.
టీవీ షోలకు సంబంధించి రేటింగ్స్ పెరగడానికి నానా తిప్పలూ పడుతుంటారు… ఎవరినో ఎవరితోనో కలుపుతారు… బ్రేకప్ అంటారు… కంట్రవర్సీ క్రియేట్ చేస్తారు…
కొన్ని నిజమైన బంధంలోకి ప్రయాణిస్తాయి… ఉదాహరణకు రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత… నిత్యం ప్రచారంలో ఉంటూనే రేటింగ్స్ సంపాదించే సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ ప్రేమకథ మరో డిఫరెంట్ స్టోరీ…
Ads
వర్ష, ఇమాన్యుయేల్ ప్రేమ కథ ఏమైందో తెలియదు గానీ… కొన్నిరోజులు బిగ్‌బాస్ విన్నర్ నిఖిల్, తన లవర్ కావ్య స్టోరీ డిబేట్లలో ఉంచాయి టీవీలు… షోలో ఉన్నప్పుడు కావ్య మాత్రమే తన లైఫ్‌లాంగ్ పార్టనర్, బయటికి వెళ్లగానే ఆమె ముందు వాలిపోతా అన్నాడు, మరిచిపోయాడు, మోసగాడు అన్నట్టు సోషల్ మీడియా దుమ్మెత్తిపోసింది…
ఆమె కూడా తను ఓ విలన్ అన్నట్టుగా రెండుమూడు ట్వీట్లు, వ్యాఖ్యలతో వేడి రాజేసింది… స్టార్ మా పరివారం షోలో శ్రీముఖి కూడా ఇంకాస్త పెట్రోల్ పోయడానికి ట్రై చేసింది… ఎహె, ఎవరేమైనా రాసుకోనీ, డోన్ట్ కేర్ అన్నట్టుగా నిఖిల్ ఏమీ స్పందించకుండా, నిర్లిప్తంగా ఉండిపోవడంతో ఆ లవ్వు యవ్వారం వార్తలు ఆగిపోయాయి…
ఇప్పుడిక ప్రవీణ్, ఫైమా మధ్య రచ్చ రాజేసే ప్రయత్నం ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా సాగుతోంది… ఇద్దరూ జబర్దస్త్ కమెడియన్లే… లవ్వులో ఉన్నమాట నిజమే… తరువాత ఫైమా బిగ్‌బాస్ షోకు వెళ్లింది, పాపులరైంది… ప్రవీణ్‌తో బ్రేకప్, వేరే అతనితో కూడా పెళ్లి సెటిలైంది…
ఈసారి శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో చూస్తే… ప్రవీణ్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఫైమాను బ్యాడ్‌గా పోట్రే ప్రయత్నం చేశాడు… స్క్రిప్టెడే కావచ్చు… దానికి అక్కడే ఉన్న ఫైమా ఫైరయింది… నాకు పెళ్లి సెటిలైంది అని చెబుతున్నా సరే, ఎందుకిలా నన్ను బదనాం చేస్తున్నావ్ అంటూ ఇక లైఫులో నీతో మాట్లాడను అంటోంది ఆమె…
లవ్వు సంగతి కాదు గానీ… కన్నడ నటి, యాంకర్ సౌమ్య 10 పదాలు తెలుగులో మాట్లాడితే 8 బూతులే ఉంటాయి అని మొన్నామధ్య సుమ ఇయర్ ఎండ్ దావత్ షోలో నూకరాజుతో అనిపించి ప్రోమోకు కావల్సిన మసాలాను జల్లారు కదా…
ఇప్పుడు అదే సౌమ్యతో ఏదో ఓ సుదీర్ఘమైన తెలుగు డైలాగును కాస్త స్పష్టమైన ఉచ్చారణతో పలికించి, తనపై విమర్శలకు ఇదే సమాధానం అన్నట్టుగా… ఈ తెలుగు- కన్నడ క్లాష్ కొనసాగించడానికి ఓ ప్రయత్నం…
ఈ టీవీ ఫేక్ లవ్వులు, స్క్రిప్టెడ్ బ్రేకప్పుల నడుమ… ఇదే షోలో ఓ జంటను పరిచయం చేశారు, అదీ అభినందనీయం… ఓ యువతి ఎవరినో నమ్మింది, ప్రేమించింది, వాడు కాదంటే కిరోసిన్ పోసుకుని అంటించుకుంది… మొహం సహా ఒళ్లంతా కాలింది… కానీ బతికింది…
ఆమెకు మరో వ్యక్తి కొత్త జీవితం ఇవ్వడానికి జతకలిశాడు… రూపంతో పనిలేదు అంటున్నాడు… ఈ ఫేక్ లవ్వుల నడుమ ఓ రియల్ లవ్… గుడ్…
Share this Article