బిగ్‌బాస్ ఫేమ్, టీవీ సీరియల్ నటుడు రవికృష్ణకూ… నటి నవ్య స్వామికీ పెళ్లయిపోయింది… ఆమె మెడలో పుస్తె కట్టేశాడు… సెట్లోనే అందరూ చప్పట్లు కొట్టారు… ఇప్పటిదాకా వాళ్ల నడుమ ఏదో ఉంది, ఏదో నడుస్తోంది అని తెగ రాసుకున్నారుగా అందరూ… ఇప్పుడు మరో జంటను వెతుక్కొండి ఇక……………. హహహ… ఏదీ నిజం కాదు… ఈటీవీ వాళ్లను చూసి జాలిపడాల్సిన పెళ్లిసందడి ఇది… శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఓ సూపర్ ఫ్లాప్ షో వస్తోంది కదా ప్రతి ఆదివారం ఈటీవీలో… అందులో కాసేపు వీళ్ల పెళ్లి డ్రామాను కూడా ఇరికించారు… మరెందుకు జాలిపడాలీ అంటారా..? ఇలాంటి బొమ్మల పెళ్లిళ్లు టీవీలో కొత్తేమీ కాదు… సుడిగాలి సుధీర్-రష్మి పెళ్లి అని అప్పట్లో ఓ షో చేశారు, సూపర్ హిట్ అయ్యింది… అదే సుధీర్‌కు విష్ణుప్రియతోనూ పెళ్లిచేశారు, అదీ హిట్టయ్యింది… ఆ జంటలకు మించి ఇమాన్, వర్ష జంటను పాపులర్ చేయాలని ఈమధ్య సీరియస్ ఎఫర్ట్ పెట్టారు గానీ అది పెద్దగా వర్కవుట్ కావడం లేదు… దాంతో ఇప్పుడు రవికృష్ణ-నవ్యలకు పెళ్లిచేశారు… అప్పుడెప్పుడో సుధీర్ పెళ్లిళ్లు హిట్టయ్యాయని ఇప్పుడూ దానికే కాపీ అవసరమా..? కొత్త ఆలోచనలేమీ రావడం లేదా..? అంత క్రియేటివ్ దరిద్రం ఆవరించేసిందా..?
నిజానికి సదరు నిర్మాతలు ఎవరో గానీ… ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు రూపొందించుకున్న ఫార్మాటే కరెక్టు కాదు… పైగా పేరున్న కమెడియన్లు లేరు… పైగా మధ్యమధ్యలో ఓ పాట, ఓ డాన్స్, ఇంకేదో కళాప్రదర్శన… అసలు అది ఏ జానరో ఆ నిర్మాతకే అర్థమైందో లేదో తెలియదు… ప్రేక్షకులు దీన్ని ఏ స్థాయిలో తిరస్కరించారో తెలుసా..? ఈటీవీ కళ్లు బైర్లు కమ్మేలా జస్ట్, 2 రేటింగ్స్ వచ్చాయి… (హైదరాబాద్ బార్క్)… అట్టర్ ఫ్లాప్… వాస్తవానికి డాన్స్, మ్యూజిక్, కామెడీ, కిట్టీ పార్టీ వంటి రియాలిటీ కేటగిరీలో ఈటీవీయే టాప్ ఇన్నిరోజులూ… కానీ అలాంటి ఈటీవీ ఇలాంటి సబ్‌స్టాండర్డ్ షో ప్రసారం చేసి, మరీ ఈ రేంజ్ ఫ్లాప్ మూటగట్టుకున్నదీ అంటే ఆశ్చర్యమే… దీనికిపోటీగా మాటీవీ వాడు మొదలుపెట్టిన కామెడీ స్టార్స్ బెటర్… అది 3.8 రేటింగ్స్ సాధించింది…
Ads
ఇక ఈ పెళ్లి సందడికి వస్తే… ఏదో మా టీవీ సీరియల్లో రవి, నవ్య భార్యాభర్తలుగా నటిస్తున్నారు… బహుశా ఆమె కథ సీరియల్ కావచ్చు… ఆమధ్య సుమ యాంకరింగు చేసే వావ్ షోకు వీళ్లిద్దరూ గెస్టులుగా వెళ్లినప్పుడు రవి కాస్త ఓవర్ చేశాడు నవ్య పట్ల… అప్పటి నుంచీ వీళ్లిద్దరీ నడుమ ‘ఏదో ఏదో’ అనే గాసిప్స్ నడుస్తూనే ఉన్నయ్… వాళ్లు కూడా వాటిని ఖండించకుండా చిరునవ్వులతో ఎంజాయ్ చేస్తున్నారు… రవితో దిగిన క్లోజ్ ఫోటోలను కూడా నవ్య తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తుండేది… ఇప్పుడిక ఇద్దరికీ టీవీ పెళ్లి చేసేశారు… కానీ ఫాయిదా ఏముందనేదే ప్రశ్న… వీళ్లేమీ రియాలిటీ షోలలో చేయరు… పనిచేసే సీరియల్లో ఎలాగూ భార్యాభర్తలు… మరిక ఈ పెళ్లి డ్రామా ద్వారా ఈటీవీ ఏం ఆశించింది..? బహుశా రేటింగుల దెబ్బకు క్రియేటివ్ టీం మెంబర్ల చిప్స్ కొట్టేసి ఉంటాయి…!! అన్నట్టు అవియానా, చైసామ్ పేర్ల తరహాలో ఈ జంటను రవ్య అని పిలవాలా..?!
Share this Article