ఈమధ్యకాలంలో దిల్ రాజుకు చేతులు కాలిన పెద్ద సినిమా బీస్ట్… కళానిధి మారన్‌తో కలిసి విజయ్ హీరోగా నిర్మించిన ఈ సినిమా నిజానికి డిజాస్టర్… కానీ తమిళ మీడియా మాత్రం 150 కోట్ల బడ్జెట్ పెడితే 250 కోట్లు వసూలు చేసింది అని తెగరాసేసింది… తమిళ పెద్ద హీరోల సినిమాలన్నీ తెలుగులోకి డబ్ చేసి వదిలేస్తున్నారు కదా… సేమ్, దీన్ని కూడా అలాగే వదిలారు…
తొలిరోజు కలెక్షన్లు కుమ్మేశాయి… కారణం తెలుసు కదా… తమిళంలో సన్ నెట్‌వర్క్, పైగా విజయ్ పాపులారిటీ… తెలుగులో దిల్ రాజుదే కదా హవా… సో, ఎక్కువ థియేటర్లు… ‘‘తీసేవాడికి చూసేవాడు లోకువ’’ అన్నట్టుగా తొలిరోజే… ప్రేక్షకుడికి సినిమా నాణ్యత అర్థమై, మౌత్ టాక్ వ్యాప్తి చెందేలోపు కలెక్షన్లు కుమ్మేయాలనేది పాలసీ… కానీ తరువాత తమిళంలో కాస్త ఏదో నడిచినా తెలుగులో వేగంగా కలెక్షన్లు పడిపోయి, థియేటర్ల నుంచి త్వరగానే మాయం అయిపోయింది…
నిజానికి 150 కోట్ల బడ్జెట్ అని ప్రచారం జరిగింది గానీ, దానికి వరల్డ్ వైడ్ బిజినెస్ జరిగిందే దాదాపు 126 కోట్లు… వచ్చిందేమో 120 కోట్లు… ఐనా అంతిమంగా లాసే మిగిలింది… సరే, థియేటర్ల వసూళ్ల దందా మాటేమిటో గానీ… ఆ లెక్కల్లో నిజాలేమిటో, అబద్ధాలేమిటో… సినిమా మాత్రం ప్రేక్షకులకు నచ్చలేదు… సినిమా నిర్మాతలు సన్‌నెట్‌వర్కే కదా… సో, జెమినిలో చాలా లేటుగా సినిమాను ప్రసారం చేశారు… అప్పుడెప్పుడో ఓటీటీలో కూడా వచ్చేసినట్టుంది…
Ads
అసలే డిజాస్టర్ టాక్… అందులోనూ ఓటీటీకి ఇచ్చేశారు… పైగా సినిమా మీద ఇంట్రస్టు అడుగంటింది… ఇక టీవీలో ఎవరు చూడాలి దాన్ని..? ఎస్, అదే జరిగింది… మొన్నటి బార్క్ రేటింగుల జాబితా చూస్తుంటే, ఈ సినిమాకు మరీ 4.43 రేటింగ్ కనిపించింది… (హైదరాబాద్ కేటగిరీ)… చాలా చాలా పూర్… ఓవరాల్‌గా 5.94… ఓ స్టార్ హీరో సినిమాకు ఇంత పూర్ రేటింగ్స్ నెెగెటివ్ విశేషమే…
నిజానికి టీవీల్లో జనం పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు సైతం చూడటం లేదు… పైగా టిపికల్ తెలుగు, తమిళ ఓవర్ హీరోయిజం ప్రేక్షకులు ఇష్టపడటం లేదు… అది వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ప్రసారాల రేటింగ్స్ పరిశీలిస్తుంటే అర్థమవుతూనే ఉంది… నాసిరకం చెత్తా సీరియళ్లకు వచ్చే టీఆర్పీలు కూడా స్టార్ హీరోల సినిమాలకు రావడం లేదు… ఇదిలాగే కొనసాగితే టీవీ ప్రసారాల రైట్స్ విలువ రాబోయే రోజుల్లో దారుణంగా పడిపోబోతోంది అని అర్థం… ఐనా ఓటీటీల్లో బోలెడంత వాచబుల్ కంటెంట్ కనిపిస్తోంది… అవి వదిలేసి, టీవీల ముందు కూర్చుని, కళ్లప్పగించి ఈ బీస్ట్‌లు ఎవరు చూస్తారు..?!
సీరియళ్లు, సినిమాల్ని కూడా తమకు తీరిక ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్లు, ట్యాబుల్లో కన్సర్న్‌డ్ యాప్స్ ఓపెన్ చేసి తాపీగా చూసే అవకాశమున్నప్పుడు… టీవీలకు కళ్లను ఎందుకు అతికించాలి..?! రాబోయే రోజుల్లో టీవీల రేటింగ్స్ ఇంకా పడిపోబోతున్నాయి…!!
Share this Article