అందరూ మోహన్‌బాబు సన్నాఫ్ ఇండియాను తిట్టిపోస్తున్నారు గానీ…. ఇంత ఫ్లాప్ ఈమధ్య ఏ సినిమా ఎదుర్కోలేదని ట్రోల్ చేస్తున్నారు గానీ… ది గ్రేట్ వర్మ అనబడే దర్శకరత్నం నాగార్జునతో తీసిన ఆఫీసర్ అనే సినిమా చెప్పనలవి కానంత ఫ్లాప్… ఈరోజుకూ ఆఫీసర్ అనే పదం వింటే చాలు నాగార్జున గజ్జున వణికిపోతాడు… నిజానికి సన్నాఫ్ ఇండియా సినిమా వల్ల మోహన్‌బాబు ఇజ్జత్ నష్టమే గానీ డబ్బు నష్టమేమీ లేదు… అదేమిటో తరువాత చెప్పుకుందాం గానీ…
ఓ రెండు సినిమాల గురించి చెప్పుకోవాలి… ప్రస్తుతం సినిమాలకు ప్రధాన ఆదాయవనరు థియేటర్ సంపాదన కాదు… నిజానికి జగన్ పదీఇరవై రూపాయలు పెంచినా పెంచకపోయినా పెద్ద ఫరకేమీ పడదు… ఓటీటీ వాడు ఎంతకు కొంటాడు, ఓవర్సీస్ డబ్బులెన్ని వస్తాయి, శాటిలైట్ రైట్స్‌తో ఎంత వస్తుంది..? ఈ అంశాలే ప్రధానం…
ఓటీటీ వాడు సినిమాను కొంటే, అలా పెట్టేస్తాడు… చూసేవాళ్లు చూస్తారు, లేకపోతే లేదు… తమ మొత్తం కంటెంటులో అదీ ఓ పార్ట్… కానీ టీవీవాడికి అలా కాదు… ప్రైమ్ టైమ్ చాలా విలువైంది… ఆఫ్ ప్రైమ్ టైమ్‌కు కూడా కొంత విలువ ఉంటుంది… యాడ్స్, రేటింగ్స్, రీచ్ వంటి చాలా లెక్కలుంటయ్…
Ads
తాము ఏదో ఓ ధరకు, ఏదో అంచనాతో సినిమా కొన్నారనుకొండి… తీరా చూస్తే థియేటర్లలో జనం ఛీత్కరించారు… మౌత్ పబ్లిసిటీ, రివ్యూలు కూడా ఘోరంగా ఉన్నాయి… అప్పుడు ఏం చేయాలి..? యాడ్స్ ఇచ్చేవాడు దొరకడు, ప్రసారం చేసే టైమ్ స్పేస్ వేస్ట్… అప్పుడేం చేయాలి..? అన్నీ మూసుకుని, తమకు సంబంధించిన మూవీస్ చానెల్‌లో ఏదో టైమ్‌లో గుట్టుచప్పుడు గాకుండా ప్రసారం చేసి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవాలి… లక్ష్య అనే సినిమాకు సంబంధించి అదే జరిగినట్టు అనిపిస్తోంది…
లక్ష్య… ఈ సినిమాలో నాగశౌర్య హీరో… ఆర్చరీ క్రీడాంశంతో తీయబడిన ఓ సినిమా… అట్టర్ ఫ్లాప్… ఈ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలోనే తాను 9 రోజులపాటు నీళ్లు తాగలేదనీ, ఎయిట్ ప్యాక్ ఎక్స్‌పోజ్ కావాలంటే తప్పలేదనీ శౌర్యుడు విచిత్రమైన కూత ఏదో కూసినట్టు గుర్తుంది… సినిమా కూడా అలాగే ఉండటంతో ప్రేక్షకులు ఎహె పోవోయ్ అని చీదరించుకున్నారు… ముందే ఒప్పందం కుదిరిందేమో ఆహా ఓటీటీ కొన్నది…
