మద్యం… ప్రభుత్వ ఖజానాకు ఆక్సిజెన్… ఇప్పుడు ఏపీ వంటి రాష్ట్రాల్లో మద్యం ఓ పెద్ద రాజకీయాంశం… డబ్బు, నేరం, మత్తు, దందా వంటివెన్నో మద్యం చుట్టూ పరిభ్రమిస్తుంటాయి… ఇప్పుడు ఏపీప్రభుత్వం చౌక పథకం ఒకటి ప్రారంభించింది కదా… 99 రూపాయలకే క్వార్టర్ అని… అసలు మద్యం ఎన్ని రకాలు..?
మద్యం ఏదయినా మద్యమే కదా… ఆల్కహాలే కదా… మరి వోడ్కా, షాంపేన్, వైన్, బ్రాందీ, విస్కీ, రమ్, జిన్, బీరు, బ్రీజరు… ఏమిటి ఈ రకాలు..? వీటి మధ్య తేడా ఏమిటి..? చాలామందికి తెలియదు… ఓసారి చెప్పుకుందాం…
అన్నింట్లోనూ ఆల్కహాలే ఉండేది… కానీ తయారీ విధానాలు వేరు, టేస్ట్ వేరు, గాఢత వేరు, అఫ్‌కోర్స్ ధరలూ వేరు…
Ads
(1) వోడ్కా: ప్రధానంగా ధాన్యాలు, బంగాళాదుంపల నుండి తయారవుతుంది… వైట్, టేస్ట్ ఏమీ ఉండదు… చాలామంది ఏవేవో కలుపుకుని తాగుతారు కానీ వోడ్కాను స్ట్రెయిట్‌గానే తాగాలి… కూల్ చేసుకుని, 30 ఎంఎల్ అలాగే గొంతులో పోసుకుంటారు రష్యన్లు… రష్యాలోనే దీని వాడకం ఎక్కువ… మంచినీరు, ఇథనాల్ కలిగి స్వేదనం చేయబడ్డ ఒక మత్తు పానీయం ఇది. వోడ్కాలో ఆల్కహాల్ 40% వరకూ ఉంటుంది.
(2) బ్రాందీ: పండ్ల రసాల నుండి తయారవుతుంది, ముఖ్యంగా ద్రాక్ష రసం నుండి. ఇది దీని వయస్సు (తయారీ స్టేజ్ నుంచి కాలం) పెరిగినప్పుడు మరింత రుచికరంగా మారుతుంది. బ్రాందీని విందు సందర్భాల్లో ఎక్కువగా తాగుతారు. బ్రాందీ అనేది వైన్‌ను డిస్టిల్ చేసి తయారు చేసే మత్తు పదార్థం. 35 నుంచి 60% ఆల్కహాల్… కొన్ని బ్రాందీలను చెక్క బారళ్లలో ఉంచి, వయసు పెంచుతారు. బ్రాందీని straw yellow నుండి dark tan వరకు, కూడా… ఆకుపచ్చటి రంగులో కూడా కనిపించవచ్చు.
(3)విస్కీ: పులియబెట్టిన ధాన్యాల నుండి తయారవుతుంది.విస్కీని తయారు చేయడానికి, సాధారణంగా బార్లీ, రైస్, వీట్ లేదా మొక్కజొన్న వంటివి ఉపయోగిస్తారు. విస్కీ వయసు ఎంత పెరిగితే అంత రుచి. ఎక్సట్రా న్యూట్రల్ ఆల్కహాల్‌ను డైల్యూట్ చేసి, రంగు కలిపి చీప్ లిక్కర్ కూడా అమ్ముతారు… ప్రీమియం, స్కాచ్ రకరకాలు… 40% ABV (ఆల్కహాల్ బై వాల్యూమ్)తో తయారు చేస్తారు… మన దేశంలో ఈ మద్యం అమ్మకాలే ఎక్కువ…
(4) రమ్: పులియబెట్టిన చెరకు నుండి తయారవుతుంది. ఇది కాస్త తీపి రుచితో ఉంటుంది. రమ్ ఎక్కువగా కరేబియన్, ల్యాటిన్ అమెరికాలలో అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతుంది… తక్కువ గాఢత గల తేలికపాటి (Light) రా సరుకు కాక్ టెయిల్స్‌లో వినియోగిస్తారు… ఒకసారి రమ్ గాఢతకు అలవాటు పడ్డవాడు వేరే మద్యానికి మళ్లరు… ఆర్మీ, పోలీస్ ఇతర యూనిఫామ్ బలగాల్లో దీని వాడకం ఎక్కువ…
