Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ట్రంప్ – రెడ్ కార్డ్..! ఫిఫా పోటీల్లోనూ తనే ‘సుప్రీం రెఫరీ!!

July 7, 2026 by M S R

.

( గోపు విజయకుమార్ రెడ్డి ) … బాలోగన్ రెడ్ కార్డు వివాదం: అసలు ఏం జరిగింది? … అమెరికా సహ-ఆతిథ్యం వహిస్తున్న 2026 ఫిఫా ప్రపంచకప్‌లో అమెరికా స్టార్ ఫార్వర్డ్  బాలోగన్ బోస్నియా- హెర్జెగోవినాతో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడు తారిక్ కాలి మడమపై బూటుతో తొక్కిన ఘటనకు నేరుగా రెడ్ కార్డు అందుకున్నాడు. ఫిఫా నిబంధనల ప్రకారం నేరుగా రెడ్ కార్డు వస్తే ఆటగాడికి తదుపరి మ్యాచ్‌కు ఆటోమేటిక్‌గా ఒక మ్యాచ్ నిషేధం అమల్లోకి వస్తుంది.

అంటే బాలోగన్ బెల్జియంతో జరిగే రౌండ్ ఆఫ్-16 మ్యాచ్‌కు దూరం కావాల్సి ఉంది. అయితే ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఫిఫా అధ్యక్షుడు జియానీకు ఫోన్ చేసి, రెడ్ కార్డు నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని కోరినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. అనంతరం ఫిఫా క్రమశిక్షణ కమిటీ అరుదుగా ఉపయోగించే ఆర్టికల్ 27ను వినియోగించి బాలోగన్‌పై ఉన్న ఒక మ్యాచ్ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో అతడు బెల్జియంపై ఆడేందుకు అర్హుడయ్యాడు.

Ads

రెడ్ కార్డ్

ఈ నిర్ణయం వెలువడగానే పెద్ద వివాదం చెలరేగింది. బెల్జియం ఫుట్‌బాల్ సమాఖ్య ఫిఫా నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ, బాలోగన్ అర్హతపై అధికారికంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్ణయానికి స్పష్టమైన కారణాలు చెప్పలేదని, టోర్నమెంట్ నిష్పాక్షికతపై ఇది ప్రశ్నలు లేవనెత్తుతోందని పేర్కొంది.

యూరోపియన్ ఫుట్‌బాల్ సమాఖ్య UEFA కూడా ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకసారి రెడ్ కార్డు పడితే వచ్చే ఆటోమేటిక్ నిషేధాన్ని టోర్నమెంట్ మధ్యలో ఇలా నిలిపివేయడం నిబంధనల విశ్వసనీయతను దెబ్బతీస్తుందని, ఇది ప్రమాదకరమైన దృష్టాంతమని విమర్శించింది.

మరోవైపు ట్రంప్ మాత్రం తాను ఫిఫాతో మాట్లాడిన విషయాన్ని బహిరంగంగానే అంగీకరించారు. తాను మ్యాచ్ చూసానని, బాలోగన్ చేసిన ఫౌల్ అంత తీవ్రమైనది కాదని భావించి సమీక్షించాలని కోరానని చెప్పారు.

ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినో మాత్రం తుది నిర్ణయం పూర్తిగా స్వతంత్ర క్రమశిక్షణ కమిటీ తీసుకుందని, తాను ట్రంప్‌తో మాట్లాడినప్పటికీ న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని వివరణ ఇచ్చారు.

సోషల్ మీడియాలో ఎందుకు అంత చర్చ?
ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు అమెరికా ప్రభుత్వం ఫిఫాపై ప్రభావం చూపిందని, “ఫిఫాను కూడా మేమే ప్రభావితం చేయగలం” అనే సందేశం ఇచ్చే ప్రయత్నమని ఆరోపిస్తున్నాయి.

పేరుకు ఇవి సోషల్ మీడియా యాక్టివిస్టుల అభిప్రాయాలు మాత్రమే కావచ్చు. కానీ ట్రంప్ ఫోన్ చేసిన విషయం, ఫిఫా నిషేధాన్ని నిలిపివేసిన విషయం ధృవీకరించబడింది.., ఫిఫా రాజకీయ ఒత్తిడికి లోబడి నిర్ణయం తీసుకుందనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి… వీడూ వీని వేషాలు, దేన్నీ ఒదిలిపెట్టడం లేదు!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ట్రంప్ – రెడ్ కార్డ్..! ఫిఫా పోటీల్లోనూ తనే ‘సుప్రీం రెఫరీ!!
  • TGRPDCL @ రైతు డిస్కమ్ – రేవంత్ రెడ్డి సర్కారు భలే ప్లాన్ !!
  • రొనాల్డో శకం ముగిసింది – ఫుట్‌బాల్ సామ్రాట్ కన్నీటి వీడ్కోలు!!
  • Telangana’s Spiritual Renaissance – Revanth Vision for Grandeur
  • బాగా నచ్చిన వార్త ! ఒక కప్పు కింద ఆరుగురు అత్తలు- 20 మంది కోడళ్లు!!
  • తెలంగాణకు నూతన ఆధ్యాత్మిక శోభ – రేవంత్ రెడ్డి భక్తి పర్యాటకం!!
  • కన్నెపల్లిపై అదే స్క్రిప్టు – అదే ప్రహసనం — కాకపోతే ఫేస్ మారింది!!
  • కథ బాగుంది… వెరయిటీగా ఉంది… ఆలోచనాత్మకంగా ఉంది…
  • ఏ కెరటం ఏ తీరానికి చేరుతుందో – ఈ మోహిని ఇప్పుడేం చేస్తోందంటే?
  • బాలమురళి పాడేది అసలు సంగీతమే కాదు- హైకోర్టులో ఓ కేసు …

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions