Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వావ్ స్టాలిన్… టోల్ ప్లాజాలు, పరువు నష్టాలపై మరో రెండు మంచి అడుగులు…

September 5, 2021 by M S R

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకుంటున్న పలు నిర్ణయాలను ప్రశంసిస్తుంటే కొంతమందికి అస్సలు నచ్చడం లేదు… కారణం, స్టాలిన్ రాజకీయ ధోరణి నచ్చకపోవడం వల్ల కావచ్చు…! గుళ్లల్లో బ్రాహ్మణేతర అర్చకుల నియామకం, కేంద్ర వ్యవసాయ కొత్త చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం వంటి నిర్ణయాలు కొందరికి నచ్చడం లేదేమో…! విభేదించకూడదని ఎవరూ అనడం లేదు కానీ సమర్థించాల్సిన అంశాలు కనిపించినప్పుడు చప్పట్లు కొట్టకుండా ఎందుకు ఊరుకోవాలి..? ఇదీ అసలు ప్రశ్న… నిజానికి స్టాలిన్ మీద తను సీఎం అయ్యేదాకా ఎవరికీ పెద్ద ఆశలేమీ లేవు, గొప్పగా పాలిస్తాడనే భ్రమలు కూడా లేవు… తండ్రి ఉన్నన్నిరోజులూ ఆయనదే నిర్ణయాధికారం… స్టాలిన్ ఆలోచనల సరళి మీద నిజానికి ఎవరికీ అంచనాల్లేవు… కానీ కొన్ని పరిపక్వ నిర్ణయాలు కనిపిస్తున్నాయి… రాజకీయంగా హుందాతనం కూడా కనిపిస్తోంది… చిల్లర వ్యాఖ్యలు, డొల్ల కూతలు, దూషణలు గట్రా తమిళనాడులో వినిపించడం లేదు… ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఊళ్లల్లో హింస ప్రజ్వరిల్లేది… ఇప్పుడు అలాంటి వార్తలే రావడం లేదు… తమిళనాట ఎప్పుడూ ఊహించని ఓ రాజకీయ సుహృద్భావ వాతావరణం… మనం రెండు తాజా అంశాలు చెప్పుకుందాం… మెచ్చాల్సినచోట మెచ్చాలి… లేకపోతే ఈమాత్రం కూడా చేసేవాడు దొరకడు మరి…

toll gate

రాష్ట్రంలో 48 టోల్ ప్లాజాలున్నయ్… అందులో 32 మూసేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది… శ్రీపెరంబుదూరు దగ్గర నెమిలి, చెన్నసముద్రం, వనగరం, చెంగల్పట్టు దగ్గర పరనూర్, సురపత్తు ప్లాజాలను తక్షణం మూసేయాలని ఆదేశించింది… పది కిలోమీటర్ల రేడియస్‌లో ఏకంగా అయిదు ప్లాజాలుండటం ఏమిటో చెప్పండి సార్ అని తమిళనాడు రోడ్ల మంత్రి ఈవీ వేలు కేంద్ర మంత్రి గడ్కరీని కలవనున్నాడు… National Highways Fee (Determination of Rates and Collection) Rules 2008 ప్రకారం తమిళనాడులో 16 టోల్ ప్లాజాలు మాత్రమే ఉండాలి, ఒక్కో ప్లాజా నడుమ కనీసం 60 కిలోమీటర్ల దూరం ఉండాలి, మరి 48 టోల్ ప్లాజాల్ని ఎందుకు అనుమతించారని తమిళనాడు ప్రశ్నిస్తోంది… ప్రస్తుత మోడీ ప్రభుత్వ వైఖరి జనాన్ని ఇరగబాదడమే కాబట్టి ఈ టోల్ ప్లాజాల విషయంలో స్టాలిన్ ప్రభుత్వ కోరిక పట్ల సానుకూలంగా స్పందించకపోవచ్చు… కానీ ఒకటి మాత్రం క్లియర్… నేషనల్ హైవేస్ విధించే టోల్ ఓ దోపిడీ… ఒక రోడ్డుకు లేదా ఒక బ్రిడ్జికి ఎంత ఖర్చయిందో, ఎంత వసూలైందో, ఎన్నేళ్లుగా వసూలు చేస్తున్నారో ఎవరూ ఎవరికీ లెక్కలు చెప్పాల్సిన పనిలేదు… ఆ కంట్రాక్టర్, సంబంధిత అధికారులు ఎంత దోచుకుంటే అంత… మోడీలు, గడ్కరీలు స్పందిస్తారా లేదానేది వదిలేస్తే… స్టాలిన్ ప్రభుత్వం ఆ దిశలో ఆలోచిస్తున్న తీరునైనా అభినందిద్దాం…

Ads

జర్నలిస్టులు, దినపత్రికలు, టీవీ చానెళ్లపై పెట్టబడిన 90 పరువు నష్టం కేసుల్ని విత్ డ్రా చేసుకుంటున్నట్టు స్టాలిన్ గురువారం ప్రకటించాడు… ఇవన్నీ 2012 నుంచి 2021 వరకు ఎడిటర్లు, పబ్లిషర్లు, ప్రింటర్లు, చానెళ్లపై బనాయించినవే… 2011 నుంచి 2016 వరకు జయలలిత 214 కేసులు పెట్టింది… ఓ మూర్ఖ నియంత కదా… ప్రజాజీవితంలో ఉన్నప్పుడు కాస్త సంయమనం పాటించాలి అని సాక్షాత్తూ సుప్రీంకోర్టు హితవు చెప్పినా వినలేదు… ఇప్పుడు ఆ కేసుల్ని ఉపసంహరించుకోగానే రాష్ట్రంలో ప్రజాస్వామిక, భావప్రకటన వాతావరణం వెల్లివిరుస్తుందని కాదు, అదే సమయంలో మీడియా శుద్ధపూస అని కూడా కాదు, కాకపోతే కేవలం కొరడా పట్టుకుని, పరువునష్టం కేసులు వేసి, మీడియా నోరు మూయించగలం అనే పాలకధోరణికి భిన్నమైన కొత్త ధోరణిని చూస్తున్నాం… దాన్ని అభినందిద్దాం..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions