బలో పుట్టి మఖలో మాడిపోతుంది’ అని ఎద్దేవా చేయలేదా కొందరు… ఏమో, ఏ పార్టీ భవిష్యత్తు ఏమిటో జోస్యాలు చెప్పడం దేనికి..?

చివరగా… కవితకు రాజకీయ ఆకాంక్షలు ఉంటే తప్పేమిటి..? కుటుంబ పార్టీల వారసత్వాలు మగవాళ్లకేనా..? మహిళలకు వద్దా..? నిషిద్ధమా..? ఆ కోరిక ఉంటే పార్టీ నుంచి, కుటుంబం నుంచి తరిమేస్తే, అవమానం ఫీలై ఆమె తనకంటూ ఓ పార్టీ పెట్టుకుని, జనంలో ఉంటాను అంటే అందులో ఎగతాళి, ఎకసక్కేలు దేనికి..?!

రేపు బీఆర్ఎస్ (పాత టీఆర్ఎస్) ఆవిర్భావ దినం కాబట్టి అక్కడ కొత్త టీఆర్ఎస్ మీద, కవిత మీద బహుశా సెటైర్లు, కౌంటర్లు పడతాయి… 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అక్షరధామ్! స్వామి నారాయణుడితో నేనెందుకు కనెక్ట్ కాలేకపోయాను?!
  • అమిత్ షా పర్యటనలు రెండుసార్లు రద్దు! ఏదో అడ్డుపడుతోంది, ఏమిటది?!
  • ప్యారడైజ్ … సినిమా కాదు, బిర్యానీ కాదు… ఓ సినిమా టాకీసు !!
  • సింగీతం అంటే ఓ పేరు కాదు… తెలుగు సినిమా ప్రయోగాల జాబితా !!
  • Fly dubai – ఎన్నెన్నో కుట్ర కథనాల వ్యాప్తి ! అసలు నిజాలు ఇవీ !!
  • శాస్త్రంతోపాటే విశ్వాసం! అంతరిక్షమైనా.. ఆకాశమైనా.. భగవన్నామ స్మరణే!
  • ఈ ఉగ్ర పైలట్‌ను ఫ్లయ్ దుబాయ్ ఎందుకు నియమించింది?!
  • ఈ పార్వతి పాట… ఇప్పుడు ప్రపంచ చార్ట్‌లో నంబర్ 2 పాట !
  • విక్స్ ! దీని పుట్టుక వెనుక ఓ తండ్రి వేదన- పరిశోధన !!
  • అనగనగా ఓ దొరైస్వామి అనబడు ఓ పాత నటుడి కథ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions