Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రతి లిక్కరూ విస్కీ కాదు – ప్రతి మద్యానికీ ఓ కథ ఉంది

September 5, 2026 by M S R

.

విస్కీ వేరు.. స్కాచ్ వేరు! మద్యం అంటే జస్ట్ ఆల్కహాల్ కాదు.. అసలు ఏది ఏ మద్యం? “మద్యం అంటే ఏంటి?” అడిగితే మనలో చాలామంది ఠక్కున చెప్పే సమాధానం… “ఆల్కహాల్!” అంతే. అక్కడితో మన జ్ఞానం అయిపోతుంది!

కానీ బార్‌లోకి వెళ్లి చూస్తే మాత్రం బోలెడు బాటిళ్లు… విస్కీ, స్కాచ్, వోడ్కా, జిన్, రమ్, బ్రాండీ, టెకీలా, బీర్, వైన్… మళ్లీ వాటిలో రకరకాల బ్రాండ్లు. అన్నీ ఆల్కహాలే కదా… మరి ఇన్ని పేర్లెందుకు? ఇక్కడే అసలు కథ ఉంది.

Ads

ఏ ముడిపదార్థంతో తయారు చేశారు? ఎలా పులియబెట్టారు? ఎలా డిస్టిల్ చేశారు? ఏ దేశంలో తయారైంది? ఎంతకాలం పీపాల్లో ఉంచారు? ఏ సువాసనలు, మూలికలు కలిపారు? ఈ తేడాలే ఒకదాన్ని విస్కీగా, మరొకదాన్ని రమ్‌గా, ఇంకొకదాన్ని జిన్‌గా, మరొకదాన్ని బ్రాండీగా మార్చేస్తాయి.

అసలు ఏది ఏ మద్యం? విస్కీ అంటే ఇదీ.. స్కాచ్ అంటే అదీ! 

ముందుగా విస్కీ…. బార్లీ, మొక్కజొన్న, రై, గోధుమలు వంటి ధాన్యాలను ఉపయోగించి విస్కీ తయారు చేస్తారు. దేశాన్ని బట్టి తయారీ విధానం మారుతుంది. అమెరికాలో బోర్బన్, ఐర్లాండ్‌లో ఐరిష్ విస్కీ, కెనడాలో కెనడియన్ విస్కీ… ఇలా రకాలు ఉన్నాయి.

మరి స్కాచ్? స్కాచ్ కూడా విస్కీయే! కానీ స్కాట్లాండ్‌లో తయారైన విస్కీకి మాత్రమే స్కాచ్ అనే పేరు వస్తుంది. స్కాచ్‌గా గుర్తింపు పొందడానికి నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది. కనీసం మూడేళ్లు ఓక్ పీపాల్లో పరిపక్వం చెందాలి.

అంటే… విస్కీ ఒక పెద్ద కుటుంబం అయితే, స్కాచ్ ఆ కుటుంబంలోని స్కాటిష్ సభ్యుడు.

red wine

వోడ్కా వేరు.. జిన్ వేరు! వోడ్కా సాధారణంగా న్యూట్రల్ టేస్ట్ కోసం తయారు చేస్తారు. వివిధ ముడిపదార్థాల నుంచి స్పిరిట్ తయారు చేసి, డిస్టిలేషన్, ఫిల్టరింగ్ వంటి ప్రక్రియల ద్వారా దాని ప్రత్యేక రుచిని వీలైనంత వరకు తగ్గిస్తారు. జిన్ కూడా న్యూట్రల్ స్పిరిట్‌తో మొదలవుతుంది. కానీ అక్కడితో ఆగదు.

జునిపర్ బెర్రీలు దానికి అసలు గుర్తింపు ఇస్తాయి. వాటితో పాటు వివిధ బొటానికల్స్, మూలికలు, సుగంధ ద్రవ్యాలు కలుపుతారు.

అందుకే… వోడ్కా— న్యూట్రల్. జిన్— జునిపర్‌తో సువాసనభరితం.

రమ్ అంటే చెరకు.. బ్రాండీ అంటే పండు! రమ్ అంటే చెరకు గుర్తుకు రావాలి. చెరకు రసం లేదా మొలాసిస్‌ నుంచి రమ్ తయారవుతుంది. అందుకే చాలా రమ్స్‌లో తీపి స్వభావం కనిపిస్తుంది. బ్రాండీ మాత్రం సాధారణంగా పండ్లను పులియబెట్టి తయారైన ద్రవాన్ని డిస్టిల్ చేయడం ద్వారా తయారవుతుంది. ద్రాక్షతో తయారైన వైన్ నుంచి చేసే బ్రాండీ అత్యంత ప్రసిద్ధమైనది.

ఓక్ పీపాల్లో వృద్ధి చేస్తే రంగు, సువాసన, రుచిలో మరింత మార్పు వస్తుంది.

అంటే… రమ్‌కు చెరకు మూలం.
బ్రాండీకి పండు మూలం.

liquor

టెకీలా, మెజ్కాల్.. రెండూ అగావేనే! మెక్సికో పేరు వినగానే టెకీలా గుర్తుకొస్తుంది. టెకీలా బ్లూ వెబర్ అగావే మొక్కతోనే తయారు చేయాలి. అంతేకాదు, మెక్సికోలో నిర్దిష్ట ప్రాంతాల్లో తయారైనదే టెకీలా అనే గుర్తింపు పొందుతుంది.

మరి మెజ్కాల్? ఇదీ అగావే నుంచే. కానీ వివిధ రకాల అగావేలను ఉపయోగించవచ్చు. సంప్రదాయ పద్ధతుల్లో అగావేను భూమిలోని గుంతల్లో ఉడికించడం వల్ల దానికి ప్రత్యేకమైన పొగ వాసన, స్మోకీ రుచి వస్తుంది.

కాబట్టి… టెకీలా—బ్లూ అగావే.
మెజ్కాల్—వివిధ అగావేలు, తరచూ స్మోకీ ఫ్లేవర్.

షాంపేన్ అంటే బబ్లీ వైన్ కాదు! బాటిల్ తెరిచినప్పుడు బుడగలు వస్తే అదంతా షాంపేన్ అనుకుంటే పొరపాటే. షాంపేన్ ఫ్రాన్స్‌లోని షాంపేన్ ప్రాంతానికి చెందిన స్పార్క్లింగ్ వైన్. దీని సంప్రదాయ తయారీ విధానంలో రెండో ఫెర్మెంటేషన్ బాటిల్‌లోనే జరుగుతుంది.

మరి ఇటలీకి చెందిన ప్రోసెక్కో? దీని తయారీలో సాధారణంగా రెండో ఫెర్మెంటేషన్ పెద్ద ట్యాంకుల్లో జరుగుతుంది. అందుకే సాధారణంగా ఫలాల సువాసన ఎక్కువగా ఉండే, తేలికైన శైలి కనిపిస్తుంది.

అంటే… ప్రతి బబ్లీ వైన్ షాంపేన్ కాదు. షాంపేన్ అనేది ఒక ప్రాంతానికి, ఒక నిర్దిష్ట తయారీ సంప్రదాయానికి చెందిన పేరు.

బీర్‌కు బార్లీ.. సైడర్‌కు యాపిల్! ఇక మనకు బాగా పరిచయమైన బీర్. బీర్‌ను సాధారణంగా బార్లీ వంటి ధాన్యాలతో తయారు చేస్తారు. హాప్స్ ఉపయోగించడం వల్ల దానికి ప్రత్యేకమైన చేదు, సువాసన వస్తుంది. సైడర్ మాత్రం ధాన్యంతో కాదు. ఆపిల్ రసాన్ని పులియబెట్టి తయారు చేస్తారు.

కాబట్టి… బీర్‌కు ధాన్యం.
సైడర్‌కు యాపిల్.

liquorscam

మరి మన “చీప్ లిక్కర్” ఏంటి? ఇదే అసలు మన ఊరి ప్రశ్న! “చీప్ లిక్కర్” అనేది సాంకేతికంగా ఒక ప్రత్యేకమైన మద్యం రకం కాదు. మన రోజువారీ వాడుకలో తక్కువ ధరకు లభించే మద్యం మొత్తాన్నీ చీప్ లిక్కర్ అంటుంటాం. కానీ అందులో కూడా తేడాలున్నాయి.

