వైసీపీ చానెళ్లుగా తాజాగా టీడీపీతో ముద్రలు వేయించుకున్న టీవీ9, ఎన్టీవీ పరస్పరం కూడా బలంగా పోటీపడతాయి, తెలుగు న్యూస్ చానెళ్లలో నంబర్ వన్ ప్లేస్ కోసం… కొన్నాళ్లు టీవీ9 ఫస్ట్ ప్లేసు, ఇంకొన్నాళ్లు ఎన్టీవీ ఫస్ట్ ప్లేసు… ఇంత పోటీ కనిపించేది…
ఫ్లెక్సీలు, కేక్ కటింగులు, ప్రచారాలు మన్నూమశానం సరేసరి… ఇప్పుడు టీవీ9 ఆ పోటీ దశ నుంచి బయటికి వచ్చేసి, తన నంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టే కనిపిస్తోంది… తాజా బార్క్ రేటింగుల్లో టీవీ9, ఎన్టీవీల నడుమ దూరం బాగా పెరిగిపోయింది… ఎన్నికల కవరేజీలో టీవీ9 చేసిన హైప్రొఫైల్ ఇంటర్వ్యూలు, డిబేట్లు, కవరేజీ తీరు గట్రా దానికి బాగానే ఉపయోగపడినట్టుంది…
తాజా రేటింగ్సులో టీవీ 94.8 జీఆర్పీలతో ప్రథమ స్థానంలో ఉండగా… ఎన్టీవీ 72.6 జీఆర్పీలతో రెండో స్థానంలో కుదురుకుంది… ఒకప్పుడు టాప్ త్రీ లిస్టులో ఉండే టీవీ5 ఫాఫం నాలుగో స్థానానికి పడిపోయింది, దాన్ని సాక్షి టీవీ అధిగమించింది… పైపైన తాజా బార్క్ రేటింగుల జాబితా చూడగానే అనిపించేది ఏమిటంటే..?
Ads
ఏపీలో కేబుల్ ఆపరేటర్ల మెడల మీద కత్తులు పెట్టి టీవీ9, ఎన్టీవీ, సాక్షి టీవీల ప్రసారాలను అడ్డుకుంటున్నారో… ఆ మూడు చానెళ్లే టాప్ త్రి జాబితాలో ఉన్నాయి… ఇప్పుడు అదే తెలుగుదేశం అనుకూల చానెళ్లు టీవీ5, ఏబీఎన్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ చానెళ్లు ఆ టాప్ త్రి స్థానాలకు దిగువన, చాలా దూరంలో ఉండిపోయాయి… అంటే కూటమి గెలుపు, కూటమి పట్ల ప్రజల్లో కనిపించిన భారీ సానుకూలత గట్రా ఈ చానెళ్లకు ఏమీ ఉపయోగపడనట్టే కనిపిస్తోంది… ప్చ్, కూటమి గెలిచింది, కూటమి మీడియా గెలవడం లేదు ఇంకా..!
వీ6 కాస్తా వీ7 అన్నట్టుగా ఏడో ప్లేసులోకి వెళ్లిపోయింది… టీ న్యూస్ దానికి మరింత దూరంలో ఉండిపోతోంది… మిగతా చానెళ్ల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీలేదు… ఇప్పట్లో టీవీ9 స్థానానికి పెద్ద డిస్టర్బెన్స్ కూడా ఉండబోయే సూచనలు లేవు… కానీ ఒక్కసారి కీలకమైన హైదరాబాద్ బార్క్ రేటింగ్స్ చూస్తే మళ్లీ ఆశ్చర్యమే…
సరే, ఎప్పటిలాగే టీవీ9 మిగతా చానెళ్లెవరికీ సమీపించే చాన్సే లేకుండా… పదామడల దూరంలో పరుగు తీస్తోంది… 158.8 రేటింగ్స్ ఉంటే, రెండో స్థానంలో ఉన్న టీవీ5 చానెల్ 71.3 రేటింగ్స్… అంటే టీవీ9 రేటింగ్సులో సగానికికన్నా తక్కువ… అదేమిటో గానీ టీన్యూస్ ఇక్కడ థర్డ్ ప్లేస్… అదే ఎన్టీవీ మరీ ఆరో ప్లేసులో ఉండిపోతోంది… హైదరాబాద్ జనానికి ఎందుకో ఆ టీవీ న్యూస్ నచ్చడం లేదు…
ఏపీ, తెలంగాణ మొత్తమ్మీద మూడో ప్లేసులో కనిపించే సాక్షి టీవీ హైదరాబాదులో మరీ పదో ప్లేసు… ఒకరకంగా తలవంపుల రేటింగ్సే ఇవి… హేమిటో ఈ రేటింగ్స్, ఈ ప్లేసులు గందరగోళంగా ఉన్నాయీ అంటారా..? అంతే… ఇదొక మాయ… కానీ చానెళ్ల పాపులారిటీని కొలిచేందుకు చెలామణీలో ఉన్నది ఈ బార్క్ ఒక్కటే… ఆ చట్రంలోనే మన పరిశీలన కూడా..!!
Share this Article