ఎన్టీవీ కిరీటాన్ని కింద పడేసినట్టుగా… ఆమధ్య నంబర్ వన్ ఉత్సవాల్ని జరుపుకుంది టీవీ9… అక్కడికి తను కొత్తగా ఆ ప్లేసు సాధించినట్టు…!! నిజానికి ఎన్టీవీకి తన నంబర్ వన్ స్థానాన్ని పదిలంగా పూలలో పెట్టి అప్పగించింది టీవీ9 వైఫల్యాలే కదా…! మళ్లీ ఇప్పుడు తన ప్లేసు తిరిగి సాధించి… కోల్పోయిన రాజ్యాన్ని మళ్లీ కొల్లగొట్టినట్టు సంబరాలు…
నిజానికి ఎన్టీవీ- టీవీ9 స్టాఫ్ నడుమ కొన్నాళ్లుగా సోషల్ మీడియా యుద్ధం జరుగుతోంది… రజినీకాంత్‌ను వెక్కిరిస్తూ కొన్ని ఆడియోలు, వీడియోలు కనిపిస్తుండగా… రజినీకాంత్‌ను పైకెత్తుతూ మరికొన్ని వీడియోలు, పోస్టులు… నిష్ఠురం చెప్పుకోవాలంటే రెండూ రెండే… ఎవరూ ఎవరిపైనా గెలవలేదు… వీసమెత్తు తేడాతో కాస్త పైకీ కిందకూ… అంతే… ప్రస్తుత వారం బార్క్ రేటింగుల్లో కూడా టీవీ9 ఫస్ట్ ప్లేసే… కానీ రెండో స్థానంలో ఉన్న ఎన్టీవీకన్నా జస్ట్, ఒక రేటింగ్ ఎక్కువ. అంతే…
అది కూడా ఎప్పుడు పడిపోతుందో తెలియదు… అంత కీన్ ఫైట్… మళ్లీ అప్పుడు ఎన్టీవీలో సంబరాలు ఉంటాయా..? హహహ… హేమిటో ఈ చిన్న పిల్లల పంచాయితీలా కనిపిస్తోంది ఇదంతా…!! అయితే ఒకటి మాత్రం నిజం… ఈ రెండు చానెళ్లకు మిగతా చానెళ్లు చాలాదూరంలో ఉండిపోయాయి… ఒక్కసారి ఈ టేబుల్ గమనించండి…
Ads
ఇది ఆల్ ఇండియా న్యూస్ ఇండియన్ లాంగ్వేజీ చానెళ్ల పొజిషన్స్… నిజానికి టీవీ9 ఫస్ట్ ప్లేసుకు వచ్చినా సరే, బార్క్ అఫిషియల్ టేబుల్ ఇంకా ఎన్టీవీని టీవీ9కన్నా మెరుగైన ప్లేసులో చూపిస్తోంది… అఫ్ కోర్స్, సేమ్ పాయింట్స్… సరే, రజినీకాంత్ అంత సంబరపడి, ఓన్ చేసుకోవల్సిన పనేమీ లేదు… టీవీ9 భారత్ వర్ష ఆల్ ఇండియా ఫోర్త్ ప్లేసు, టీవీ9 కన్నడ ఆరో ప్లేసులో కొనసాగుతున్నయ్… టీవీ9 మరాఠీ కూడా బెటర్ ప్లేసే… ఒక్క టీవీ9 గుజరాతీయే వరస్ట్ పర్‌ఫామర్… అంటే ఓవరాల్‌గా టీవీ9 గ్రూపు మళ్లీ గాడిలో పడుతుందని అనుకోవాలి… ఎట్ లీస్ట్ రేటింగ్స్ విషయంలో…
ఇక ఎన్టీవీ పర్‌ఫామెన్స్ చూద్దాం… అరెరె, ఒక పాయింట్ తేడాలో అగ్రస్థానం కోల్పోయామే అనే బాధ ఉండవచ్చుగాక… కానీ హైదరాబాద్ మార్కెట్‌లో అది ఎప్పుడూ వీకే… ఎన్టీవీని ఎవడూ పట్టించుకోడు… ఈ టేబుల్ చూడండి…
ఎన్టీవీ హైదరాబాదులో మరీ అయిదో ప్లేసు… తరువాత సమీపంలోనే ఏబీఎన్ కాచుకుని ఉంది… ఈమధ్య కాలంలో రేటింగుల్లో ఏబీఎన్ ఇతర పార్టీ చానెళ్లకన్నా చాలా ముందంజలో ఉంది… మరీ సాక్షి టీవీ అయితే ఘోరం… తొమ్మిదో ప్లేసు… మరీ హెచ్ఎంటీవీకి దగ్గరలో ఉంది… నిజానికి టీవీ9, ఎన్టీవీ, టీవీ5, వీ6, టీన్యూస్, ఏబీఎన్ మినహా హైదరాబాదులో వేరే తెలుగు న్యూస్ చానెల్ గురించి చెప్పుకునే పనే లేదు… ఈటీవీ అయితే మరీ ఘోరం… (అర్బన్ లో టీవీ9 ఫస్ట్ కాగా, రూరల్ లో ఎన్టీవీ ఫస్ట్…)
మరోసారి జాతీయ స్థాయి న్యూస్ చానెళ్ల పరిస్థితి చూద్దాం… బార్క్ రేటింగుల్లో నానా వేషాలు వేసి, చాన్నాళ్లు ఫస్ట్ ప్లేసులో ఉన్న రిపబ్లిక్ రెండో స్థానంలో కుదురుకుంది ఇక… పేరుకు ఫస్ట్ ప్లేసులో న్యూస్ 18 కనిపిస్తోంది కదా… అదొక్కటే… మిగతా దాని భాషా చానెళ్లు పరమ నాసిరకం రేటింగులతో కొట్టుకుంటున్నాయి… అఫ్ కోర్స్, బూతు, అశ్లీలం నిండిన ఆ గ్రూపు వెబ్ సైట్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది… డియర్ ముఖేష్ అంబానీ… డబ్బు ఉండగానే సరిపోదు… చానెళ్లు నడపడం అనేది ఓ కళ… నీ చానెళ్ల రేటింగ్స్ చెబుతున్నదీ ఇదే నిజం…!!
Share this Article