మన దేశంలో తయారయ్యే *IMFL (Indian Made Foreign Liquor)*లో కూడా తక్కువ ధర నుంచి ప్రీమియం వరకు అనేక స్థాయిలు ఉంటాయి. ఇక మరోవైపు కంట్రీ లిక్కర్ లేదా దేశీయ మద్యం అనే వర్గం ఉంటుంది. రాష్ట్రానికో, ప్రాంతానికో దాని పేర్లు, తయారీ విధానాలు మారవచ్చు. ఉదాహరణకు గోవాలో ఫెని, కాజు నుంచి లేదా కొబ్బరి నుంచి తయారు చేస్తారు, ఘాటు…

కల్లు మాత్రం పూర్తిగా మరో కథ. తాటి, ఈత వంటి చెట్ల నుంచి వచ్చే కల్లు సహజంగా పులియబడే పానీయం.

మరి సారాయి? మన దగ్గర “సారాయి” అన్న పదాన్ని చాలా సందర్భాల్లో దేశీయంగా తయారయ్యే డిస్టిల్డ్ మద్యం కోసం వాడుతుంటారు. చట్టబద్ధంగా తయారయ్యే, విక్రయించే ఉత్పత్తులకు నిబంధనలు ఉంటాయి; అక్రమంగా తయారయ్యే కల్తీ మద్యం మాత్రం పూర్తిగా వేరే ప్రమాదకరమైన విషయం.

మరి “ఇప్పసారాయి” అంటే?  ఇప్ప చెట్టు పూలు పులియబెట్టి, వాటి నుంచి డిస్టిల్ చేసి తయారుచేసే దేశీయ మద్యాన్ని ఇప్పసారాయి అని అంటారు. ఇక్కడ “ఇప్ప” అంటే మహువా/ఇప్ప చెట్టు.

అంటే అది విస్కీ కాదు. రమ్ కాదు. బ్రాండీ కాదు. ఇప్ప పూల నుంచి వచ్చిన దేశీయ మద్యం. ఇదే మన సంస్కృతిలో, జానపదంలో, పాటల్లో కనిపించే మద్యం. అందుకే ఇప్పుడు ‘ఏశ నాగుల కట్ట మీద’ పాట మరింత ఆసక్తికరం! తెలంగాణలో ఎప్పటినుంచో దావత్‌ల్లో, పెళ్లిళ్లలో, జాతర్లలో, డీజేల్లో వినిపించే జానపద గీతం…

శ్యామ్

“ఏశ నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల
మనం ఊగుదమే బాలా…”

ఇప్పుడు ది ప్యారడైజ్ సినిమాలోకి వచ్చింది. నాని, కీర్తి సురేష్‌లపై తెరకెక్కిన ఈ పాట విడుదలైన వెంటనే వైరల్‌గా మారింది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ సినిమా సూపర్ హిట్ ప్రస్తుతం … అయితే ఈ పాటలో మన కథనానికి సరిపోయే అసలు మజా చివరి చరణంలో ఉంది. “దొరలు తాగే ఇప్ప సారాయి తాగుదామే బాలా…”

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రతి లిక్కరూ విస్కీ కాదు – ప్రతి మద్యానికీ ఓ కథ ఉంది
  • గుండు గీకే ప్రోగ్రామ్ వద్దులే అమ్మాయ్… సినిమా సోసో, నువ్వు పాస్…
  • నింగి నుంచి నిశిత పరిశీలన- నిఘా… మన స్పై శాటిలైట్ విశేషాలివిగో…
  • అబ్బా… ఏం రీసెర్చ్‌రా బాబూ! 2026 ఇగ్ నోబెల్ విచిత్రాలు!!
  • ప్రతిపక్ష నేతగానూ పనికిరావ్… కేసీయార్‌‌పై ఇదోరకం అభిశంసన!
  • SLT – మనకు పనికిరాని ఉద్యోగిని ప్రత్యర్థికి అంటగట్టడం !!
  • ఈ ‘స్వతంత్ర హస్తం’ కొత్తదేమీ కాదు… ఎనిమిదేళ్ల క్రితమే ‘సవ్యసాచి’!!
  • రంభ ఊర్వశి మేనక..! కామెడీ అంటే వీళ్లకు మరీ కామెడీ అయిపోయింది!
  • ఇటు రేవంత్ – అటు ఒవైసీ… ఇద్దరివీ తెలివైన ప్రసంగాలు
  • మహిళా జడ్జిలకు కూడా తప్పని లైంగిక వివక్ష – వేధింపులు !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions