.
ఒక హైకోర్టు జడ్జిపై టైమ్స్ ఆఫ్ ఇండియా సాహసంతో వార్త పబ్లిష్ చేసింది… గ్రేట్… సోవాల్, హైకోర్టు జడ్జి అయితే అన్నింటికీ అతీతమా..? ఆయన నివాసంలో దొరికిన నోట్ల కట్టల సంగతిని దైర్యంగా ప్రచురించింది… హేట్సాఫ్…
హైకోర్టు జడ్జిలు, సుప్రీం కోర్టు జడ్జిలు అన్నింటికీ అతీతమా..? ఈ ప్రశ్నపై తెలుగు మీడియాలో ఒక్కంటే ఒక్క ఆర్టికల్ కూడా సరైన రీతిలో రాలేదు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దమ్మున్న జర్నలిస్టుగా అనేక ప్రశ్నలు సంధించాడు… ఆ టెంపర్‌మెంట్ గ్రేట్… ఈనాడు ఎలాగూ చప్పిడి కూడే కదా… చివరకు సాక్షిలో ఎప్పటిలాగే ఎంతసేపూ చంద్రబాబును తిట్టే ఓ పిచ్చి, దిక్కుమాలిన, నాసిరకం ఎడిటోరియల్ వ్యాసాలు తప్ప వేరే ఏ సోయీ లేదు…
Ads
దేశమంతా లీగల్ సర్కిళ్లు విరుచుకుపడుతున్నయ్… సుప్రీం కొలీజియం తనేను సింపుల్‌గా బదిలీ చేసింది… అదేమంటే ఇన్‌సైడ్ ఎంక్వయిరీ అంటుంది… మరోవైపు అలహాబాద్ బార్ అసోసియేషన్ ‘మా కోర్టు ఏమైనా చెత్తబుట్టా’ అని సుప్రీంను క్వశ్చన్ చేసింది…
మన సుప్రీం ప్రొయాక్టివ్ ధోరణి మీద మోడీకి ఎలాగూ ఏ సోయీ లేదు, తనేమీ చేయలేడు… చివరకు సుప్రీంకోర్టు జడ్జిలే మణిపూర్ వెళ్లి నిజనిర్ధారణకు పూనుకున్నారు… అంటే, రేప్పొద్దున ఏ ఇష్యూ వచ్చినా సరే, సుప్రీంకోర్టు నేరుగా ఫీల్డ్‌కు వెళ్తుందా..? అసలు మన సిస్టంలో ఉన్న చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎవరికీ ఎందుకు పట్టడం లేదు… ఎవరి పరిమితుల్లో ఎవరూ ఉండటం లేదు ఎందుకు,..?
సుప్రీం అంటే అల్టిమేట్ సుప్రీం ఏమీ కాదు… మోడీకన్నా ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ నయం… సరైన పాయింట్లు లేవనెత్తుతున్నాడు… మన వ్యవస్థలో పార్లమెంటే సుప్రీం… కానీ అది ఆమోదించిన నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేస్తే కేంద్రం నుంచి నిల్ రెస్పాన్స్… కొలీజయం తనే బదిలీలు చేస్తుంది… తనే నియామకాలు చేస్తుంది,.. తనే సుప్రీం… మరి జనం ఎన్నుకున్న పార్లమెంటు ఏం చేయాలి..?
పార్లమెంటు చేసిన చట్టం సుప్రీం అన్నప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కొట్టేస్తే మోడీ ఏం చేశాడు..? ఏమీ లేదు… సరే, లైవ్ లా సైటులో వచ్చిన ఓ వార్త తెలుగు అనువాదం చూద్దాం… అదేనండీ, హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలకు సంబంధించి…
సుప్రీంకోర్టు తన వెబ్‌సైటులో ఢిల్లీ జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో కనిపించిన నోట్ల కట్టల పత్రాలు, ఫోటోలు, వీడియోలను అప్‌లోడ్ చేసింది… చీఫ్ జస్టిస్ ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు…
ఢిల్లీ హైకోర్టు CJ ఉపాధ్యాయ్ సమర్పించిన నివేదిక ప్రకారం… సంఘటన జరిగింది మార్చి 14న… ఎవరూ ప్రవేశించడానికి వీల్లేని ఓ గదిలో కాలిన వస్తువులను తొలగించారు… కనుక లోతైన దర్యాప్తు అవసరం… నో, నో, నా మీద ఏదో కుట్ర జరుగుతోంది అని సదరు నిలువెత్తు న్యాయమూర్తి స్పందించి వివరణ ఇచ్చాడు… ఇదేకాదు, డిసెంబరు 2024లో కూడా నిరాధారమైన ఆరోపణలు తనపై వచ్చాయనీ పేర్కొన్నాడు…
ఈ ఇన్ హౌజ్ ఎంక్వయిరీ పూర్తయ్యేదాకా సదరు జడ్జికి ఎలాంటి జుడిషియల్ అసైన్‌మెంట్లు వద్దని కూడా సీజే ఆదేశించారు… ఇదంతా సరే,.., న్యాయవ్యవస్థ ఓ సమాంతర వ్యవస్థా..? స్వయంప్రతిపత్తి వ్యవస్థా..? మోడీకి అంత లోతుగా ఆలోచించి, చెక్ పెట్టేంత సీన్ ఉందని అనుకోం, కానీ ప్రధాని కార్యాలయం, పార్లమెంటు ఎందుకు స్పందించడం లేదు..?
ఎస్, హైకోర్టు జడ్జి లేదా సుప్రీం కోర్టు జడ్జిని తొలగించాలంటే పూర్తిగా కొలీజియం మీదే ఆధారపడక్కర్లేదు… పార్లమెంటు అభిశంసన తీర్మానంతో తొలగించవచ్చు… గతంలో గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కేసులో ఓ జడ్జి ఇలాగే ఇరుక్కున్నాడు… కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంటరయ్యాయి… మరి ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఎందుకు నిశ్చేష్టగా మిగిలిపోయింది..?
సుప్రీంకోర్టుకు ఓ మెసేజ్ ఇవ్వడానికి ఓ అవకాశం వచ్చినప్పుడు ఎందుకు నిష్క్రియాపరంగా వ్యవహరిస్తోంది..? అసలు ఇలాంటి సందర్భాల్లో కేంద్రం ఏం చేయాలి..? ఇది కదా ప్రశ్న… ప్చ్, మోడీ సర్కార్..!?
Share this Article