తెలుగులో ఈరోజుకూ నాణ్యమైన సినీసంగీత టీవీ కార్యక్రమం అంటే పాడుతా తీయగా షో మాత్రమే గుర్తొస్తుంది… అంటే అప్పట్లో బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన షో… ప్రస్తుతం ఫీల్డ్‌లో ఉన్న చాలామంది గాయకులు పాడుతా తీయగా షోలో పాడినవాళ్లే…
పాట నేపథ్యం, గాయకుడి పాటలో చిన్న తప్పొప్పులు వివరించేవాడు బాలు… ఎక్కడా అతిగా పొగిడేవాడు కాదు, అలాగని హార్ష్ కామెంట్లు కూడా చేసేవాడు కాదు… ఈరోజుకీ ఆ వీడియోలే వినబుల్, చూడబుల్… అవి పోటీలు… కానీ స్వరాభిషేకంతోపాటు పలు దేశాలు తిరుగుతూ లైవ్ కాన్సర్ట్స్… అవి బేసిక్‌గా పర్‌ఫామెన్స్ షోలు…
తరువాత చాన్నాళ్లు తెలుగు టీవీల్లో సూపర్ సింగర్ షో సూపర్ హిట్… భిన్న జానర్లలో పాటల ఎంపిక, గాయకుల పోటీ రక్తికట్టేవి… అదంతా గతం… ఆమధ్య వచ్చిన సూపర్ సింగర్ షో జస్ట్, ఓ టీవీ షో… ఓ ఎంటర్‌టెయిన్‌మెంట్ షో… ఇక జీతెలుగు వాడి సరిగమప అయితే సింగింగ్ షోలను మరీ శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ స్థాయికి దిగిపోయింది వేగంగా…
Ads
హిందీలో చాలా పాపులర్ మ్యూజిక్ షో ఇండియన్ ఐడల్… అదీ గాయకుల పోటీయే… సింఫనీ తరహాలో భారీ ఆర్కెస్ట్రా… సినీ సెలబ్రిటీల రాక, జడ్జిల కామెంట్లు సింగింగ్ టీవీ షోలను ఓ రేంజుకు తీసుకుపోయింది ఆ షో… తరువాత దాన్ని కూడా ఎంటర్‌టెయిన్‌మెంట్ షోగా మార్చేశారు క్రమేపీ… పొగడటమే తప్ప గాయకుల పాటలో వినిపించిన చిన్న లోపాల్ని కూడా జడ్జిలు ప్రస్తావించకుండా చేశారు…
దానికి తెలుగు అనుకరణ ఆహా ఓటీటీలో… థమన్ నేతృత్వం… మొదట్లో రెండు సీజన్లు కాస్త బాగానే ఉన్నట్టు అనిపించింది… తరువాత దాన్ని కూడా ఎంటర్‌టెయిన్‌మెంట్ షో చేసేశారు… మరీ బిగ్‌బాస్ తరహాలో వోటింగు దందాలు మొదలయ్యాయి… జడ్జిల మార్కులు గాకుండా జనం మార్కులు ముఖ్యమయ్యాయి… ఆ పేరిట వోటింగును ప్రభావితం చేయగల సోషల్ మీడియా టీమ్స్ కూడా రంగంలోకి వచ్చాయి… ఫినాలే పాటలు పాడుతుంటే సింగర్స్ చుట్టూ డాన్సర్లు, పిచ్చి గెంతులు…
ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… తాజాగా సరిగమ ప్రోమో చూస్తే… జస్ట్, వినోదం తప్ప సంగీతం, పోటీ, విశ్లేషణలు ఏమీ కనిపించడం లేదు… గత సీజన్‌లో అనంత శ్రీరాం గెంతులు, జడ్జిల జోకులు, మెంటార్లు, సరదా స్కిట్లు… ముందే చెప్పుకున్నాం కదా శ్రీదేవి డ్రామా కంపెనీ నయం అని… ఒక పాటలో నేరుగా అయ్యప్ప వేషం… మరో పాటలో వెంకటేశ్వరస్వామి వేషం… వేదిక మీద ప్రత్యక్షం… మెట్లు, తలుపులు… సినిమా సెట్టింగ్, సినిమా సీన్ తరహాలోనే…
వాళ్లకు వేదిక మీదకు వెళ్లి మరీ జడ్జిలు, గాయకులు మొక్కడం మరీ అతి… శ్రీముఖి అరుపులు, కేకలు అదనపు చిరాకు ఉండనే ఉంది… సో, సినిమా పాటల టీవీ షోలు అంటే జస్ట్, ఎంటర్‌టెయిన్‌మెంట్ షోలు అయిపోయాయి… స్వరరాగ విశ్లేషణలు గట్రా ఏమీ లేవు… జడ్జిలను ఏమీ అనడానికి లేదు, షో టీమ్ రాసిన స్క్రిప్ట్ మేరకు నటించడమే…
పోనీ, టీఆర్పీలు ఏమైనా బాగా వస్తున్నాయా ఈ వేషాలతో అంటే… అదీ లేదు..! కొత్త వాళ్లు గాకుండా ఈ షోలో పాడినవాళ్లు ఆ షోకి వెళ్తుంటారు… ఆ షోలో గాయకులు ఈ షోలకు వస్తుంటారు… సో, బాలు వారసుడు చరణ్ నిర్వహించే ఈటీవీ పాటల పోటీయే ఇప్పటికీ కాస్త పద్దతిగా అనిపిస్తోంది…!!
Share this Article