Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తిరుమల వెంకన్నా… ఈ బ్యూరోక్రాట్లను నమ్మితే ‘మునిగిపోతవ్’… బహుపరాక్…

August 30, 2021 by M S R

కోట్ల మంది హిందువులకు ఆరాధ్యుడు తిరుమల వెంకటేశ్వరస్వామి… అత్యంత ధనిక హిందూ దేవుడు కూడా వెంకన్నే… ప్రతి నిర్ణయం వెనుక, ప్రతి ఆలోచన వెనుక ఓ ధార్మిక భావన ఉండాలి… అక్కడ నియుక్తులయ్యే ఏ అధికారికీ ఆ సోయి ఉండదు… ఇతరత్రా ప్రభుత్వ వ్యవహారాలు, పాలన ధోరణులు, ఇగోయిస్టిక్ వైఖరులే ప్రభావితం చేస్తూ ఉంటయ్ వాళ్లను… ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదీ అంటే… తాజా ఉదాహరణ సంప్రదాయ భోజనం…! నిజానికి సంప్రదాయ భోజనం అనే పదప్రయోగమే తప్పు… పూర్వకాలపు వంగడాలతో, సేంద్రీయంగా పండించే దినుసులతో వండే వంటను సంప్రదాయ భోజనం అని ముద్ర వేయడమే తప్పు… అంటే, ఇప్పుడు భక్తులకు పెడుతున్నది సంప్రదాయేతర భోజనమా..? అక్కడి ఉన్నతాధికారుల బుర్రలకు జోహార్లు ప్రభూ…

ttd

విషయానికొస్తే… ఏదో సంప్రదాయ భోజనం పేరిట ఏవో సనాతన వంగడాల పంటతో చేసిన ఆహారాన్ని పెట్టాలని అనుకున్నారు టీటీడీ పెద్దలు… మంచిదే… ఖండించడానికి ఏమీ లేదు, ఆహ్వానించాలి కూడా… కానీ దానికి కాస్ట్ టు కాస్ట్ పేరిట డబ్బు వసూలు చేయాలని అనుకున్నారు… మీ అభిప్రాయాలు చెప్పండీ అనడిగారు వాళ్లే… వద్దురా నాయనలారా… అన్నదానం అంటేనే ఓ ఉచిత ప్రసాదం, దాన్ని కమర్షియలైజ్ చేయకండి, కొందరికి మాత్రమే ఆ సోకాల్డ్ సంప్రదాయ భోజనం పెట్టే పరిమితి ఉంటే, దాన్ని ముందుగా విశేష పూజల కోసం బోలెడు డబ్బు పోస్తున్న భక్తులకు పరిమితం చేయండి, అంతేతప్ప రేటు పెట్టకండి, అలా పెడితే అన్నసత్రానికీ, హోటల్‌కూ తేడా ఏముంది..? దేవుడి ప్రసాదంగా భావించే అన్నాన్ని అమ్మకండిరా బాబులూ అని మొత్తం సోషల్ మీడియా మొత్తుకుంది… దిక్కుమాలిన మెయిన్ స్ట్రీమ్‌కు ఎప్పటిలాగే సిగ్గూశరం లేదు కాబట్టి స్పందించలేదు… కోట్లాది మంది వెంకన్న భక్తుల్లో ఓ యాంటీ- సెంటిమెంట్ ప్రబలింది… సహజం… అభిప్రాయాలు అడిగిందీ వాళ్లే… తరువాత అభిప్రాయాలు చెబితే…. అసత్యప్రచారం మానండి, చట్టప్రకారం కేసులు పెడతాం అని తమకు అలవాటైన రీతిలో బెదిరించారు నిన్న… అంతకుమించి వాళ్లకు ఇంకేమీ చేతకాదు కాబట్టి… వాళ్లు అధికారులు కాబట్టి… వాళ్లు బడితెలు చేతబట్టిన భృత్యులే తప్ప వాళ్ల బుర్రలు spiritually ఫెయిర్ అని కాదు కదా… వాళ్లు ఎలాగూ మారరు.. సోవాట్…? కేసులు పెడితే మంచిదేగా… టీటీడీ ఆలోచన ధోరణుల మీద కోర్టుల్లో చర్చ జరిగితే మంచిదేగా అనుకున్నారు భక్తగణం…

Ads

వ్యతిరేకత ప్రబలుతోంది అనుకున్న ఛైర్మన్ సుబ్బారెడ్డి అర్జెంటుగా రంగప్రవేశం చేసి… అబ్బే, దాన్ని ఆపేస్తున్నాం, పాలకమండలిలో చర్చ జరగకుండా అధికారులు తీసుకున్న నిర్ణయం అది, అన్నదానానికి రేటు కరెక్టు కాదు అంటున్నాడు… గుడ్… దానం అంటేనే ఉచితం, రేటు అంటేనే వ్యాపారం… ఆ తేడా అర్థమైంది సంతోషం… అయితే సోకాల్డ్ సంప్రదాయ భోజనం పూర్తిగా ఆపేయాలనేది కాదు భక్తుల భావన… పెట్టండి, కానీ ఉచితంగానే పెట్టండి, మీరు వ్యాపారం చేయకండి, ఎవరికి ఆ భోజనం పెట్టాలో మీ ఇష్టం అన్నారు సోషల్ భక్తగణం… అంతేతప్ప ఆపేయండి అనడగలేదు… ఇది మొదటిసారి ఏమీ కాదు, ఏదో ఓ పిచ్చి నిర్ణయం వెంకన్న తలకు రుద్దడం, తరువాత భక్తులు బూతులందుకునేసరికి వెనక్కి తగ్గడం… అంతా హైందవం ఖర్మ… రాజకీయం తప్ప ఇంకేమీ తెలియని ట్రస్టు బోర్డు సభ్యుల అపూర్వతెలివి…. ఆధ్యాత్మికం, ధార్మికం అంటే సోయి లేని మెదళ్లు… ఇప్పుడూ అంతే…. జగన్ పాలనలోనే కాదు, ఆ కుర్చీ మీదకు ఎవరొచ్చినా ఇదే దుస్థితి… భక్తులది కాదు, దేవుడిది…!! ముందుగా ఈ చర్చ మొదలుపెట్టిన ’ముచ్చట’ ఇప్పటికీ ఒకే మాట మీద ఉంది… జగన్, ఓ ఆధ్యాత్మిక బ‌ృందాన్ని స్వర్ణ దేవాలయాన్ని పంపించు, వీలైతే నువ్వే వెళ్లు… ధార్మిక భావన ఏమిటో, ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఎలా ఉండాలో కాస్తయినా అర్థమవుతుంది… ఈ సోకాల్డ్, టీటీడీ డొల్ల ఉన్నతాధికారులను నమ్ముకుంటే ‘‘మునిగిపోతవ్’’…!! చివరగా :: అన్నా, సుబ్బన్నా… నీ సతీమణి ధార్మికురాలు, ఎస్వీబీసీ ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నదీ అంటే ఎవరూ వ్యతిరేకించడం లేదు, టీటీడీకి ఆమే కరెక్టు అని నమ్ముతున్నారు… ఆర్థిక వ్యవహారాలు నువ్వు చూసుకో, ఆధ్యాత్మిక నిర్ణయాలు ఆమెకు వదిలెయ్… ఆమె మీద వెంకన్న భక్తులకు నమ్మకముంది…!!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions