.
తెలుగులో వాచాలత్వం అని ఓ పదం ఉంది… మెదడుకూ నోటికీ సంబంధం లేని పిచ్చి కూతలు… ఈ పదానికి అసలు సిసలు ఐకన్ ది గ్రేట్ ట్రంప్… నోరిప్పితే చాలు ఏతులు, ఎచ్చులు…
నేను ఎనిమిది యుద్ధాలను ఆపాను అని కదా తన క్లెయిమ్… నాకు దక్కకపోతే అది అమెరికాకే అవమానం అనీ కూశాడు కదా… పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు ఫ్యాక్ట్ చేశాయి, తను నిజంగానే ఎనిమిది యుద్ధాల్ని ఆపాడా అని…
Ads
అవీ చెప్పుకుందాం… ముందుగా పతకాలు ప్రచారంతో, అదీ స్వీయ డప్పుతో రావు… నిజమైన ప్రజాస్వామిక పోరాటాలకు, తెగింపు కార్యాచరణకూ వస్తాయి… అదే ట్రంపుకీ, నోబెల్ విజేత మచాడో నడుమ అసలైన తేడా…
- నోబెల్ కమిటీ ఏమన్నదో తెలుసా… ‘‘“శాంతి అనేది కేవలం ఓ శబ్దం కాదు — అది స్ఫూర్తి. మచాడో ఆ స్ఫూర్తికి ప్రతీక.” —
మరి ట్రంప్… సింపుల్‌గా, స్ట్రెయిట్‌గా చెప్పాలంటే… “యుద్ధం తనే, శాంతి కూడా తనే!” అంటే.,.. యుద్ధానికి ఆయుధాలు అమ్మేది కూడా తనే, తర్వాత “peace deal” కోసం చేతులు కలిపేది కూడా తనే… పెంట పంచాయితీలు పెట్టి, మంటలు రేపేది తనే…
ఆయన చెప్పిన ఆ “ఎనిమిది యుద్ధాల” కథలు… ఇదిగో ఒక్కొక్కదానికి ఫ్యాక్ట్ చెక్….
⚔️ 1. కంబోడియా – థాయ్‌లాండ్
ట్రంప్ చెప్పినది: “నేను కాల్ చేసి రెండు దేశాల మధ్య శాంతి కుదిర్చా.”
ఫ్యాక్ట్ చెక్:
ఆగస్టు 2025లో ఐదు రోజుల సరిహద్దు ఘర్షణ జరిగింది.
మధ్యవర్తిత్వం చేసినవారు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, చైనా ప్రతినిధులు.
ట్రంప్ ఫోన్ కాల్ చేశారని కంబోడియా ప్రస్తావించినా, ప్రధాన ఒప్పందం ఆసియన్ (ASEAN) వేదికలో కుదిరింది.
⚔️ 2. కొసోవో – సెర్బియా
ట్రంప్ చెప్పినది: “మొదటి సారి నేనే వారిని చర్చల టేబుల్ దగ్గర కూర్చోపెట్టా.”
ఫ్యాక్ట్ చెక్:
2020లో ట్రంప్ మొదటి పదవీకాలంలో వాణిజ్య ఒప్పందం సంతకం జరిగింది.
కానీ ఆ చర్చల బేస్ వర్క్ యూరోపియన్ యూనియన్‌దే.
యుద్ధం అప్పటి నుండి తిరిగి రాలేదు, కానీ సంబంధాలు ఇంకా తలకిందులే.
⚔️ 3. కాంగో (DRC) – రువాండా
ట్రంప్ చెప్పినది: “ఆఫ్రికాలో శాంతి తెచ్చా.”
ఫ్యాక్ట్ చెక్:
ఈ రెండు దేశాల మధ్య 2025 జూన్‌లో కుదిరిన ఒప్పందం ప్రధానంగా ఆఫ్రికన్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగింది.
అమెరికా “పాలిటికల్ సపోర్ట్” ఇచ్చినదంతే.
⚔️ 4. భారత్ – పాకిస్తాన్
ట్రంప్ చెప్పినది: “నా జోక్యంతో కాల్పులు ఆగాయి.”
