మరో ట్విస్టు… ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత విచారణ కేసులో చిన్న మలుపు… అసలు మీ ఎఫ్ఐఆర్‌లో నా పేరే లేదు, మొన్న ఆరో తారీఖున మా ఇంటికి రండి అన్నాను… కానీ ముందుగానే ఖరారైన ప్రోగ్రాముల వల్ల ఆరోజు నాకు వీలుకాదు, 11, 12, 14, 15 తేదీల్లో ఏదో ఒక రోజు మా ఇంట్లోనే అందుబాటులో ఉంటాను… అంటూ కవిత సీబీఐకి తాజాగా లేఖ రాసింది… ముందుగా ఆ వార్త చదవండి…
‘‘ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో తన పేరు ఎక్కడా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. “సిబిఐ తన వెబ్ సైట్ లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ ని క్షుణ్ణంగా పరిశీలించాను మరియు అందులో పేర్కొని ఉన్న నిందితుల జాబితాను కూడా చూశాను. దానిలో నా పేరు ఎక్కడా లేని విషయాన్ని తెలియజేస్తున్నాను.” అని పేర్కొన్నారు.
1) నిజానికి ఈడీ అధికారికంగానే ఒకరి రిమాండ్ రిపోర్టులో ఆమె పేరును ప్రస్తావించింది… 2) సీబీఐ ఫలానా కేసుకు సంబంధించి మీదగ్గర చాలా సమాచారం ఉన్నట్టుంది, ఓసారి ప్రశ్నించాలి అనడిగిందే తప్ప ఆమెను నిందితురాలిగా చూపించడం లేదు… సో, ఎఫ్ఐఆర్‌లో పేరు లేనట్టే కదా… సో, ఈడీ, సీబీఐలతో ఈ కాలయాపన, దోబూచులాటతో ప్రయోజనం ఏముంటుందనేది ఓ ప్రశ్నే… ఈడీ, సీబీఐ సీరియస్‌గా ఉన్నాయనేది నిజం… వెనుక కేంద్రం కూడా సీరియస్ అనేదీ నిజం… గతం ఏమిటో గానీ ఎమ్మెల్యేల కొనుగోలు వీడియోలతో బీజేపీకి బాగా కాలుతోందనేదీ నిజం…
Ads
పైగా ఎఫ్ఐఆర్‌లో నా పేరు లేదు అని లేఖ రాయడం అంటే… ఎఫ్ఐఆర్‌లో ముందుగా పేరు పెట్టి, తరువాత రండి అని చెప్పినట్టుంది… పైగా ముందే ఆరోతేదీ కార్యక్రమాలు ఖరారై ఉంటే, ఆ తేదీన రావాలంటూ సీబీఐకి రెండో తేదీన ఎందుకు లేఖ రాసినట్టు..? ఎఫ్ఐఆర్‌లో పేరున్నా లేకపోయినా సీబీఐ అడిగితే కేసు దర్యాప్తుకు సహకరించాల్సిందే కదా… అందుకే స్కాం కేసుల్లో వీలైనంత మౌనంగా, తగ్గి ఉండటం మంచిదని అంటుంటారు న్యాయనిపుణులు…
ఇది రాజకీయ ప్రేరితమైన కేసు, ఎదురుదాడే శరణ్యం అనుకునే పక్షంలో పదాల్ని, అడుగుల్ని ఆచితూచి వేయడం కరెక్టు… ఆరో తేదీన ఉండను, వీలుకాదు అని చెబితే సరిపోయేది కదా… మళ్లీ ఆల్టర్నేట్ తేదీలు తనే చెప్పడం దేనికి..? మరో రోజున మీకు అందుబాటులో ఉండటానికి ప్రయత్నిస్తాను అంటే సరిపోయేదేమో..!! అవునూ, సిట్ bl సంతోష్ పేరు FIR లో లేకపోయినా ఏకంగా 41 CRPC కింద నోటీసులు ఇచ్చిందిగా దాన్ని ఏమనాలి మరి..!? ఇదేదో అరెస్ట్ చేసే కుట్ర అనుకుని తను కోర్టుకు వెళ్ళాడు..!!
Share this Article