Yanamadala Murali Krishna….. గుంపులోని వారికన్నా మెరుగ్గా వున్నా కష్టమే… కొంతకాలం క్రితం ఫార్మా కంపెనీల ప్రయోజనాల మేరకు వైద్య చికిత్స విధానం నడుస్తున్నదా అని ఒకరు ప్రశ్నించారు. నేను అవును అని చెప్పా. అక్కడున్న వాళ్లలో కొందరు అవుననీ, కొందరు కాదనీ చెప్పారు. చివరిగా ప్రశ్న అడిగిన వారు పేషంట్ కోలుకోవడం తప్ప మరేదీ వైద్యులకు ఎక్కువ కాదని, డాక్టర్స్ యొక్క ప్రిస్క్రిప్షన్స్ ని తుచ్చమైన బుల్లి బుల్లి గిఫ్ట్స్ ప్రభావితం చెయ్యలేవని చెప్పారు.
ప్రశ్నించిన వారి ఉద్దేశం ఏమంటే, ఒక రకం మందుని ఫార్మా రంగం ప్రమోట్ చేసినంత మాత్రాన ఆ కంపెనీ బ్రాండ్ నే సూచించడం జరగదు అని. ప్రశ్నించిన వారి పరిధిలో అది నిజమేమో. నేను అన్నది మాత్రం… అందుబాటులో వున్న ఔషధాల స్థానంలో, పరిశోధనతో కొత్త ఔషధాన్ని ప్రవేశపెట్టిన ఫార్మా దిగ్గజాల ప్రభావం కొత్త ట్రీట్మెంట్ నిర్దేశాలుగా వస్తాయి. పాత మందులు గొప్పవి అయినా వాటిని పక్కన పెట్టేస్తారు. ఇలాంటి విషయాలలో మన భారతీయ వైద్యులకు ఏ అవగాహనా ఉండదు.
ఇక్కడ ఏ ఫార్మా కంపెనీ కూడా ఒక్క కొత్త మందునూ సొంతంగా పరిశోధించి తయారు చెయ్యలేదు. నిజానికి ఎయిడ్స్ చికిత్సలో గత మూడు నాలుగేళ్లుగా ఒక కొత్త మందును… గతంలో వున్న చక్కగా పనిచేసే మందుల స్థానంలో మొదలు పెట్టాలి అని అంటున్నారు. కొత్త మందు నిస్సందేహంగా మెరుగైనది. అయినంత మాత్రాన అందరికీ అదే మందు మొదలు పెట్టడం సరి కాదు. తరువాత నాకు అర్ధం అయ్యింది, ప్రశ్న అడిగిన వాళ్లకు ఈ విషయాలు తెలీదు కదా. జ్ఞానవిస్తృతి వల్ల నేను ఇలా తిక్కలోడిలా అగుపడతాను.
Ads
మేధావులను అనేక సందర్భాల్లో అపార్థం చేసుకోవడం పరిపాటి. చిన్నబుచ్చడానికి ప్రయత్నించడం, గేలి చేయడం, ఇంకా వీలుంటే బద్నామ్ చెయ్యడం, తెలివితేటలను శంకించడం ఇలాంటి అనేక విధాలైన చికాకులు ఎదురవుతాయి. అయినా సమాజానికి మేలు చెయ్యాలనే ఏకైక ఆశయంతో ఆలోచనలను వెల్లడిస్తుంటాం. 1996 నుండి వందల మంది ప్రపంచ నిపుణులు కూర్చిన మూడు ఔషధాలతో ఎయిడ్స్ చికిత్సను కాదని… కాకినాడ వంటి చిన్న ఊరిలో ఒంటిగా ప్రాక్టీస్ చేస్తూ రెండు ఔషధాల చికిత్స ప్రకటించడం గొప్ప సాహసం. గత మూడు నాలుగేళ్లుగా రెండు ఔషధాల ఎయిడ్స్ చికిత్స గురించి ప్రపంచ నిపుణులు ఆలోచిస్తున్నారు…… డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండి, కాకినాడ 4 జనవరి 2022
ఇది గత ఏడాది సాక్షిలో వచ్చిన ఆర్టికల్… తాజా కలం : ప్రపంచం అంతా 1996 నుండి హెచ్ఐవి చికిత్సలో ప్రామాణికంగా ఉన్న మూడు ఔషధాల స్థానంలో…. డాక్టర్ యనమదల మురళీకృష్ణ 18 ఏళ్ల క్రితం నుండి సూచిస్తున్న రెండు ఔషధాల విధానం… 2022 చివరి నుండి ప్రామాణిక చికిత్సలో భాగం అయ్యింది…
Share this Article