.
Pardha Saradhi Potluri ……… బాంగ్లాదేశ్ విషయం మోడీ చూసుకుంటారు! అమెరికన్ డీప్ స్టేట్ కి బాంగ్లాదేశ్ లో పనిలేదు…. డోనాల్డ్ ట్రంప్!
జస్ట్, ఇలాంటి బహిరంగ ప్రకటన కోసమే ఎదురు చూస్తున్నది! ఫ్రాన్స్, అమెరికా దేశాల పర్యటనలో ఉన్న మోడీ అమెరికా పర్యటనలో భాగంగా నిన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో సమావేశం అయ్యారు.
Ads
ట్రంప్ మోడీ సమావేశానికి ప్రపంచ మీడియా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది! ఇతర ప్రాధాన్యాతలు ఎలా ఉన్నా అతి ముఖ్యమైన బాంగ్లాదేశ్ సమస్య విషయంలో ట్రంప్ కుండ బద్దలు కొట్టినట్లుగా స్పష్టంగా చెప్పేశాడు…. బాంగ్లాదేశ్ విషయం భారత ప్రధాని మోడీ చూసుకుంటారు! అంటే బాంగ్లాదేశ్ విషయంలో అమెరికా జోక్యం ఉండదు అని!
So! తదుపరి కార్యాచరణ ఏమిటో ఇప్పటికే సిద్ధంగా ఉన్నా, అమెరికన్ స్ట్రాటజీ ఏమిటో బహిరంగంగా బయటికి వచ్చే వరకూ వేచిచూస్తున్నాడు మోడీ! ట్రంప్ ప్రకటన ఇటు పాకిస్థాన్ తో పాటు ISI తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న బాంగ్లాదేశ్ ఆర్మీ జెనరల్స్ కి ఒక హెచ్చరిక జారీ చేసినట్లు అయ్యింది!
అమెరికా నేరుగా జోక్యం చేసుకుంటేనే మంచిది అనేటట్లుగా ఉండబోతున్నది మోడీ తీసుకోబోయే చర్యలు! షేక్ హసీనాని మళ్ళీ బాంగ్లాదేశ్ ప్రధాని పీఠం మీద కూర్చోపెట్టే బాధ్యత మోడీ మీద ఉండబోతున్నది ఇకమీదట!
ముందు బాంగ్లాదేశ్ సైన్యంలో ఉన్న పాకిస్థాన్ అనుకూల జెనరల్స్ పనిపట్టాల్సి ఉంటుంది! ఏది ఏమైనా జో బిడెన్ సృష్టించిన సంక్షోభానికి త్వరలో ముగింపు పలకబోతున్నారు మోడీ! మన దేశంలో ఉన్న 5 కోట్ల మంది విదేశీయులని తిరిగి పంపాల్సిన సమయం కూడా వచ్చింది!
మోడీ వ్యూహం!
అమెరికాలో ఎలాంటి పత్రాలు లేని భారతీయులని తిరిగి భారత్ స్వీకరించడానికి సిద్ధంగా ఉంది అని ప్రకటన వచ్చినప్పుడే మోడీ వ్యూహం అర్ధం అయ్యింది.
భారత్ తన పౌరులని స్వీకరించడానికి సిద్ధపడ్డది కాబట్టి బాంగ్లాదేశ్ కూడా తమ పౌరులని తిరిగి తీసుకోవాలి అనే సంకేతం కూడా ఇచ్చినట్లయ్యింది!
అఫ్కోర్స్! రెండేళ్ల క్రితమే అప్పటి బాంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ లో అక్రమంగా ఉంటున్న తమ పౌరులని తిరిగి తీసుకోవడానికి అంగీకరించింది! చేయాల్సిందల్లా ఎవరు అక్రమంగా ఉంటున్నారో గుర్తించడమే!
********************
ట్రంప్ మోడీ విలేఖరుల సమావేశం!
మోడీ, ట్రంప్ సంయుక్త విలేఖరుల సమావేశంలో భారత విలేఖరి ట్రంప్ ని ఉద్దేశిస్తూ ప్రశ్న వేసాడు.
విలేఖరి : అమెరికాలో భారత వ్యతిరేక శక్తులు భారత్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కదా దీని మీద మీ అభిప్రాయం ఏమిటీ ..?
ట్రంప్ : Can’t understand a word ( accent ). ఒక్క మాట కూడా అర్ధం కాలేదు …
బహుశా భారత్ కి చెందిన పెయిడ్ మీడియా గురుంచి ట్రంప్ కి తెలిసి ఉండవచ్చు కాబట్టి తన పక్కనే ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఇబ్బంది కలగకుండా ఉండాలని ట్రంప్ అలా అని ఉండవచ్చు!
గత వారం ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ట్రంప్ తో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మహిళా విలేఖరి ఒకరు ట్రంప్ ని ప్రశ్న వేసినప్పుడు సమాధానంగా ట్రంప్ మాట్లాడుతూ మీ వాయిస్ బాగుంది అలాగే మీ ఉచ్చారణ (accent ) కూడా బాగుంది అయితే ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు కానీ గుడ్ లక్ అంటూ బదులు ఇచ్చాడు!
డీప్ స్టేట్ ని సర్వ నాశనం చేస్తాను – ట్రంప్!
ఒట్టిదే! తనని కాదని ఏ దేశ వ్యవహారాలలో చేయి పెట్టవద్దు అని ఒప్పించి ఉంటాడు ట్రంప్! లేకపోతే ఆయుధ లాబీకి ప్రయోజనం చేకూరే విధంగా ట్రంప్ ఎలా వ్యవహరించగలుగుతున్నాడు?
వచ్చే అయిదేళ్లలో కనీసం 500 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరగాలి అనే ఒప్పందం చేసుకున్నారు ట్రంప్ మోడీలు. మిగతా రంగాలు ఎలా ఉన్నా అమెరికన్ ఆయుధాలు భారత్ కొనే విధంగా వ్యవహరిస్తున్నాడు ట్రంప్!
భారత్ కి F -35 ఫైటర్ జెట్లు అమ్మాలి అనే ప్రతిపాదన వచ్చింది ట్రంప్ మోడీ చర్చలలో! అదేదో మన దేశం F -35 ఫైటర్ జెట్ కొనడానికి తహతహలాడుతున్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తున్నది మీడియా కానీ అది నిజం కాదు! రేపు వివరంగా తెలియచేయడానికి ప్రయత్నిస్తాను!
Share this Article