.
తుమ్మ సంజయ్… మంచి టాప్ క్లాస్ చెఫ్ మాత్రమే కాదు… తెలుగువాడు… సరదాగా, జోవియల్‌గా ఉంటాడు… తన వంటకాలతో మాత్రమే కాదు, తన మాటలతో కూడా జోష్ నింపగలడు…
మామూలుగా ఇతర టీవీ రియాలిటీ షోలలాగే బిగ్‌బాస్ రియాలిటీ షోలో కూడా ఎక్కువగా టీవీ, సినిమా బేస్డ్ టాస్కులు, ఫన్నీ గేమ్స్ ఎక్కువ… వచ్చే గెస్టులు కూడా టీవీ, సినిమా సెలబ్రిటీలే ఎక్కువ…
Ads
ఈ నేపథ్యంలో సంజయ్ ఒక డిఫరెంట్ గెస్టుగా హౌజులోకి రావడం బాగుంది… ఈసారి బిగ్‌బాస్ షో గురించి పాజిటివ్‌గా చెప్పడానికి అత్యంత తక్కువ సందర్భాలున్నాయి… అందులో ఇదీ ఒకటి…
కంటెస్టెంట్లతో సరదాగా గడపడం, తినిపించడమే కాదు… హౌజులో గొడవలు పడే కంటెస్టెంట్ల నడుమ సుహృద్భావ వాతావరణాన్ని క్రియేట్ చేశాడు… ప్రత్యేకించి నబీల్, ప్రేరణ… గౌతమ్, నిఖిల్…
వచ్చింది చెఫ్ కాబట్టి… ఆ కాసేపు వంటలు, వంట దినుసులపైనే మాటాముచ్చటా… అంతేకాదు, మంచి డిషెస్‌తో కంటెస్టెంట్లకు ఓ ట్రీట్ కూడా ఇచ్చారు… గుడ్… ఇది వైవిధ్యం అంటే… అఫ్‌కోర్స్, తనూ సినిమా వాడే అయినా నిన్న శేఖర్ మాస్టర్ సందడి కూడా బాగుంది…
టీవీ షోలలో తను కూడా జోవియల్‌గా ఉంటాడు… అడపాదడపా కామెడీ స్కిట్స్ కూడా…! అవినాష్, రోహిణి లేకపోతే హౌజులో అసలు ఫన్ లేదు… ప్రేక్షకుడికీ నచ్చదు… పైగా మిగిలిందే కొద్దిమంది… అందుకే ఇలా గెస్టులను తీసుకొచ్చి ఎంటర్‌టెయిన్ చేసే పని పెట్టుకున్నట్టున్నాడు బిగ్‌బాస్… గుడ్…
చెప్పుకున్నాం కదా… ఈమధ్య నబీల్ ఇరిటేట్ అవుతున్నాడు… అరుస్తున్నాడు… వితండవాదం చేస్తున్నాడు… అరవకుండా కూడా తన వాదనను చెప్పవచ్చు… తన ఆటతీరును జస్టిఫై చేసుకోవచ్చు… అసలే నిఖిల్, గౌతమ్ నుంచి తీవ్ర పోటీ… ఈ స్థితిలో, ఈ కీలకదశలో బ్యాలెన్స్ కోల్పోతున్నాడు…
ఏదో తాడును పోల్‌కు చుట్టే ఆటలో ఇది స్పష్టంగా కనిపించింది… ప్రేరణ ఆట పద్ధతిగా ఉంది… అవినాష్ పూర్ పర్‌ఫామెన్స్… గౌతమ్ వరుసగా ప్రతీ టాస్కులోనూ ఫెయిల్ అవుతున్నాడు… టాప్ ఫైవ్ ఖరారయ్యే ఈ దశలో విష్ణుప్రియ వీక్ అనిపిస్తోంది… రోహిణి సరేసరి…
ఎలాగూ మిడ్ వీక్, వీకెండ్ ఎలిమినేషన్స్ అంటున్నారు కదా… రోహిణి, విష్ణుప్రియలు ప్రస్తుతానికి వోట్ల విషయంలో డేంజర్ జోన్‌లో పడిపోయినట్టే కనిపిస్తోంది… ఆట ఇప్పుడే రక్తికడుతోంది… ఈలోపు ఆటపై జనానికే ఆసక్తి లేకుండా పోయింది… అదీ ఈసారి బిగ్‌బాస్ సిట్యుయేషన్… అఫ్‌కోర్స్, లాస్ట్ సీజన్ కూడా ఇంతే కదా..!!
Share this Article