Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

tv9 రజినీకాంత్‌కు జనం నాడి తెలుసా..? వెంకట్రావు చానెల్‌పై ఓ జ్ఞాపకం…

May 4, 2023 by M S R

Murali Buddha…..  జనం నాడి తెలిసిన జర్నలిస్ట్ – టివి 9…. యజమానుల నాడియే జనం నాడి…  ఓ జ్ఞాపకం

సోడాబుడ్డి కళ్లద్దాలు , పెరిగిన గడ్డం , లాల్చీ, పైజామా … ఇదీ పాత తెలుగు సినిమాల్లో జర్నలిస్ట్ అనగానే కనిపించే రూపం .. జనం మనసుపై ఈ ముద్ర బలంగా పడిపోయింది. ఓసారి విశ్వనాథ్ ఆనంద్ ను ఒకరు ఏం చేస్తావ్ అని అడిగితే చెస్ ప్లేయర్ ను అని చెప్పాడట … చెస్ ఆడుతావు సరే, బతకడానికి ఏం చేస్తావు అని అడిగారట .. సినిమాల్లోని ఈ జర్నలిస్ట్ రూపం పుణ్యమాని, ఎవరికైనా నేను జర్నలిస్ట్ ను అని చెబితే, అది సరే బతకడానికి ఏం చేస్తావ్ అని అడిగేవారు ఓ కాలంలో… పవర్ ప్రాజెక్ట్ లు, సొంత వ్యవహారాలు నడిపే వారు ఉన్నా సరే, చాలా కాలం పాటు బతకడానికి ఏం చేస్తావ్ అనే ప్రశ్నే వినిపించేది .

ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక పాత సినిమాల్లోని లాల్చీ, పైజామా, పెరిగిన గడ్డం రూపం చెరిగిపోయింది .. అందమైన అమ్మాయిలు , సూటు బూటు రిపోర్టర్లు ఆ స్థానం ఆక్రమించుకున్నారు .. బుర్రకు ప్రాధాన్యత తగ్గి రూపానికి , గడగడ మాట్లాడడానికి ప్రాధాన్యత పెరిగింది .. సినిమా యాక్టర్లలా జర్నలిస్ట్ లకు ప్రచారం లభించింది . ఇలా ప్రచారం కల్పించడంలో టివి 9 ముందుంది .. అప్పటి వరకు కొమ్ములు తిరిగిన ప్రింట్ మీడియా జర్నలిస్ట్ లు కూడా వెనక్కి వెళ్లగా ,టివి జర్నలిస్ట్ లు ముందుకు వచ్చారు .

Ads

రజనీ కాంత్ ను బిగ్ డిబేట్ లో టివి 9 హైలెట్ చేయడం బాగుంది … ఐతే ….. జనం నాడి తెలిసిన జర్నలిస్ట్ అంటూ రజనీ కాంత్ ను ప్రోమోలో ఆకాశానికి ఎత్తిన ప్రచారంతో కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి . నిజంగా జనం నాడి తెలిసిన జర్నలిస్టేనా ? అంటే ఏమో ….

2004-05 లో రజనీ కాంత్ టివి 9 లో తొలి వార్త … కాంగ్రెస్ తెరాస పొత్తుతో పోటీ . కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది . మంత్రి వర్గంలో తెరాస చేరింది . తరువాత మంత్రులంతా రాజీనామా చేశారు . అప్పుడు విదేశాల్లో ఉన్న సంతోష్ రెడ్డి రాజీనామా చేయలేదు .. తెరాస ఆవిర్భావం తరువాత తొలి బెనిఫిషరీ అతనే ….

విదేశాల నుంచి వచ్చాక కూడా రాజీనామాకు వెనకడుగు . Ysr కు సన్నిహితం … ఎట్టకేలకు రాజీనామాకు సిద్దపడి తెరాస కార్యాలయం వద్ద మీడియాతో నేను మంత్రి పదవికి రాజీనామా చేశాను,. నాదే నిజమైన తెరాస .  తెలంగాణ ఉద్యమాన్ని నేనే నడిపిస్తాను అని ప్రకటించారు … వయసు వల్ల ఆయన వాయిస్ ఇంత స్పష్టంగా లేదు కానీ దాని అర్థం ఇదే .. టివి 9 జర్నలిస్ట్ గా రజనీకాంత్ తొలి కవరేజ్ ఇదే .

జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికలు . మాలతి అని టివి 9 టీడీపీ రిపోర్టర్ … రజనీ కాంత్ ను నన్ను ఒకరికొకరిని పరిచయం చేశారు . రజనీ కాంత్ తో నా మొదటి మాట మీరు ఫలానా కదా ? ( ప్రాంతం , సామాజిక వర్గం , పార్టీ ఏదైనా ఉహించుకోవచ్చు ) అని అడిగాను . అతను నవ్వి నా యాసను బట్టి తెలుసుకున్నారా ? అని అడిగాడు .. మా సొంత జిల్లా సొంత గ్రామం వారి యాసను కూడా నేను గుర్తించలేను .. కానీ మీ మొదటి వార్త వినగానే గ్రహించాను అన్నాను .

సాధారణంగా జర్నలిస్ట్ తాను నిష్పక్షపాతం అని నటించడానికి ప్రయత్నిస్తారు కానీ తెలిసి పోతుంది .. మీరు సంతోష్ రెడ్డి వార్త కవర్ చేస్తూ, ఇక తెలంగాణ ఉద్యమం కెసిఆర్ నాయకత్వంలో నడుస్తుందా ? సంతోష్ రెడ్డి నాయకత్వంలో నడుస్తుందా వేచి చూద్దాం అని వార్త ముగించారు . తెలంగాణను కోరుకునే హక్కు తెలంగాణ వారికి ఉన్నట్టే, వద్దు అనే హక్కు ఇతర ప్రాంతాల వారికి ఉంటుంది . అందులో తప్పులేదు కానీ తెలంగాణ ఉద్యమం కెసిఆర్ నాయకత్వంలోనా ? సంతోష్ రెడ్డి నాయకత్వంలోనా అనడంలోనే మతలబు ఉంది అన్నాను . రాజీనామాతో అప్పటి నుంచి సంతోష్ రెడ్డి రాజకీయ జీవితం ముగిసింది . వయసు, అనారోగ్యం వల్ల ….

2009 ఎన్నికల సమయంలో ఐవెంకట్రావు మహా టివి పెడితే రజనీ కాంత్ అందులో చేరారు . బాబును ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలి అని ఛానల్ ద్వారా విశ్వ ప్రయత్నాలు .. ఒకరోజు వెంకట్రావు , రజనీకాంత్ ఇద్దరు ఛానల్ లో కూర్చొని ఫలితాలు తేల్చేశారు . ఏ నియోజక వర్గంలో ఏ కులం వారి ఓట్లు ఎన్ని ఉన్నాయి ? ఏ కులం వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేస్తారో స్టూడియోలోనే వీళ్లిద్దరు తేల్చేసి, బాబుకు 180 కి పైగా సీట్లు ఇచ్చి ఎయిర్‌లోనే అధికారంలోకి తెచ్చారు . ఐతే ఈ లెక్కలు జనం మాట దేవుడెరుగు ఆ ఛానల్ ఉద్యోగులు కూడా నమ్మలేదు … ఆ ఎన్నికల్లో మళ్ళీ ysr గెలిచారు .

ఇంతకూ రజనీ కాంత్ కు జనం నాడి తెలుసంటావా లేదా ? మార్చురీలో శవాలు తప్ప ఎవరూ తటస్తంగా ఉండరు . నాడి ? జనం నాడి కాదు జర్నలిస్ట్ లకు తెలిసేది , తెలవాల్సింది యాజమాన్యాల నాడి …. యజమానులు తమ నాడీనే జనం నాడీ అనుకుంటారు … అనుకోవాలి అంటారు .. ఉద్యోగాల్లో ఉండాలో లేదో తేల్చేది యజమానుల నాడీనే కానీ జనం నాడీ కాదు … ఇప్పుడు జనం నాడీని నిర్ధేశించేంత బలం మీడియాకు లేదు …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?
  • ‘రా’ కొత్త చీఫ్‌గా ఆపరేషన్ సిందూర్ మాస్టర్ మైండ్..!!
  • చిరంజీవే హీరో అయినాసరే… మాధవి పాత్రదే అల్టిమేట్ డామినేషన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions