ఒలింపిక్స్ మాత్రమే కాదు… ఎవరైనా ఏదైనా ఘనత సాధిస్తే చాలు… మన దేశంలో ప్రధానంగా వాళ్ల కులం ఏమిటో సెర్చ్ చేస్తారు… అదొక తుత్తి… తమ కులం వాళ్లయితే సోషల్ మీడియాలో డప్పులు కొట్టేస్తారు… సింధు కులం మీద నాలుగేళ్ల కిందటే భారీ చర్చలు, సెర్చులు జరిగాయి కాబట్టి ఈసారి ఆమెకు ఆ బెడద లేదు… కానీ ఒలింపిక్స్ రజత పతక విజేత, మణిపూర్‌కు చెందిన మీరాబాయ్ సైఖోమ్ చాను కులం, మతం మీద అకస్మాత్తుగా ట్విట్టర్‌లో ఓ చర్చ స్టార్టయింది… ఇదెలా స్టార్టయిందంటే… ఒకరు ఎవరో ఆమె మణిపూర్ బహుజన మహిళ అని అభినందిస్తూ ట్వీట్ చేశాడు… మరొకామె దానికి రిప్లయ్ ఇస్తూ… ‘‘ఆమెకు కులం ప్రస్తావన ఏమిటి..? అసలు ఆమె హిందువే కాదు… మీరాబాయ్ అని పేరు ఉండగానే హిందువు అంటే ఎలా..? ఆమెది మణిపూర్ లోకల్ శనమాహిజం అనే మతం… ఆమె ఆ మతాన్నే అనుసరిస్తుంది’’ అని పేర్కొంది… ఎహె, ఏ మతం అయితేనేం, అది ఆమె వ్యక్తిగతం, ఆమె మన ఇండియన్, అంతే… అంటూ చాలామంది నెటిజన్లు ఈ చర్చ పట్ల చిరాకు పడ్డారు… నిజానికి ఆమె హిందువా కాదా..? ఏమిటీ శనమాహిజం..? కాస్త ఇంట్రస్టింగు…
https://twitter.com/AngellicAribam/status/1421865172877025280
Ads
మెయ్ తెయ్… లేదా మైతై… మణిపూర్, ఇంఫాల్ లోయలోని ఓ పురాతన తెగ ఇది… ఆ రాష్ట్రంలో దాదాపు 55 శాతం వరకూ వీళ్లే… 2011 లెక్కల ప్రకారం మొత్తం 18 లక్షల వరకూ ఉంటారు వీళ్లు… ఇప్పుడు మణిపూర్‌లో మాత్రమే కాదు, అస్సోం, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలతోపాటు బర్మా, బంగ్లాదేశ్‌లకూ విస్తరించారు… మైతై అంటే వాళ్ల భాషలో ‘అగ్ని పునీత’ అని అర్థం… వాళ్ల దేవత పేరు శనమాహి… ఆమె పేరుతో పిలిచేదే శనమాహి మతం… మీరాబాయ్ చాను ఈ తెగకు చెందినదే… ఓసారి తనకు ఈ మీరాబాయ్ అనే పేరు ఎలా వచ్చిందో చెబుతూ… ‘‘మా మూడో అక్క తనకు అనుకోకుండా దూరమైన తన ప్రాణస్నేహితురాలు మీరాబాయ్ పేరును నాకు పెట్టింది…’’ అని వివరించింది చాను… అయితే ఈ మైతీలలో పదీపదిహేను శాతమే ఈ శనిమాహిజాన్ని పాటిస్తున్నారు, చాలామంది క్రిస్టియానిటీలోకి వెళ్లారు… మిగతావాళ్లు తమ సొంత తెగ సంస్కృతితోపాటు హైందవాన్ని కూడా పాటిస్తారు… పైన కనిపిస్తున్న ఫోటో చూశారుగా… చాను హనుమజ్జయంతిని జరుపుకుంటున్న ఫోటో…
ఇంఫాల్‌లో ఆమధ్య కొత్తగా నిర్మించిన శనమాహి దేవత గుడి ఇది… వీళ్లు పాటించే హైందవంలో కాస్త వైష్ణవ ధోరణి కనిపిస్తుంది… హిందూ పండుగలు, ఉత్సవాలు రసలీల, జన్మాష్టమి, హోలి, లాయ్ హరవోబా, చీరవోబా, యావోసంగ్, జగన్నాథ రథయాత్ర, హోలి, దీపావళి, రామనవమి… ఇవన్నీ జరుపుకుంటారు… వాళ్లకు ప్రత్యేకంగా భాష ఉంది, లిపి ఉంది… కానీ లిపి క్రమేపీ బెంగాలీ- అస్సామీలోకి మారిపోయింది… భాషను మణిపురీగా పిలుస్తున్నారు, అధికారికంగా గుర్తించబడిన భాష ఇది… అసలు ఈశాన్య రాష్ట్రాల్లో ఈ మైతై మాత్రమే కాదు, చాలా పురాతన తెగలు ఉన్నాయి… వాటి మధ్య ఘర్షణలు కూడా బోలెడు… చాలామంది క్రిస్టియానిటీలోకి మార్చారు… మిగిలినవాళ్లలో చాలామంది తమ ఒరిజినల్ సంస్కృతితోపాటు హైందవాన్ని కూడా అనుసరిస్తారు… సో, మీరాబాయ్ చాను హిందువా..? కాదా..? ఆమెకు కులం ఉన్నట్టా..? లేనట్టా..? ఓ చిక్కు ప్రశ్నే అనిపిస్తోందా..? అసలు ఆమె ఎవరు అని ఆలోచిస్తేనే కదా ఈ చిక్కు, ఆమె ఎవరైతేనేం అనుకుంటే ఏ చిక్కూ లేదుగా… ఈ మైతై తెగ చిహ్నం ఇదుగో… (స్టోరీ మీకు నచ్చితే, దిగువ డొనేట్ బటన్ వద్దకు వెళ్లి ముచ్చటకు సపోర్ట్ చేయండి)
Share this Article