ఆహా ఓటీటీ కంటెంట్ అంటేనే అదో టైపు కదా… లక్ష్య సదరు ఓటీటీకి సూటయ్యేదే… ఆమధ్య మాటీవీ వాడు కొన్నాడు… నిజానికి మాటీవీ రీచ్ ఎక్కువ… కావాలంటే రేటింగ్స్ కూడా సంపాదించగలడు… సమర్థుడు… కానీ తనకూ ఏమనిపించిందో ఏమో, ఈ సినిమా కోసం మాటీవీ టైమ్ స్పేస్ వేస్టనుకున్నాడో ఏమో… తమకే చెందిన స్టార్ మా మూవీస్ చానెల్‌లో ప్రసారం చేశాడు… ఆ టీవీవాడి భయం నిజమైంది… అత్యంత దరిద్రమైన రేటింగ్స్ వచ్చినయ్… హైదరాబాద్ బార్క్ కేటగిరీలో కేవలం 2.29 మాత్రమే టీఆర్పీలు దక్కాయి… రేటింగ్స్ కోణంలో ఇది భీకరమైన ఫ్లాప్…
ఇలాంటిదే మరో సినిమా… 1945… ఇది ఇంకా భీకరమైన సినిమా… అసలు దీనికి ఎండింగే ఉండదు… అన్నీ జంపులు జంపులుగా ఎపిసోడ్స్ కనిపిస్తుంటయ్… ఏం కథో, ఇదేం కథనమో అర్థం గాక ప్రేక్షకులు పిచ్చెక్కి, జుత్తు పీక్కుంటూ థియేటర్ల నుంచి బయటికొచ్చి పరుగోపరుగు… ఇందులో రానా హీరో… నిర్మాతలతో ఏదో పేచీ వచ్చింది… అదెంతకూ తెగలేదు… దాంతో సదరు నిర్మాతలు షూటింగ్ పూర్తయినంత వరకు ఎలాగోలా ఓచోట గుదిగుచ్చి రిలీజ్ చేసిపారేశారు…
నిజానికి అన్‌ఫినిష్డ్ సరుకుకు కాస్త రంగుపూసి అమ్మడంలాగే ఇది కూడా ప్రేక్షకుడిని మోసం చేయడం… పిచ్చి దర్శకుడు, తెలివిలేదు… సన్నాఫ్ ఇండియాలో నటీనటుల్ని బ్యాక్ నుంచి చూపించి, డమ్మీల మొహాలు బ్లర్ చేయించి, అసలు నటీనటులుగా నమ్మించే ప్రయత్నం చేశారు కదా… సేమ్, ఈ 1945లో రానా ఎగ్గొట్టిన పార్టులను డమ్మీ రానాతో షూట్ చేయిస్తే సరిపోయేది… రానాకు కూడా షాక్ తగిలేది… దీన్ని ఏ ఓటీటీవాడు కొన్నాడో తెలియదు గానీ జెమినివాడు ఆమధ్య ప్రసారం చేశాడు…
అసలు జెమిని వాడు ఎంత గొప్ప హీరో సినిమా ప్రసారం చేసినా సరే, రేటింగ్స్ రావు… దాని రీచ్ అంతే… అంతగా ఇప్పటికే దాన్ని భ్రష్టుపట్టించారు… అందులో అన్‌ఫినిష్డ్ సినిమా… థియేటర్లలో భీకరమైన ఫ్లాప్… ఇంకెవడు చూస్తాడు టీవీల్లో… 2.05 రేటింగ్స్ వచ్చినయ్… అనగా అత్యంత భీకరమైన ఫ్లాప్ అన్నమాట… తనకు డబ్బు సరిగ్గా చెల్లించనందుకు ఆ నిర్మాతకు మంచి శాస్తి జరిగిందీ అని రానా ఆనందపడి ఉండవచ్చుగాక… కానీ పరోక్షంగా తన పరువు కూడా డ్రైనేజీలో కలిసిందని మరిచిపోయాడు… ఇవండీ… సో, సన్నాఫ్ ఇండియాను మించిన సినిమాలు ఈమధ్య రాలేదని తిట్టేయకండి… వోకేనా..?!
Share this Article