.
తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి విషయంలో అపచారానికి పాల్పడిన ధూర్తులను టీడీపీ ప్రభుత్వం గానీ, టీటీడీ గానీ ఏదో శిక్షిస్తుందనే భ్రమలేమీ లేవు ఎవరికీ… నేను ప్రసాదం నాణ్యతను పెంచానని చెప్పుకునే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి ఓ చిన్న సవాల్…
శివజ్యోతి అనే ఓ తిక్క కేరక్టర్ ఉంది తెలుగు టీవీ సెలబ్రిటీల్లో… ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును తెలంగాణ యాసలో చదివి వీ6లో సావిత్రక్క పేరిట పాపులరైంది… దాన్ని వదిలేసింది, బిగ్‌బాస్ వెళ్లింది, అక్కడ ఈ శోకదేవత ఏం ఉద్దరించిందో వదిలేస్తే… బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిందనే ఆరోపణలూ వచ్చాయి ఆమె మీద…
Ads
తను భర్త, ఇతర స్నేహితులతో తిరుమల వెళ్లింది… అంటే, దేవుడి మీద నమ్మకం, భక్తితోనే కదా… క్యూ లైన్‌లో భక్తులకు ప్రసాదం పెడతారు… దాని మీద ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి… పిచ్చి కూతలు చేసింది…
‘‘తిరుమలలో కాస్ట్‌లీ ప్రసాదం అడుక్కుంటున్నాం… రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం మేమే’’ అని కామెంట్ చేసింది… అది ప్రసాదాన్ని కించపరచడమే… ఈ నిర్వాకానికా తిరుమల వెళ్లింది..? దేవుడి పట్ల కూడా అపచారమే… ఈ తత్వానికి, ఈ ధోరణికి తెలుగులో చాలా పేర్లున్నాయి… వార్తా సంస్కారం రీత్యా ఆ పదాలు వాడటం లేదు…

బీఆర్ నాయుడూ… తిరుమలలో రీల్స్ చేయడం మీద నిషేధం అమలులో ఉందా..? అక్కడికి వచ్చి మరీ ప్రసాదం పట్ల నీచంగా వ్యాఖ్యలతో అపహాస్యం చేసిన ఆమెపై ఏదైనా చర్య చేతనవుతుందా టీటీడీకి..? ఈ చిల్లర వేషాలు, చేష్టలు తిరుమల ప్రసాద పవిత్రతను గేలి చేయడమే.,. సరే, ఆ పోస్టు రిమూవ్ చేసి, సారీ చెబుతుందేమో… కానీ ఇలాంటివాళ్లకు ఓ లెసన్ నేర్పగలదా టీటీడీ..? చేతనవుతుందా..?!

సరే, మరో విషయానికి వద్దాం… శ్రీముఖి, నిధి అగర్వాల్, అమృతా చౌదరి బెటింగ్ యాప్స్ ప్రమోషన్ల బాగోతంపై విచారణకు హాజరయ్యారు… అబ్బే, అవి స్కిల్ గేమ్స్ అనుకున్నాం, అవి బెటింగ్ యాప్స్ అని తెలియదు అని అమాయకపు ఫేసులు పెట్టి స్టేట్‌మెంట్లు ఇచ్చారు…
ప్రమోషన్ నిజం… డబ్బులు తీసుకున్నది నిజం… బోలెడుమంది సినిమా, టీవీ సెలబ్రిటీల మీద కేసు నడుస్తోంది… పైగా ఏమీ తెలియనట్టు వేషాలు… తెలియకచేసినా నేరం నేరమే… విచారణ జరుగుతున్న కేసులోని సెలబ్రిటీలే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు… మరి వారి మాటేమిటి..? కొందరికే పరిమితం చేయడం దేనికి..?
అనేక మంది బెటింగ్ యాప్స్ ద్వారా డబ్బు నష్టపోయి, ఆత్మహత్యలు కూడా చేసుకున్న ఘటనలు ఉన్నాయి… మరి ఈ బెటింగ్ యాప్స్ ప్రమోటర్ల మీద, ప్రమోషన్ చేసినవాళ్ల మీద సీరియస్‌నెస్ నిజంగా కనిపిస్తున్నదా అంటే..? సరైన సంతృప్తికరమైన సమాధానం అయితే దొరకడం లేదు..!!
Share this Article