.
Pardha Saradhi Potluri ……… డోనాల్డ్ ట్రంప్ డీప్ స్టేట్ లింక్ – Part 2 …. అశ్వద్దామ హతః ( కుంజరః )
ట్రంప్ డీప్ స్టేట్ ని నాశనం చేస్తాను అని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే అదే డీప్ స్టేట్ కి సహాయం చేస్తున్నాడు! కాకపొతే దేశ ప్రయోజనాల కోసం అని బొంకుతున్నాడు! ఏదైతే ఏమి? దెబ్బ తగిలేది చిన్న దేశాలకే!
Ads
జో బీడెన్ అధ్యక్షుడుగా ఉన్నా, డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయినా F -16, F-15, F-18, F -35 తయారు చేసే లాక్ హీడ్ మార్టిన్ ( Lockheed Martin ) కి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు! LM అమ్మకాలు పెరుగుతూనే ఉండాలి, ఉంటాయి!
భారత్ రాఫెల్ జెట్స్ కొనే ముందు టెండర్లు పిలిచినపుడు అమెరికా LM F -21, రష్యా Mig -35, స్వీడన్ SAAB GRIPEN, ఫ్రాన్స్ రాఫెల్ F3R లని అమ్మచూపాయి! స్వీడన్ మన మీద ఒత్తిడి తేలేదు కానీ ప్రకటనల రూపంలో డబ్బు ఖర్చుపెట్టింది మన దేశంలో!
పుతిన్ కి తెలుసు MIG -35 మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ఆసక్తి లేదని… కానీ ఒక మాట అని చూసాడు! మన దగ్గర అప్పటికే MIG -29 K రెండు స్క్వాడ్రన్లు సర్వీసులో ఉండడం, వాటి ఇంజిన్స్ స్పేర్ పార్ట్స్ సప్లై తరచూ ఆలస్యం జరగడం వలన MIG 35 ల విషయంలో మన వాళ్లు ఆసక్తి చూపలేదు!
రాఫెల్ F3R మీదనే భారత నిపుణులు ఎక్కువ ఆసక్తి చూపారు! చాలా కారణాలు ఉన్నాయి! ఫ్రాన్స్ కి చెందిన డస్సల్ట్ ఏవియేషన్ కి చెందిన మిరేజ్ -2000 లు మన దగ్గర ఆల్రెడీ ఉండడం. వాటి పని తీరు బాగుండండం ( కార్గిల్, బాలకోట్ ) స్పేర్ పార్ట్స్ విషయంలో ఎలాంటి జాప్యం లేకపోవడం, అప్పటికే ఫ్రెంచ్ ఫైటర్ జెట్స్ మీద మన పైలట్స్ కి అనుభవం ఉండడం లాంటి అంశాలతో మన నిపుణుల బృందం రాఫెల్ F3R ని తుది జాబితా లోకి తీసుకోవడం జరిగింది!
ఇక లాక్ హీడ్ మార్టిన్ అప్పటి అధ్యక్షుడు ట్రంప్ ద్వారా ఒత్తిడి తెచ్చింది తన F-16 లని అమ్మడానికి! కానీ మోడీ సున్నితంగా తిరస్కరించారు అవే F -16 లు పాకిస్తాన్ దగ్గర 30 ఏళ్ళ నుండి ఉన్న సంగతిని గుర్తు చేస్తూ!
వెస్ట్రన్ దేశాల మార్కెటింగ్ స్ట్రాటజీ!
ఫీలిప్స్ టూత్ పేస్ట్ ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన సరి కొత్త ప్యాక్ లో! లోపల అదే టూత్ పేస్ట్ ఉంటుంది!
లాక్ హీడ్ మార్టిన్ తన F -16 కి కొన్ని మార్పులు చేసింది… F -21 అనే పేరు పెట్టింది.., వెనకటి తరం F16 లకి లేని DECOY ( మిసైల్ ని తప్పుదారి పట్టించే ప్రక్రియ ) ని F21 లో పెట్టి, భారత్ కోసం కొత్త మోడల్ తయారు చేశామాంటూ అమ్మచూపింది LM.
కానీ 30 ఏళ్లుగా పాకిస్తాన్ పైలట్లు F-16 మీద గణనీయమైన అనుభవం సంపాదించారు! F-16 Pros & Cons ఏవిటో వాళ్లకి బాగా తెలిసిపోయాయి! మోడల్ నంబర్ మార్చినంత మాత్రాన మనకి ఉపయోగం ఉండదు! అఫ్కోర్స్! పాకిస్తాన్ కి అమెరికా సైనిక సహాయం కింద F-16 లు ఇచ్చింది కానీ అవి పాత పడిపోయాయి! 2014 నుండి ఇప్పటివరకూ వాటిని అప్ గ్రేడ్ చేయలేదు, కానీ అవి బాగానే పనిచేస్తున్నాయి! అలా F-21 అనబడే ఫైటర్ జెట్స్ ని భారత్ కొనలేదు!
కానీ ఫ్రాన్స్ సంస్థ అయిన డసాల్ట్ ఏవియెషన్ రాఫెల్ అనేది LM కి ప్రధాన పోటీదారుగా ఎదుగుతున్నది కాబట్టి ఈసారి ఎలాగైనా భారత్ చేత తమ F-35 లని కొనేట్లుగా చేయాలి అని లాక్ హీడ్ మార్టిన్ పట్టుదలగా ఉంది గత 2021 నుండి!
నాటో దేశం ఫ్రాన్స్ కి ఈసారి భారత్ నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ జెట్ ఫైటర్స్ ఆర్డర్ దక్కకూడదు అని లాక్ హీడ్ మార్టిన్ ప్లాన్! దీనిని ట్రంప్ ఆచరణలో పెట్టి తీరాలి!
ఈ సంవత్సరం 114 మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ కోసం గ్లోబల్ టెండర్స్ పిలవనున్నది భారత ప్రభుత్వం! MRF. 2 (Multirole Fighter Jets. 2) ఆల్రెడీ మల్టిరోల్ ఫైటర్.1 డీల్ రాఫెల్ తో పూర్తిచేసిన విషయం తెలిసిందే!
అయితే 114 మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ డీల్ అన్నా లాక్ హీడ్ మార్టిన్ కి ఆర్డర్ ఇవ్వాలి లేదా కనీసం 12 F – 35 ఫిఫ్త్ జెనరేషన్ అన్నా భారత్ చేత కొనిపించాలి! మల్టీ రోల్ ఫైటర్ జెట్. 2 కింద LOCKHEED MARTIN F- 15 EX లు వస్తాయి.
రష్యా నుండి అయితే SU -35 మల్టిరోల్ ఫైటర్ జెట్స్ ఈ కేటగిరి కిందకి వస్తాయి. అయితే మన దగ్గర SU – 30 లు 274 ఉన్నాయి. 30 వేల కోట్లతో వాటిని అప్ గ్రేడ్ చేసి సూపర్ సుఖోయ్ గా మార్చే పని జరుగుతున్నది కాబట్టి రష్యా పోటీలో లేనట్లే!
ఇక మిగిలింది పోటీలో ఫ్రాన్స్ కి చెందిన రాఫెల్ F4R! మనం కొన్నది రాఫెల్ F3R మోడల్. గత సంవత్సరం రాఫెల్ F4R అభివృద్ధి చేసి తన ఎయిర్ ఫోర్స్ లో ఇండక్ట్ చేసుకున్నది! రాఫెల్ F3R మరియు రాఫెల్ F4R లు అమ్ని రోల్ ( OMNI ROLL ) ఫైటర్ జెట్స్ గా వ్యవహారిస్తారు!
ఇప్పటికే మన దగ్గర రాఫెల్ F3R లతో పాటు విమాన వాహక యుద్ధ నౌక మీద మొహరించడానికి రాఫెల్ – M కోసం ఆర్డర్ ఇచ్చాము. కాబట్టి 114 మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ కోసం రాఫెల్ F4R ని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది!
ఫ్రాన్స్ ఇప్పటికే 6th జెనరేషన్ ఫైటర్ జెట్ కోసం జెర్మనీతో కలిసి పనిచేస్తున్నది. 2030 నాటికీ ఫ్రాన్స్, జెర్మనీ ల 6th జెనరేషన్ ఫైటర్ జెట్ ఆపరేషన్ లోకి వస్తుంది!
ఫ్రాన్స్ కి 6th జెనరేషన్ ఫైటర్ జెట్ అందుబాటులోకి రాగానే తన రాఫెల్ సీరీస్ జెట్స్ తయారీని భారత్ కి తరలిస్తానని హామీ ఇచ్చింది! బహుశా ఇది 2030 నాటికీ కార్యరూపం దాల్చవచ్చు. తద్వారా ప్రపంచ దేశాలలో ఉన్న రాఫెల్ జెట్స్ సర్వీసింగ్ మరియు మెయింటనేన్స్ అనేది భారత్ నుండి జరుగుతుంది!
So! మల్టీ రోల్ ఫైటర్ జెట్ డీల్. 2 కి సంబంధించి మన ఎయిర్ ఫోర్స్ కి రాఫెల్ F4R ఫేవరెట్ అవుతుంది. పైగా F4R మోడల్ ఫ్రాన్స్ మరియు మన దగ్గర మాత్రమే ఉంటాయి! ఒకే సారి 114 ఫైటర్ జెట్స్ డీల్ అనేది ఫ్రాన్స్ కి అయినా అమెరికాకి అయినా అతి పెద్ద ఆర్డర్ అవుతుంది. కనీసం మూడేళ్ల పాటు తమ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లకి పని ఉంటుంది!
మీడియం వెయిట్ మల్టిరోల్ ఫైటర్ జెట్ డీల్ 1 ని లాక్ హీడ్ మార్టిన్ ఫ్రాన్స్ కి వదులుకోవాల్సి వచ్చింది రాఫెల్ రూపంలో! ఇక విమాన వాహక యుద్ధ నౌక కోసం రాఫెల్ M తో F -18 సూపర్ హార్నెట్ పోటీపడి చివరికి రాఫెల్ M కి కోల్పోవల్సి వచ్చింది!
ఇప్పుడు 114 జెట్స్ డీల్ కోసం F -15 EX తో రాఫెల్ F4R పోటీ పడపోతున్నది! ఖచ్చితంగా రాఫెల్ కొట్టుకెళుతుంది!
ఇది జరగకూడదు!
అధికారంలోకి వచ్చీ రాగానే 2020 లో ఆఫ్ఘానిస్థాన్ లో అమెరికా వదిలేసిన 7 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాలని తమకి అప్పచెప్పాలని ట్రంప్ అడుగుతున్నాడు! తాలిబాన్లు ఆయుధాలు తిరిగి ఇచ్చేస్తే పాకిస్తాన్ ది పై చేయి అవుతుంది! అది భారత్ కి నష్టం అవుతుంది!
114 ఫైటర్ జెట్స్ డీల్ విషయంలో లాక్ హీడ్ మార్టిన్ F -15 EX లేదా F-15 STRIKE EAGLE కి ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది మనం. లేదా F 35 లని కొనాల్సి ఉంటుంది! లేకపోతే బాంగ్లాదేశ్ విషయంలో ఫ్రీ హ్యాండ్ ఉండదు!
ఎలావుంది డీప్ డీప్ స్టేట్ ప్లాన్? CONTD.. PART 3
Share this Article