Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విజయ్‌కు స్పేస్ ఎలా దొరికింది..? తమిళ రాజకీయాల్లో ఓ కీలక పరిణామం..!!

May 4, 2026 by M S R

.

అందరిలోనూ ఓ ప్రశ్న… ఎంజీఆర్, జయలలిత తరువాత… ఎన్టీయార్ తరువాత… సినిమా ఆకర్షణతో సీఎంలు ఐనవారు లేరు కదా… తరువాతకాలంలో చిరంజీవి, కమలహాసన్, విజయకాంత్ తదితరులెందరో విఫలమయ్యారు కదా… మరి విజయ్ ఎలా ఈ ఫలితాలు సాధించాడు… తొలిసారి తమిళనాడులో ద్రవిడ పార్టీలకు భిన్నమైన ఓ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, సీఎం కాబోతున్నాడు ఎలా..?

ఇక్కడ ఇంకొన్ని అంశాలు… పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో కలిసేవరకూ నథింగ్… తనే గెలవలేకపోయాడు… రజినీకాంత్ పిరికి, ఏళ్లుగా ఫ్యాన్స్‌ను సస్పెన్స్‌లో పెట్టి చేతులెత్తేశాడు… చిరంజీవి ఏవో కొన్ని సీట్లు గెలిచీ కాంగ్రెస్ పార్టీలో నిమజ్జనం చేశాడు… సో, ఇక సౌత్ ఇండియాలో గతంనాటి సినిమా ఆకర్షణ వోట్లను రాల్చదు అనే భావన ఏర్పడింది కదా… మరి విజయ్ ఎలా గెలిచాడు..?

Ads

సింపుల్… విజయ్ విజయానికి కేవలం హీరో బాపతు ఆకర్షణ మాత్రమే కాదు, చాలా అంశాలు కలిసొచ్చాయి… 1) హీరోగా చాలా సంపాదించాడు… డబ్బుకు ఢోకా లేదు…  2) సినిమా హీరోగా ఆకర్షణ ఉండనే ఉంది… కొత్త వోటర్లు, యువత వోట్లు డీఎంకే నుంచి భారీగా టర్నయ్యాయి… 3) తను స్వతహాగా క్రిస్టియన్, ఓబీసీ (వెల్లలార్, వ్యవసాయ వృత్తి)… తండ్రి క్రిస్టియన్, తల్లి హిందూ… దాంతో డీఎంకే పట్ల వ్యతిరేకంగా ఉన్న మైనారిటీలు తనకు అండగా నిలబడ్డారు… 4) తను బీజేపీ ఫోల్డ్‌లోకి వెళ్లకపోవడంతో దళిత్, మైనారిటీ వోటర్లకు కాన్ఫిడెన్స్ పెరిగింది…

5) డీఎంకే ప్రభుత్వం మీద విపరీతంగా వ్యతిరేకత పెరిగి ఉంది… 6) డీఎంకే కుటుంబ పాలన, అవినీతి, చివరకు తన కొడుకునే డిప్యూటీ సీఎంను చేసి, తన వారసత్వాన్ని ప్రకటించడం కూడా వ్యతిరేకతకు దారితీసింది… పైగా ఉదయనిధి అజ్ఙాని… 7) జయలలిత తరువాత అన్నాడీఎంకేలో చరిష్మా ఉన్న లీడర్ ఎవడూ లేకుండా పోయాడు… 8) పళనిస్వామి కోసం బీజేపీ అన్నామలైని పార్టీ వ్యవహారాలకు దూరంగా పెట్టడం కూడా అన్నాడీఎంకేకు మైనస్…

ఇలాంటి ఎన్నో కారణాలతో తమిళ రాజకీయాల్లో ఓ స్పేస్ ఏర్పడింది… ఇటు డీఎంకేకు, అటు అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ఓ నాయకుడు కావాలి… అదుగో అది ఉపకరించింది విజయ్‌కు…! సరే, చివరి మెజారిటీ అంకెలు ఎలా ఉంటాయో గానీ, విజయ్ సీఎం కావడం తథ్యం… అయితే..?

ఫ్యాన్స్ వేరు… కార్యకర్తలు వేరు… ఓ సినిమా ప్రాజెక్టు వేరు… ఓ పార్టీ వేరు… సినిమా షూటింగ్, కథ వేరు… రాష్ట్ర పాలన వేరు… అన్నాడీఎంకేకు పెద్ద సమస్యలు ఉండవు గానీ డీఎంకే స్టాలిన్ మహా ముదురు, విజయ్‌కు నిద్ర పట్టనివ్వడు… డీఎంకేలు, బీఆర్ఎస్‌లు గట్రా అధికారంలో లేకపోతేనే అసలు సమస్యలు…

సో, విజయ్‌కు అనుకోకుండా ఓ మంచి అదృష్టం వరించింది, తొలి తమిళ క్రిస్టియన్ ముఖ్యమంత్రికి అభినందనలు… త్రిషకు కూడా..! పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి, సినిమాల్ని వదిలిపెట్టి, పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా పరివర్తన చెందాలి… (ఇతర తెలుగు, తమిళ నాయక హీరోల్లాగా గాకుండా)… అదే ఆశిద్దాం..!!

.

అయిదో పదో సీట్లు విజయ్‌కు అవసరం అయితే… కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మద్దతునిస్తాయా..? ఇస్తే ఇండికూటమి ఇచ్చుకుపోయినట్టే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమో… ఎవరికి తెలుసు..? మనలో ఎన్ని బొద్దింకలు ఉన్నాయో…!
  • మంచు మేఘాలు తొలిగితేనే… కాంచనగంగ శిఖర దర్శనం… గొప్ప మూవీ…
  • Madhuvidhu … క్లీన్ ఫ్యామిలీ కామెడీ మూవీ..! మన జంధ్యాల గుర్తొస్తాడు..!
  • రియల్ సూపర్‌స్టార్ కృష్ణను సరిగ్గా ఆవిష్కరించిన కథనం ఇది..!!
  • ఆ బుడ్డోడు వైభవ్ మాత్రమే కాదు… ఈ గొప్పోడు కూడా గుర్తుకురావాలి…
  • దొందూ దొందే… నాగేశ్వర్- పవన్ కల్యాణ్… తెలంగాణకు అక్కర్లేని కేరక్టర్లు…
  • ఇక నీ కెరీర్ క్లోజ్ అన్నారందరూ… ఈమె అస్సలు లెక్కచేయలేదు…
  • ప్చ్, ఏం చేస్తాం..? జపానోడికి మన మామిడి తినే యోగం లేదు..!!
  • రేవంత్ సవాల్‌కు బీఆర్ఎస్ వద్ద జవాబు లేదు..! కిక్కుమనరు..!!
  • KCR పాలన బాపతు ఆ గ్లోబరీనా… కొత్త పేరుతో మళ్లీ పిల్లల జీవితాలతో ఆటలు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions