Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పూసల పిల్ల మోనాలిసా కేసులో మరో ట్విస్టు… పోలీసులతో గేమ్స్…

April 22, 2026 by M S R

.

కుంభమేళా పూసల పిల్ల మోనాలిసా కథలో మరో ట్విస్టు… ఆమె కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి, ఇది లవ్ జిహాద్ అనే వార్తలు, చివరకు ఆమె మైనర్ అని తేలడంతో పోలీసులు అతనిపై పోక్సో కేసు పెట్టడం దాకా ఓ సినిమా కథలా సాగుతోంది కదా… తాజా ట్విస్టు ఏమిటంటే… ఆమె గర్భవతి, అందుకే పోలీసు విచారణకు రాదు అని ఫర్మాన్ పోలీసులకు చెప్పడం..!

అంటే, ఆమె ఎక్కడుందో తనకు తెలిసినట్టే కదా… తనే దాచిపెడుతున్నట్టు కదా… మరి మధ్యప్రదేశ్ పోలీసులు ఆమె జాడను ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు..? అది ఫర్మాన్ టీమ్ ఆ పోలీసులతో ఆడుతున్న ఆట… కానీ ఆమె ప్రస్తుతం గర్భవతి అని తనే చెప్పాడంటే… పోక్సో కేసులో మరింత బలంగా ఇరుక్కున్నట్టే… అదెలాగంటే..?

Ads

పోక్సో (POCSO) చట్టం ప్రకారం…

  • మైనర్ల విషయంలో “సమ్మతి” (Consent) అనే దానికి చట్టంలో తావు లేదు…. పెళ్లయినప్పటికీ, అమ్మాయి వయసు 18 ఏళ్ల లోపు ఉంటే, శారీరక సంబంధం చట్టరిత్యా నేరంగానే పరిగణించబడుతుంది…

  • బాలిక గర్భవతి అయిన సందర్భాల్లో, కేసు తీవ్రత పెరుగుతుంది… ఇది కేవలం సాధారణ వేధింపులు కాకుండా, చట్టంలోని సెక్షన్ 5 (l) లేదా సెక్షన్ 6 కిందకు వచ్చే అవకాశం ఉంటుంది, దీనికి శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి…

  • గర్భం దాల్చడం అనేది లైంగిక దాడికి బలమైన భౌతిక సాక్ష్యంగా మారుతుంది… పెళ్లి సమయంలో ఆమె మైనర్ అని ఇప్పటికే పోలీసులు నిర్ధారించినందున, ఇప్పుడు వచ్చిన ఈ వార్త నిందితుడిపై కేసును మరింత బలోపేతం చేస్తుంది…

సాధారణంగా ఇలాంటి కేసుల్లో మైనర్ పెళ్లిళ్లను ప్రోత్సహించిన లేదా సహకరించిన పెద్దల పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది…. దర్యాప్తులో వయసు ధ్రువీకరణ పత్రాల ఫోర్జరీ కూడా బయటపడితే, మోసం (Cheating) కింద మరికొన్ని సెక్షన్లు కూడా తోడయ్యే అవకాశం ఉంది…

(జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) జరిపిన విచారణలో, పెళ్లి సమయంలో మోనాలిసా వయసు 18 ఏళ్ల కంటే తక్కువ (సుమారు 16 ఏళ్లు) అని తేలిన సంగతి తెలిసిందే కదా… ఆమె అసలు పుట్టిన తేదీ డిసెంబర్ 30, 2009 అని దర్యాప్తులో గుర్తించారు… పెళ్లి సమయంలో ఆమె మేజర్ అని చూపించడానికి నకిలీ పత్రాలు సృష్టించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి… ఇది మరో కేసు)…

మోనాలిసా జాడ కనిపెట్టడంలో పోలీసులకు కొన్ని చట్టపరమైన, భౌగోళికపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి…. ఆమె ప్రస్తుతం కేరళలో ఉన్నట్లు తెలుస్తోంది… పోలీసులు ఆమెను పట్టుకోలేకపోవడానికి ప్రధాన కారణాలు ఏమంటే..? కేరళ హైకోర్టు ఈ కేసులో జోక్యం చేసుకుని, మే 20 వరకు ఆమెను అరెస్టు చేయవద్దని మధ్యప్రదేశ్ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది… దీనివల్ల మధ్యప్రదేశ్ నుండి కేరళ వెళ్లిన ఐదుగురు సభ్యుల పోలీసు బృందం ఆమెను అదుపులోకి తీసుకోలేక వెనుదిరగాల్సి వచ్చింది…

తాను మేజర్ నని, తన ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని చెబుతూ మోనాలిసా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు, అక్కడి పోలీసు కమిషనర్‌కు లేఖ రాసింది… తనకు రక్షణ కల్పించాలని కోరుతోంది… ఒక మతపరమైన లేదా రాజకీయ కోణంలోకి మళ్లించి రక్షణ పొందాలనేది వారి ఎత్తుగడ కావచ్చు…  కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవచ్చు… సో, భర్త ఫర్మాన్ ఖాన్ ఆమెను రహస్యంగా ఉంచినట్లు అర్థమవుతోంది…

మధ్యప్రదేశ్ పోలీసులు తమ దర్యాప్తు కోసం ఆమెను మధ్యప్రదేశ్ తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే, కేరళ పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు ఆమెకు రక్షణగా ఉంటున్నారు… ఈ రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య ఈ సమన్వయ లోపం కూడా ఒక కారణం… మరోవైపు, పోలీసులు ఆమెకు ఆశ్రయం ఇచ్చినట్టు చెప్పబడుతున్న ఫర్మాన్ స్నేహితుడు జోషువా కోసం కూడా వెతుకుతున్నారు…

  • (అవునూ, టీసీఎస్ నాసిక్ కార్పొరేట్ జిహాద్ కేసులో ప్రధాన సూత్రధారి నిదా ఖాన్ బెయిల్ దరఖాస్తులో కూడా ఆమె కడుపుతో ఉందనే కదా చెబుతున్నారు… ప్రెగ్నెన్సీ కార్డ్…)

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆసియా రాజకీయాల్లో భారీ మార్పులు…
  • జగములేలినవాని సగము నివ్వెరబోయె, సగము మిగిలినవాని మొగము నగవైపోయె…
  • Vaibhav Suryavanshi is illegal … Do you know why…
  • అందరూ కక్షకట్టారు, వివక్ష ప్రదర్శించారు… ఆ గ్రేట్‌నెస్ చంపలేకపోయారు…
  • ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో “సక్సెషన్ ఎరా” ప్రారంభమైందా?
  • ఎన్టీయార్ వేషం వేస్తే విలన్ ఏమిటి..? హీరో ఏమిటి..? జస్ట్, ఎన్టీయార్… అంతే..!
  • నేనే తారలాగా వచ్చా నీ కోసం – నన్నే ఆదుకున్న నీవే ఆకాశం
  • వ్యూహాత్మక అడుగు… తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ ‘ఎన్టీఆర్’ కార్డ్…!
  • Byju’s …. ఎగిరెగిరి పడటం ఎంతసేపు..? విరిగిపడటం ఎంతసేపు..?
  • అనంత శ్రీరాముడు ఓ రోత ప్రబుద్ధుడు… ‘పెద్ది’కి పెద్ద మరక పూశాడు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions