Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇద్దరు కమెడియన్లు… రెండు సినిమాలు… ఎందుకు ఆకట్టుకోలేకపోయాయ్…

February 23, 2024 by M S R

రెండు సినిమాలు… హీరోలుగా అదృష్టం పరీక్షించుకోవాలని వచ్చిన ఇద్దరు కమెడియన్లు… ఒకటి అభినవ్ గోమఠం నటించిన ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ మూవీ… రెండు చెముడు హర్ష అలియాస్ వైవా హర్ష నటించిన ‘సుందరం మాస్టార్’ మూవీ… ఇద్దరూ మంచి టైమింగ్ ఉన్న కమెడియన్లే…

డైలాగ్ డెలివరీ గానీ, పాత్రలోకి ఒదిగిపోవడం గానీ వాళ్లకు కొత్తగా నేర్పాల్సిన పని లేదు… కాకపోతే వాళ్లు బేసిక్‌గా కమెడియన్లుగా పాపులర్ అయినవాళ్లు… వెంటనే హీరోలుగా యాక్సెప్ట్ చేయడం కష్టం… అది ఏనాటి నుంచో సినిమా ఇండస్ట్రీ చూస్తున్నదే… చాలామంది కమెడియన్లు హీరోలుగా ట్రై చేసి, తరువాత మళ్లీ కమెడియన్లుగా, కేరక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు…

హీరో వేషం అనేది ఇండస్ట్రీలో అందరినీ ఆకర్షించే పాయింటే… ఎటొచ్చీ మంచి దర్శకుడు, మంచి కథ, మంచి బ్యానర్ ఎట్సెట్రా చాలా కుదరాలి… ఐనా సరే జనం వాళ్లను కమెడియన్లుగానే చూస్తారు తప్ప మెయిన్ స్ట్రీమ్ హీరోగా అంగీకరించడమే అసలు పరీక్ష… ఇప్పుడు ఈ ఇద్దరూ హీరోలు అయ్యారు… కానీ రెండు సినిమాలూ పెద్ద ఇంప్రెసివ్‌గా లేక ఆ ఇద్దరి భావి ఆశలపై నీళ్లు జల్లినట్టేనని చెప్పుకోవచ్చు స్థూలంగా…

Ads

రీసెంట్ టైమ్స్‌లో సుడిగాలి సుధీర్ కూడా హీరో అయ్యాడు… తను జబర్దస్త్ కమెడియనే అయినా అంతకుమించి మంచి పర్‌ఫార్మర్… స్టంట్స్, మ్యాజిక్, డాన్స్ అన్నీ చేయగలడు… అందుకే గాలోడు కాస్త క్లిక్కయింది… మళ్లీ కాలింగ్ సహస్ర డిజాస్టర్… కారణం, సుధీర్ లోపమేమీ లేదు, సినిమా ప్రజెంటేషన్ కనెక్టయ్యేలా లేదు… ఇప్పుడు ఈ ఇద్దరు కమెడియన్లకూ వచ్చిన తిప్పలు కూడా ఇవే…

కథలు పర్లేదు… కానీ దర్శకులు వాటిని తెరపై సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయారు… గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం, సంగీతం నిరాశపరచడం వంటి చాలా కారణాలుండవచ్చు గాక… కానీ మరో ప్రధాన కారణమూ ఉంది… ఆ ఇద్దరికీ కామెడీ టైమింగ్ బలం… కానీ రెండు సినిమాల్లోనూ కామెడీ కొంత భాగమే… సినిమాకు బరువు ఉండాలని ఎమోషన్స్ యాడ్ చేయాలని ప్రయత్నించారు… అది కుదరలేదు… పూర్తిగా కామెడీయే ప్రధానంగా తీసినా బాగుండేదేమో… గతంలో అల్లరి నరేష్, రాజేంద్రప్రసాద్, ఆలీ ఎన్ని సినిమాలు చేయలేదు… అంతెందుకు ఎఫ్2, ఎఫ్3 పేరిట అంతటి హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ చేసిందీ అదే కదా…

ప్రత్యేకించి సుందరం మాస్టారు విషయానికి వస్తే ఫస్టాఫ్ అంతా కామెడీ పార్ట్… చూస్తున్నంతసేపూ బోర్ రాదు, ఫన్ జనరేటైంది… ప్రేక్షకుడికి టైం పాస్… కానీ ఎప్పుడైతే సెకండాఫ్‌లో సీరియస్ అయిపోయిందో ఫస్టాఫ్ పాజిటివిటీ కాస్తా ఎగిరిపోయింది… దానికితోడు లాజిక్కులకు దూరంగా ఉన్న కథ పెద్ద మైనస్ పాయింట్… ఎప్పుడో గాంధీ కాలంలోనే ఆ గ్రామం ఆగిపోవడం అనేది జనానికి పట్టని పాయింట్… మళ్లీ ఆ ఊరివాళ్లే తమకు ఇంగ్లిష్ మాస్టర్ కావాలని అర్జీ పంపించడం ఏమిటో, అంతా మోడరన్‌గా ఉండటం ఏమిటో అంతుపట్టదు, ఎక్కడో ఆగిపోతే ఈ డెవలప్‌మెంట్ ఎలా వచ్చింది ఊరిలోకి..?

మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా అనే సినిమా… అసలు ఈ టైటిలే ఆప్ట్ కాదు, అభినవ్ ఫేమస్ డైలాగ్ అది… దాన్నే టైటిల్ చేసేశారు… కథ కూడా నిస్సత్తువగా, నీరసంగా కదులుతూ ఉంటుంది… పెళ్లిపీటల నుంచి కాబోయే వధువు లేచిపోవడం అనే ఇంట్రస్టింగ్ పాయింట్ నుంచి కథను అదే టెంపోతో నడిపిస్తే సినిమా ఓ మోస్తరుగా ఉండేది… టాలెంట్ ఉన్నవాడికి తాత్కాలిక సమస్యలు వచ్చినా సరే, అవేమీ ఎదుగుదలను ఆపలేవు, ఏదో ఒక పాయింట్ తమలోని ఎదిగే కసిని ప్రేరేపించాలి అనే కథ పాయింట్ బాగానే ఉన్నా, దాన్ని ప్రేక్షకులకు ఆకట్టుకునేలా చెప్పడంలో లోపం…

నచ్చిన విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాల్లోనూ… చిన్న సినిమాలే అయినా, కొందరు దర్శకుల్లా… యూత్‌ను అట్రాక్ట్ చేస్తామనే పిచ్చి భ్రమలకు లోనుగాకుండా అశ్లీలాన్ని, వెగటు సీన్లను ఆశ్రయించలేదు… ఫ్యామిలీలతో వెళ్లినా సరే పెద్ద ఇబ్బంది లేదు… పిచ్చి పాటలు, గెంతులు, అరుపులు, తిక్క పంచులు, కుర్చీలు మడతపెట్టడాలు గట్రా ఏమీ లేవు… ఇద్దరు హీరోలూ మెప్పించకపోవచ్చుగాక, కానీ చికాకుపెట్టలేదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కితకితలు గీతాసింగ్… జోవియల్ సెల్ఫ్ పంచుల నడుమ కళ్లల్లో చెమ్మ..!!
  • సినిమా అంటేనే పత్తాలాట… ఏడిస్తే లాభం లేదోయీ ‘బార్బరికా..’
  • అత్తా అనసూయమ్మా… నీతో వరసోయమ్మా… హేమిటో, అప్పట్లో ఆ కథలు..!
  • గెలిచినవాడే తోపు..! ఇదే బాబు మార్క్ ‘పడిలేచే కెరటం’ ఫిలాసఫీ…!
  • మిస్టర్ అమిష్… పురాణాల్ని కూడా వక్రీకరించింది నువ్వు కాదా..?!
  • కొరియన్ హీరోయిన్… మంగోలియా విలన్… హీరో లోకలేనా సార్..?!
  • కాళేశ్వరం కత్తి ఇక మోడీ చేతిలో..! రేవంత్‌రెడ్డి వదిలేశాడు దేనికి..?!
  • పిచ్చి కూతలు, తిక్క చేష్టలు… మ్యూజిక్ అంటూనే ఇవేం పైత్యాలురా సామీ…
  • మూయించిన ఒక వీరుని కంఠం…. చక్రవర్తి టాప్ నంబర్ వన్ సాంగ్…
  • గోదాట్లో పడిపోయిన భానుప్రియ… ఆ నీళ్ల కింద ఊబి… హాహాకారాలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions