Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ పాత టీవీ సీరియల్… కమలా హారిస్ భవితను జోస్యం చెప్పిందా..?!

July 23, 2024 by M S R

కమలా హారిస్… జో బైడెన్ అభ్యర్థిత్వం నుంచి తప్పుకున్నాక, తనే స్వయంగా కమలను తమ పార్టీ అభ్యర్థిగా ప్రతిపాదించాక, ఆమె రేసులోకి వచ్చింది… ఇంకా ఖరారు కాకపోయినా, ఆమెకు బలమైన మద్దతు లభిస్తోంది కాబట్టి ఆమే ట్రంపును ఎదుర్కోబోయే మహిళ కాబోతోంది… గెలిస్తే ఓ చరిత్ర…

ఐతే గెలుస్తుందనీ, పగ్గాలు చేపడుతుందనీ చెబుతూ అమెరికన్లు ఓ కథను ప్రచారంలోకి తీసుకొచ్చేశారు… ఇంట్రస్టింగు… దాదాపు ఇరవై ఏళ్లకు మునుపే… ఓ యానిమేటెడ్ టీవీ సీరియల్ ఆమె ప్రెసిడెంట్ కావడాన్ని జోస్యం చెప్పిందని ఈ కథ సారాంశం… ఒక్కసారి ఈ ఫోటో చూడండి…

kamala

Ads

ఇది ఆమె వైస్ ప్రెసిడెంటుగా ప్రమాణం చేస్తున్నప్పటి ఫోటో… ఆ పక్కన ఉన్నది The Simpsons అనబడే ఓ పాత టీవీ సీరియల్‌లోని పాత్ర… సేమ్ డ్రెస్, సేమ్ మెడలో హారం, సేమ్ చెవి దుద్దులు… సేమ్ అప్పియరెన్స్… యాదృచ్ఛికమో, ఆమె ఇష్టపడి ఆ సీరియల్‌లో ఆ పాత్ర దుస్తుల్నే తనూ ఆరోజు ధరించిందో గానీ… ఇప్పుడది వైరల్ అయిపోతోంది…

ఎలాగంటే..? ఈ సీరియల్ పాపులర్… స్ప్రింగ్ ఫీల్డ్‌లోని సిమ్సన్ ఫ్యామిలీ కథను హాస్యస్పోరకంగానే అమెరికన్ కల్చర్‌ను ఈ సీరియల్ ప్రొజెక్ట్ చేసేది… అందులో 11వ సీజన్, 17వ ఎపిసోడ్… ట్రంప్ వట్టిపోయిన ఖజానాను వదిలివెళ్లిపోతే లిసా సింప్సన్ అనే లేడీ కేరక్టర్ ప్రెసిడెంట్ పగ్గాలు చేపట్టి, ఆర్థిక దుస్థితిని డీల్ చేస్తుంది…

సో, అప్పట్లోనే కమలా హారిస్ భవిష్యత్తును సదరు దర్శకుడు, రచయిత మోడరన్ నోస్ట్రాడామస్ రేంజులో జోస్యం చెప్పారని ప్రస్తుతం వైరల్ అవుతున్న ప్రచారం… బాగుంది, కానీ అప్పుడే ఆమె అభ్యర్థిత్వం ఖరారు కాలేదు, ట్రంపు ధాటికి నిలబడాలి, తనకు వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి ఎవరో తేలాలి… ఇంకా చాలా కథ ఉంది…

ఏమో, అన్నీ కుదిరితే, ఆ సీరియల్ రచయిత AI Jean యాదృచ్ఛికంగా చెప్పిన ఈ జోస్యమే నిజం కావచ్చునేమో… ఈ జోస్యం నిజమవుతున్నందుకు నాకూ ఆనందంగా ఉందని ఆల్రెడీ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు కూడా…!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కన్నెపల్లిపై అదే స్క్రిప్టు – అదే ప్రహసనం — కాకపోతే ఫేస్ మారింది!!
  • కథ బాగుంది… వెరయిటీగా ఉంది… ఆలోచనాత్మకంగా ఉంది…
  • ఏ కెరటం ఏ తీరానికి చేరుతుందో – ఈ మోహిని ఇప్పుడేం చేస్తోందంటే?
  • బాలమురళి పాడేది అసలు సంగీతమే కాదు- హైకోర్టులో ఓ కేసు …
  • ఎగిసిన రంగుల కెరటాలు కొన్ని విరిగిపడటం… స్వయంకృతాలే..!
  • 5 కోట్ల బంగారు రామచరితమానస్ – అయోధ్య గుడిలో మాయం !
  • కన్నెపల్లి పంపులపై కేటీయార్ వితండవాదం – ఇవిగో అసలు నిజాలు…
  • మూడు రాచకుటుంబాల వారసత్వం – ఒక్క వీడియోతో కెరీర్ కకావికలం
  • FIFA 2026 – అనూహ్య ఫలితాలు – అంచనాల్లో తేడాలే అసలు మజా!!
  • I will find you – గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ –

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions