Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ శివుడి గుడి కోసం రెండు దేశాల యుద్ధం… అసలు కథ ఏమిటంటే..?!

July 25, 2025 by M S R

.

  • నిన్న మనం ఓ కథనంలో చెప్పుకున్నాం కదా, ఒక శివాలయం కోసం రెండు బౌద్ధ దేశాలు యుద్ధానికి దిగుతున్నాయని… ఇంకాస్త డీప్‌గా వెళ్దాం, అసలు కథేమిటో…

Pardha Saradhi Potluri ……. 2025 వ సంవత్సరం యుద్దాలతో అతలాకుతలం అయ్యేట్లుగా ఉంది!

గురువారం, జులై 24, 2025.
థాయిలాండ్ Vs కాంబోడియా!
థాయిలాండ్ కాంబోడియాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.
థాయిలాండ్ కాంబోడియా దేశాల సరిహద్దులలో దాదాపుగా యుద్ధమే మొదలయ్యింది!

Ads

రెండు దేశాల సరిహద్దు సమస్య ఘర్షణకి కారణమయ్యింది.
కాంబోడియా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్స్ తో థాయిలాండ్ మీద దాడి చేయగా ప్రతిగా థాయిలాండ్ తన F-16 ఫైటర్ జెట్స్ తో కాంబోడియా మీద దాడి చేసింది!

*********************
హిందూ దేవాలయాలు ఘర్షణకి ప్రధాన కారణం!

నిజానికి రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదమే యుద్దానికి కారణం అని చెపుతున్నా అదే సరిహద్దుల వద్ద ఉన్న పురాతన హిందూ దేవాలయాల కాంప్లెక్స్ మాకు చెందినది అని కాంబోడియా అంటే లేదు ఆ ప్రాంతం మాదే అని థాయిలాండ్ వాదించడమే మొదట ఘర్షణకి ఇప్పుడు యుద్దానికి కారణమయ్యింది.

థాయిలాండ్, కాంబోడియాల మధ్య 800 km మేరకు సరిహద్దు ఉంది.
1863 నుండి 1953 వరకూ ఫ్రెంచ్ వాళ్లు కాంబోడియాని పాలించారు. 1907 లో ఫ్రెంచ్ వాళ్లు కాంబోడియా, థాయిలాండ్, లావోస్ మధ్య సరిహద్దులని నిర్ణయించారు. దీనిని ఎమరాల్డ్ ట్రయాంగిల్ అంటారు.
థాయిలాండ్ 1907 లో సరిహద్దులని ఒప్పుకున్నా తమ భూభాగం కాంబోడియాలో ఉండిపోయింది అని అసంతృప్తితో ఉంది.

ప్రే విహార్ దేవాలయం – Preah Vihear Temple!
ఇది శివాలయం, శిఖరేశ్వర, భద్రేస్వర స్వాములు కూడా కొలువై ఉన్నారు.
9వ శతాబ్దపు కాలంలో అంటే CE 889 నుండి 910 CE వరకూ రాజా యశోవర్మన్ ఈ దేవాలయ నిర్మాణం మొదలుపెట్టారు.

రాజా సూర్యవర్మన్ I ఈ దేవాలయ నిర్మాణాన్ని CE 1002 నుండి 1050 వరకూ కొనసాగించగా, రాజా సూర్యవర్మన్ II దీనిని 1113 నుండి 1150 లో పూర్తి చేశారు. రెండు వందల సంవత్సరాల పాటు ప్రే విహార్ దేవాలయం నిర్మాణం కొనసాగింది. పేరుకే దేవాలయం కానీ అదొక పెద్ద టెంపుల్ కాంప్లెక్స్ గా తీర్చిదిద్దారు.
ఈ కాలంలోనే రాజా సూర్యవర్మన్ II ప్రసిద్ధ ఆంగ్ కోర్ వాట్ టెంపుల్ కాంప్లెక్స్ ని కట్టించాడు.

*********************
ఈ ప్రే విహార్ ఆలయ సముదాయం కోసమే కాంబోడియా థాయిలాండ్ దేశాలు ఘర్షణ పడుతూ వస్తున్నాయి దశాబ్దాలుగా!
థాయిలాండ్ ప్రే విహార్ టెంపుల్ కాంప్లెక్స్ ఫ్రెంచ్ వాళ్లు విభజించిన సరిహద్దు కాంబోడియాలోనే ఉంది కానీ ఫ్రెంచ్ వాళ్లు వెళ్లిపోయాక థాయిలాండ్ ఎమరాల్డ్ ట్రయాంగిల్ ప్రాంతం తమకే చెందాలని వాదిస్తూ వస్తున్నది.

కాంబోడియాలో ఉన్న టెంపుల్ కాంప్లెక్స్ ని కాంబోడియన్లు ప్రే విహార్ అని పిలిస్తే అదే థాయిలాండ్ ప్రజలు దానిని ఖావ్ ఫ్రా విహార్న్ ( Khao Phra Viharn) అని పిలుస్తారు కానీ రెండు దేశాలకి పవిత్రమైన ప్రదేశమే అది!

చిత్రం ఏమిటంటే… రెండు వందల ఏళ్ళ పాటు తమిళ హిందూ రాజులు ( చక్రవర్తులు అనే పిలవాలి) రెండు దేశాలలో అంటే khmer రాజ్యాన్ని పరిపాలించిన సమయంలో కట్టిన హిందూ దేవాలయలు అవి. అయితే తరువాతి కాలంలో వాటిని బౌద్ధ దేవాలయలుగా మార్చేశారు.

Prasat_Preah_Vihear

Prasat_Preah_Vihear

మన దేశంలో మాత్రం ‘బోడి సత్తులు’ ప్రతీ దేవాలయం బౌద్ధ దేవాలయం మీద కట్టారు అని వాదిస్తారు. అంతెందుకు ఆంగ్కార్ వాట్ కాంప్లెక్స్ లో భారతీయ యాత్రీకులు ఎవరన్నా ఫోటోలు, వీడియోలు తీస్తే సెక్యూరిటీ వాళ్లు వచ్చి వాటిని తీసేసే దాకా వదలరు.

ఎందుకంటే, గోడల మీద క్షీరసాగర మధనం నుండి రామాయణ, మహా భారత ఘట్టాలు శిల్పాలుగా చెక్కి ఉంటాయి కనుక అవి హిందూ దేవాలయాలు అని మనం అంటామేమో అని వాళ్ళ భయం.

****************
ప్రే విహార్ తమదే అంటూ కంబోడియా దేశం అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసి గెలిచింది.
1962 లో ICJ ( International Court of Justice) ప్రే విహార్ టెంపుల్ కాంప్లెక్స్, దాని చుట్టూ ఉన్న ప్రదేశం కంబోడియాకే చెందుతుంది అని తీర్పు ఇచ్చింది. కానీ థాయిలాండ్ ప్రే విహార్ టెంపుల్ కాంప్లెక్స్ తమ దేశపు భూమిలోనే ఉంది వాదిస్తూనే వస్తున్నది. ICJ తీర్పుని లెక్కచేయడం లేదు.

ఎందుకైనా మంచిదని కంబోడియా ప్రే విహార్ ని వారసత్వ సంపదగా గుర్తించమని UNESCO ని కోరింది. UNESCO ప్రే విహార్ ని వారసత్వ సంపదగా 2008 లో గుర్తించింది. దాంతో ఇరు దేశాల మధ్య వారం రోజులపాటు ఘర్షణలు జరిగిన దరిమిలా 12 మంది చనిపోయారు. 2013 లో ICJ మళ్ళీ ప్రే విహార్ టెంపుల్ కాంప్లెక్స్ కాంబోడియాకే చెందుతుందని తీర్పు చెప్పింది థాయిలాండ్ రివ్యూ పిటిషన్ ని కొట్టివేస్తూ.

మరో వివాదం
థాయిలాండ్ లోని సురీన్ ప్రావిన్స్ లో ప్రసత్ టా మున్ ( Prasat ta Muen) అనే పేరుకల మరో శివాలయం ఉంది. ఈ శివాలయం తమకే చెందుతుందని కాంబోడియా వాదిస్తున్నది. ఎందుకంటే khmer సామ్రాజ్యంలో భాగంగా ఉదయాదిత్య వర్మన్ II అనే రాజు ఆ శివాలయం కట్టించాడని, అప్పట్లో సురీన్ ప్రావిన్స్ లో భాగంగా దాంగ్రేక్ పర్వత ప్రాంతం khmer సామ్రాజ్యంలో ఉండేదని,  పాత KHMER హైవే కూడా అక్కడే ఉంది కాబట్టి…

చారిత్రిక సాక్ష్యాధారాలని బట్టి అది కాంబోడియాకే చెందుతుందని వాదిస్తూ ప్రసత్ టా మున్ దేవాలయాన్ని తమకి స్వాధీనం చేయమని డిమాండ్ చేస్తున్నది కాంబోడియా.
ఇప్పుడు ఘర్షణకి కారణం గత ఫిబ్రవరిలో థాయిలాండ్ భూభాగంలో కాంబోడియా సరిహద్దులో ఉన్న తా మొన్ తోమ్ టెంపుల్ ముందు కాంబోడియాకి చెందిన 100 ప్రజలు, ఒక ట్రూపు సైనికులు కాంబోడియా జాతీయ గీతం ఆలపించారు. అది తమ దేశానికి చెందినదే అనే భావం స్ఫరించేలా…!

దాంతో థాయిలాండ్ ప్రజలలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి కానీ థాయిలాండ్ సైన్యం నచ్చ చెప్పే ప్రయత్నంలో కాంబోడియా సైనికుడు థాయిలాండ్ సైన్యం చేతిలో చనిపోయాడు.
అయితే ఫిబ్రవరిలో జరిగిన ఘటన మీద రెండు దేశాల ప్రజలు, సైన్యం పగతో రగిలిపోతున్నారు.

జూన్ నెలలో రెండు దేశాలూ తమ సైన్యాలని సరిహద్దుకి ముఖ్యంగా emarold triangle ప్రాంతం దగ్గర మొహరించాయి. అంతటితో ఆగకుండా రెండు దేశాలూ ఎగుమతులు, దిగుమతులని నిలిపివేసాయి. థాయిలాండ్ అయితే కాంబోడియాకి సరఫరా చేస్తున్న విద్యుత్ ని నిలిపి వేస్తానని బెదిరించింది.

ఈ నెల మొదటివారంలో బోర్డర్ దగ్గర గస్తీ కాస్తున్న థాయిలాండ్ సైనికుల్లో అయిదుగురు లాండ్ మైన్ పేలుడులో తీవ్రంగా గాయపడ్డారు. అయితే థాయిలాండ్ సైన్యం కాంబోడియా సైన్యమే తమ దారిలో లాండ్ మైన్స్ పాతిపెట్టింది అని ఆరోపించగా, అవి పాతవి అయిండవచ్చు అని థాయిలాండ్ ఆ ఆరోపణని తోసిపుచ్చింది.

థాయిలాండ్ తమ దేశంలో ఉన్న కాంబోడియా రాయబారిని బహిష్కరించడమే కాకుండా కాంబోడియాతో ఉన్న అన్ని సరిహద్దు దారులని మూసివేసింది. ఇరు దేశాల ప్రజలు అటునుండి ఇటు రాకుండా. ప్రతిగా కాంబోడియా తన రాయబార కార్యాలయం మొత్తానికే ఖాళీ చేయగా, కాంబోడియాలో ఉన్న థాయిలాండ్ రాయబారిని బహిష్కరించింది.

థాయిలాండ్ ప్రభుత్వం కాంబోడియాలో ఉన్న ప్రజలని వెంటనే తిరిగి స్వదేశానికి వచ్చేయమని హెచ్చరిక చేసింది.
నిన్న ఉదయం సరిహద్దుల దగ్గర ఎదురు కాల్పులు చేసుకున్నారు. దాంతో ఫైరింగ్ మొదలుపెట్టింది థాయిలాండ్ సైన్యమే అని ఆరోపిస్తూ కాంబోడియా ఆర్టీలరీ షెల్స్, మల్టీ బ్యారెల్ రాకెట్లతో థాయిలాండ్ మీద తీవ్రమైన దాడి చేసింది.

థాయిలాండ్ లో ఉన్న ఒక పెట్రోల్ బంక్ మీద ఆర్టీలరీ రాకెట్ పడడంతో క్షణాలలో అది మంటలలో చిక్కుకొని ఆరుగురు పౌరులు మరణించారు. దాంతో థాయిలాండ్ F-16 లతో కాంబోడియా సరిహద్దుల వద్ద ఉన్న సైనిక పోస్టుల మీద దాడి చేసింది.

కంబోడియా

Prasat_Preah_Vihear

******************
CIA హస్తం?
YES. నాకైతే ఒక ఇరాక్, ఒక లిబియా సంఘటనలు గుర్తుకొచ్చాయి.
ఇరాక్, లిబియాలలో CIA తో కలిసి జార్జ్ సోరోస్ ప్రణాళికాబద్ధంగా ఒక వర్గం ప్రజలలో, సైన్యంలో పనిచేస్తున్న సీనియర్ అధికారులని ప్రలోభ పెట్టి తిరుగుబాటు వచ్చేలా చేశాడు.

ఇప్పుడు ఇటు కాంబోడియాలో, అటు థాయిలాండ్ లో జాతీయవాదం పేరుతో ప్రజలని రెచ్చగొడుతున్నారు. థాయిలాండ్ సైనిక అధికారులు పగతో రగిలిపోతూ మీరు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా కాంబోడియా మీద దాడి చేసి తీరుతాం అన్న ధోరణిలో ఉన్నారు. ఇటు కాంబోడియాలో కూడా అదే పరిస్థితి.

కానీ ఇరు దేశాల ప్రభుత్వాధినేతలు చర్చలతో సమస్యని పరిష్కరించుకోవాలనే కోరుకుంటున్నారు.
అక్కడ థాయిలాండ్ కానీ, కాంబోడియా కానీ ఎక్కువగా టూరిజం మీద ఆధారపడి డాలర్లని సంపాదిస్తున్నాయి. యుద్ధం అంటూ జరిగితే అది టూరిజం మీద ప్రభావం చూపిస్తుంది అని ప్రభుత్వాల భయం. కానీ ప్రజల భావోద్వేగాల ముందు ఇవేవి గుర్తుకు రావు.

Well… చైనా మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వచ్చింది. ఎందుకంటే రెండు దేశాలతో పాటు లావోస్ దేశంలో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయి. లావోస్ అయితే చైనా ఇచ్చిన అప్పుల ఊబిలో చిక్కుకుపోయి విలవిలలాడుతున్నది.

లావోస్ లాండ్ లాక్డ్ కంట్రీ. యుద్ధం అంటూ వస్తే థాయిలాండ్, కాంబోడియాలకి వచ్చే టూరిస్టులు ఆగిపోయి, అది లావోస్ ని దెబ్బతీస్తుంది కాబట్టి చైనా కి అక్కడ శాంతి నెలకొని ఉండడం చాలా ముఖ్యం! CIA టార్గెట్ ఏమిటో ఇప్పటికిప్పుడు చెప్పలేం!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వ్యతిరేక గొంతులో పచ్చివెలక్కాయ… రేవంత్‌‌పై కాంగ్రెస్ హైకమాండ్ హేపీ…
  • గాంధీ వారసుడా..? నిమిష రక్షణపై మన దేశ పరిమితులు తెలియవా..?!
  • రామోజీరావు టేస్టున్న మూవీస్ నిర్మిస్తున్న ఆ కాలంలో… ఓ ముత్యం..!!
  • ఎమోజి..! అదొక ఎమోషన్ సింబల్… అదుపు తప్పితే మర్డర్లే మరి..!!
  • ఇక్కడే కాదు, ప్రపంచమంతా ఇదే సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ల బురద…
  • ఓ శివుడి గుడి కోసం రెండు దేశాల యుద్ధం… అసలు కథ ఏమిటంటే..?!
  • ఓరేయ్ పిచ్చోడా… పెళ్లి సరే, భరణ భారం ఏమిటో తెలుసా నీకు..?!
  • ఓ ప్రాచీన శివాలయం కోసం రెండు బౌద్ధ దేశాల సాయుధ ఘర్షణ..!!
  • ధర్మం, చట్టం, న్యాయం… ముగ్గురు మిత్రులు అంటే ఇవే…!
  • సీఎం చెబుతున్నట్టు ఫోన్‌ట్యాపింగ్ చట్టబద్ధమే… కానీ షరతులు వర్తిస్తాయి..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions