ఫేస్‌బుక్‌లోనే కావచ్చు… మొత్తానికి ఎక్కడో చూశాను… ఆసక్తికరంగా ఉంది… ఎవరో చేసిన సర్వే ఇది… వివిధ సమాచార ప్రసార మార్గాల్లో ప్రజలు ఏ న్యూస్ విశ్వసిస్తున్నారు..? ఇదీ సర్వే అంశం… ఇంట్రస్టింగ్… నిజానికి ఇది తెలియాల్సిన అవసరం కూడా ఉంది… సర్వే చేసిస సంస్థ క్రెడిబులిటీ, సర్వే శాంపిల్ గట్రా అంశాలపై పెద్ద క్లారిటీ లేదు కానీ… ఉన్న ఈ డిటెయిల్స్‌నే పరిశీలిస్తే… కొన్ని విశేషాలున్నయ్… కొన్ని సందేహాస్పదాలూ ఉన్నయ్…
మేం ఎవరి వార్తల్ని నమ్ముతాం… ఇదీ సర్వే స్థూలాంశం… స్క్రోల్, వైర్ అని వెబ్ న్యూస్ పోర్టల్స్ ఉన్నాయి కదా… అవి పక్కా బీజేపీ, మోడీ వ్యతిరేక ప్లాట్‌ఫామ్స్… వాటిల్లో విశ్లేషణలు, వార్తలు చదువుతుంటే సగటు బీఆర్ఎస్, లెఫ్ట్, కాంగ్రెస్ కార్యకర్తలు తమ ఉద్దేశాలను, అభిప్రాయాలను చెబుతున్నట్టే అనిపిస్తాయి… ఈ సర్వేలో స్క్రోల్ వార్తల మీద 27 శాతం మందికి నమ్మకమే లేదట… సేమ్, దివైర్ పోర్టల్ మీద కూడా…
Ads
అలాగని ప్యూర్ బీజేపీ టీవీ రిపబ్లిక్ టీవీ మీద కూడా ప్రేక్షకులకు పెద్ద సదభిప్రాయమేమీ లేదు… అందుకేనేమో బార్క్ రేటింగ్స్‌లోనూ తన నంబర్ వన్ స్థానాన్ని ఎప్పుడో కోల్పోయింది… కొన్ని అపమార్గాల్లో నంబర్ వన్ స్థానాన్ని పొందిందనే ఆరోపణలు, మహారాష్ట్ర పోలీసుల కేసులు గట్రా తెలుసు కదా… ఈ చానెల్ వార్తల్ని జస్ట్ 58 శాతం ప్రేక్షకులే నమ్ముతారట… ఈ మొత్తం చార్ట్‌లో బాగా ఆసక్తికరంగా అనిపించింది డీడీ న్యూస్‌ను 70 శాతం మంది నమ్ముతారట… అదే హయ్యెస్ట్… కానీ ఆ న్యూస్ చూసేవాళ్లెందరు..? ఇదీ అసలు ప్రశ్న…
శాటిలైట్ టీవీ చానెళ్లు, సోషల్ మీడియా విజృంభణ తరువాత దూరదర్శన్‌లో న్యూస్ ఎవరు చూస్తున్నారని… పైగా డీడీ రీచ్ ఎంత..? ప్రతి పల్లెకూ శాటిలైట్ చానెళ్లు చేరిపోయాయి దాదాపుగా… మరీ ముఖ్యంగా డీటీహెచ్ వచ్చాక మరీనూ…! మారుమూల పల్లెల్లోనూ ఒకటీరెండు ఇళ్లున్నచోట కూడా ఇళ్లపై, గుడిసెలపై డీటీహెచ్ ఛత్రీలు కనిపిస్తున్నాయి… నెక్స్ట్ ఎక్కువ ట్రస్ట్ ఉన్న వార్తలు ఆల్ ఇండియా రేడియో… ఈ ప్రసారాలు కూడా గణనీయంగా పడిపోయాయి…
నగరాల్లో ఎఫ్ఎం చానెళ్లలో సినిమా ఆధారిత ప్రోగ్రాములు కాస్త నడుస్తున్నాయి గానీ… రేడియో న్యూస్ శ్రవణం తక్కువే… పైగా డీాడీ, రేడియో స్టిల్ ఈరోజుకూ ప్రభుత్వ అనుకూల ప్రసారాలే తప్ప స్వతంత్రత లేదు… సో, నిష్పాక్షికత ఉండదు… అందుకని ఈ చార్ట్ విశ్వసనీయత మీదే డౌట్ వస్తోంది… ఈ డౌట్‌ను బలపరిచే మరో అంశం టైమ్స్ ఆఫ్ ఇండియా విశ్వసనీయత… డీడీ, రేడియో తరహాలో 69-70 శాతం నమ్ముతారంటే సందేహమే…
ప్రాంతీయ చానెళ్లు, పత్రికల గతేమిటి..? 20 శాతం మంది అసలు నమ్మరట… ఏమో, బహుశా తెలుగు పత్రికలు, టీవీ చానెళ్లను ఈ సర్వేలో ఇంక్లూడ్ చేయనట్టుంది… సగం మంది ఆ వార్తల్ని నమ్మరు, నమ్మేట్టు ఉండవు, ఉత్త డప్పులు మాత్రమే… సో, ఈ సర్వేయే ఎందుకోగానీ విశ్వసనీయంగా అనిపించడం లేదు…
Share this Article