(5) జిన్: జునిపెర్ బెర్రీల నుండి తయారవుతుంది. ఇది ప్రత్యేకమైన వాసన, రుచితో ఉంటుంది. జిన్ టానిక్ వంటి మిక్సర్‌లతో కలిపి తాగడం సాధారణం. సాఫ్ట్… పార్టీ డ్రింక్… స్లో కిక్… హైఫై పార్టీల్లో ఆడవాళ్లు కూడా ఇష్టపడతారు… వైన్, రెడ్ వైన్ కూడా… షాంపేన్ మరోరకం మద్యం…
(6) బీరు: పులియబెట్టిన ధాన్యాల నుండి తయారవుతుంది, తక్కువ ఆల్కహాల్ శాతం కలిగి ఉంటుంది. బీరు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, వాటిని కలిపే విధానం, వాటి నాణ్యత వంటి అంశాల ఆధారంగా బీరుకు వేర్వేరు రుచులు వస్తాయి. విస్కీ ఎంత పాతబడితే అంత రుచి, దానికి విరుద్ధంగా బీరు ఎంత ఫ్రెష్ అయితే అంత టేస్ట్… సాఫ్ట్… హైలెవల్ బార్లలో ఫ్రెష్ బీర్ సప్లయ్ చేస్తారు… డ్రాట్, పిశ్చర్ బీర్లకు ధర ఎక్కువ… పేయింగ్ కెపాసిటీ ఉన్న కస్టమర్లు వీటికే ఇంపార్టెన్స్ ఇస్తారు…
(7) బ్రీజరు: ఫ్లేవర్డ్ ఆల్కహాలిక్ పానీయం, ఇది సాధారణంగా తక్కువ ఆల్కహాల్ శాతం కలిగి ఉంటుంది. ఇది తీపి రుచితో, ఫ్రూటీ ఫ్లేవర్స్‌లో లభిస్తుంది. లెమన్, లీచి, పైనాపిల్, ఆపిల్, రూబీ గ్రేప్ ఫ్రూట్, ఆరెంజ్, బ్లాక్‌బెర్రీ, వాటర్ మెలోన్, క్రాన్ బెర్రీ, కోకోనట్, రాస్ బెర్రీ, బ్లూ బెర్రీ, పొమె గ్రనేట్, స్ట్రా బెర్రీ మరియు మ్యాంగో… Breezer అనేది ఒక ఆల్కోపాప్, దీని బేస్‌లో సాధారణంగా తెల్ల రంగు రమ్ ఉంటుంది.
వైను, బీరు, ఏల్ వగైరాలని ఇంగ్లీషులో ఫెర్మెంటెడ్ లిక్కర్స్ (fermented liquors) అంటారు. బట్టీ పట్టగా వచ్చిన విస్కీ, బ్రాందీ, వోడ్కా వంటి వాటిని “డిస్టిల్డ్ లిక్కర్స్ (distilled liquors) అంటారు. ఒక పానీయంలో ఆల్కహాలు ఎన్ని పాళ్లు ఉందో చెప్పే సంఖ్యని ఇంగ్లీషులో “ప్రూఫ్” (proof) అంటారు. వైనులో ఆల్కహాలు 15 శాతం ఉంటే ఆ వైను 30 ప్రూఫ్. ఆల్కహాలు 50 శాతం ఉన్న పానీయాలు 100 ప్రూఫ్.
రసాయన పరిశోధనశాలలో వాడే “ఇథైల్ ఆల్కహాలు”లో 95 శాతం పక్కా ఆల్కహాలే. అంటే అది 190 ప్రూఫ్ అన్న మాట. నూటికి నూరు పాళ్లూ ఆల్కహాలే ఉన్న ద్రవం 200 ప్రూఫ్. ఇది అపురూపమైనది. అతి విలువైనది. అరుదైనది. కల్తీ లేనిది. సీసా బిరడా తీసేసరికి గాలిలోని చెమ్మదనం లోపలికి చేరి కల్తీ అయిపోతుంది…
సపోజ్ ఒక క్వార్టర్ 100 రూజాయలకు మనకు దొరుకుతుందీ అంటే… దాని ఉత్పత్తి ధర 15-20 రూపాయలకన్నా తక్కువ… అడ్డగోలు ఎక్సయిజు, టాక్స్, సర్కారీ డిపోల మార్జిన్, వైన్ షాపుల లైసెన్స్ ఫీజులు, తయారీదారు లాభం, రిటెయిలర్ మార్జిన్… మన్నూమశానం అన్నీ కలిపితే అంత ధర అవుతుంది… ఆ దందాలో అంత మత్తుంది గనుకే పొలిటిషియన్లు కూడా లిక్కర్ మాఫియాలా మారిపోతున్నారు…!!
Share this Article