ఫ్యాక్ట్ చెక్:
మే 2025లో రెండూ దేశాలు పరస్పరం వైమానిక దాడులు జరిపాయి.
తర్వాత యుద్ధం స్వయంగా చల్లబడింది; ఏమీ ఒప్పందాలు, సంతకాలు కాలేదు.
పాకిస్తాన్ మాత్రమే ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపింది. భారత్ మాత్రం “మా మధ్యలో ఎవ్వరూ లేరు” అంది.
⚔️ 5. ఇజ్రాయెల్ – ఇరాన్
ట్రంప్ చెప్పినది: “తీర్మానాత్మక ceasefire కుదిర్చా.”
ఫ్యాక్ట్ చెక్:
జూన్‌లో ఇజ్రాయెల్ ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసింది. అమెరికా కూడా దాడుల్లో పాల్గొంది.
తర్వాత అమెరికా- ఖతర్ మధ్య చర్చల ఫలితంగా తాత్కాలిక ceasefire వచ్చింది.
అంటే యుద్ధం మొదలైనదీ, ఆగినదీ ఆయన పాలనలోనే.
⚔️ 6. ఈజిప్ట్ – ఇథియోపియా
ట్రంప్ చెప్పినది: “నైల్ డ్యామ్ వివాదం ముగించా.”
ఫ్యాక్ట్ చెక్:
ఇరుదేశాల మధ్య ఎప్పుడూ యుద్ధం జరగలేదు.
కేవలం చర్చలే జరిగాయి; ట్రంప్ మధ్యవర్తిత్వం జరగలేదు.
⚔️ 7. ఆర్మేనియా – అజర్‌బైజాన్
ట్రంప్ చెప్పినది: “వాషింగ్టన్‌లోనే శాంతి ఒప్పందం కుదిరింది.”
ఫ్యాక్ట్ చెక్:
నిజమే — ఆగస్టు 2025లో అమెరికా మధ్యవర్తిత్వంలో ఒక తాత్కాలిక ఒప్పందం కుదిరింది.
కానీ ట్రంప్ తర్వాత ఫాక్స్ ఛానెల్‌లో మాట్లాడుతూ — “నేను అజర్‌బైజాన్, అల్బేనియా మధ్య యుద్ధం ఆపేశా!”
అని చెప్పి ప్రపంచాన్ని నవ్వించాడు…
⚔️ 8. ఇజ్రాయెల్ – హమాస్ (గాజా యుద్ధం)
ట్రంప్ చెప్పినది: “ఇది నా 20 పాయింట్ల peace plan ఫలితం.”
ఫ్యాక్ట్ చెక్:
ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరిగిన తాజా కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఉంది.
కానీ అదే సమయంలో అమెరికా ఆయుధాల సరఫరా కూడా కొనసాగించింది.
కాబట్టి ఆయన పాత్ర “శాంతి దూత” కంటే “ప్రమోటర్”లా ఉంది…
ఈ “ఎనిమిది యుద్ధాల్లో” మూడు చోట్ల నిజంగా ceasefire కుదిరింది. కానీ వాటిలో ట్రంప్ ప్రధాన పాత్ర కాదు —
ప్రతీసారి మైక్ దగ్గర మాత్రం ఆయనే ఉండేవారు.
చివరి ముచ్చట… ట్రంప్ శాంతి గురించి ట్వీట్లు వ్రాసాడు. మచాడో మాత్రం శాంతి కోసం ప్రాణం పణంగా పెట్టింది. ట్రంప్ కోరుకున్నాడు — మచాడో సాధించింది. చివరగా… “యుద్ధం కూడా తానే మొదలుపెట్టి, శాంతి మంత్రం కూడా తానే జపిస్తే — అది నాయకత్వం కాదు, నాటకం.” అంతటి శాంతిదూతకు ఉక్రెయిన్ – రష్యా వార్ ఆపడం ఎందుకు సాధ్యం కాలేదట మరి..! ఉక్రెయిన్ వెనుక ఉండి యుద్ధం చేస్తున్నదే తను కాబట్టి..!!
Share this Article