.
700 కోట్ల భూస్కామ్ అని కొన్ని టీవీలు నిన్నటి నుంచీ ప్రత్యేక కథనాలు చేస్తున్నాయి… జగన్, భారతి, సజ్జల బినామీ చీమకుర్తి శ్రీకాంత్ దీనికి బాధ్యుడని చెప్పాయి మొదట్లో… తరువాత జగన్ పీఏ కేనాగేశ్వరరెడ్డి (కేఎన్నార్) బినామీ అన్నారు…
ఇబ్రహీంపట్నం రిజిస్ట్రార్ ధర్మాసింగ్ తనను కిడ్నాప్ చేసి, గోవాలో బంధించి, బెదిరించి ఈ రిజిస్ట్రేషన్లు చేయించారంటూ ఏకంగా ముఖ్యమంత్రికే లేఖ రాశాడు… ఏసీబీ కేసు నడుస్తోంది… కానీ ఈ కేసు జగన్ హయాంలోనే నమోదైంది…
Ads
నాకు జగన్ పీఎస్ ధనుంజయ్, పీఏ కేఎన్నార్‌లతో ప్రాణభయం ఉందని శ్రీకాంత్ చెబుతున్నాడు… తన ఫాదర్ ఏ1 క్లాస్ కంట్రాక్టర్, నేను కూడా లీగల్ వ్యాపారాలు చేస్తాననీ, తనపై ఉద్దేశపూర్వక ప్రసారాలు సాగిస్తున్నారని తన ఆరోపణ కమ్ వివరణ… నిజమేమిటో ఓ మిస్టరీగా మారిందిప్పుడు…
ఐతే జగన్ చుట్టూ సాగుతున్న ఈ రచ్చను తెలుగుదేశం అనుకూల మీడియా, సోషల్ మీడియా మాత్రం పెద్దగా పట్టించుకోలేదు… ఆ స్కామ్ వివరాలను పక్కన పెడితే… టీవీ నటి, యాంకర్ రీతూ చౌదరి వ్యవహారం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది…
అసలు ఆమెకు పెళ్లయిందనే విషయం కొత్తగా బయటకు వచ్చింది… అదీ ఈ చీమకుర్తి శ్రీకాంత్‌తోనే..! రెండో పెళ్లి… ఆయనకు ఆల్రెడీ పెళ్లయింది… ఆ విషయం దాచిపెట్టి తనను చేసుకున్నాడని అంటోంది రీతూ… నో, నా మొదటి భార్య చనిపోయింది, తరువాత ఈమెను చేసుకున్నాను అంటాడు శ్రీకాంత్… ఎక్కడ బెడిసిందో ఏమో గానీ ప్రస్తుతం విడాకులు తీసుకునే ప్రాసెస్‌లో ఉన్నారు…
ఆమెను కూడా ఈ స్కామ్‌లో ఇన్వాల్వ్ చేశాడనీ, హానీ ట్రాప్‌గా వాడుకున్నాడని ఓ ఆరోపణ… ఆమె నా భార్య, అలా ఎందుకు చేస్తాను అంటాడు శ్రీకాంత్… నాకసలు రిజిస్ట్రేషన్ల ప్రాసెస్ తెలియదు, నాతో ఏం సంతకాలు పెట్టించుకున్నారో కూడా నాకు తెలియదు అంటుంది రీతూ… మరో ఇద్దరు టీవీ నటులు, యాంకర్ల పేర్లూ వినిపిస్తున్నాయి…
కొంచెం బోల్డ్, భోళా అనిపించే రీతూ చౌదరి ఈ మొత్తం బాగోతంలో నిందితురాలో బాధితురాలో తెలియని పరిస్థితి ఇప్పుడు… టీవీ చానెళ్లు చూపిస్తున్న డాక్యుమెంట్లు కేవలం తన భార్యకు రాసిచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ మాత్రమే, అదేమీ సేల్ డీడ్ కాదంటూ శ్రీకాంత్ తన మీద ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నాడు…
జగన్ సెంట్రిక్ ఇష్యూ అయినా సరే, 700 కోట్ల భూకుంభకోణం అని తెలుస్తున్నా సరే… కూటమి ప్రభుత్వం కూడా పెద్దగా దీన్ని సీరియస్‌గా టేకప్ చేసినట్టు లేదు… ఏమో, ఇక చివరాఖరికి ఏసీబీ ఏం తేలుస్తుందో..!!
Share this Article