.
ఏ ప్రోగ్రాం అయినా సరే ఈటీవీకి తన నీచాభిరుచిని చాటుకోవడం బాగా అలవాటైపోయినట్టుంది… చివరకు పండుగ స్పెషల్స్‌ను కూడా విడిచిపెట్టడం లేదు…
వచ్చే ఆదివారం ఉగాది పండుగ… ఈటీవీ ఎప్పటిలాగే ఓ స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేసింది, ప్రోమోలు కూడా వదిలింది… తమ ఆస్థాన నటులు, కమెడియన్లు ఉంటారు కదా, వాళ్లతో నడిపించింది…
Ads
పనిలోపనిగా నితిన్ నటించిన రాబిన్‌హుడ్ ప్రమోషన్ కూడా చేసుకున్నారు… ఎలాగూ హైపర్ ఆది ఉంటాడు కదా… ఢాకూ మహారాజ్‌లో బాలయ్యకు ఊర్వశి రౌతేలాతో శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన ఆ గుద్దుడు, చరుచుడు వెగటు స్టెప్పుల్ని ఆదితో వేయించారు…
ఈ సందర్భంగా హోస్టుల్లో ఒకడిగా వ్యవహరిస్తున్న ఢీ షో ఫేమ్ నందు ఇది షడ్రుచుల్లో చేదు రుచి అన్నాడు… వెంటనే నితిన్ అందుకుని చేదు కాదు, చెడు రుచి అన్నాడు… ప్రాస కోసం అన్నాడో, కావాలనే అన్నాడో గానీ సరిగ్గా కుదిరింది…
అఫ్‌కోర్స్, తన రాబోయే రాబిన్‌హుడ్ సినిమాలో కేతిక శర్మ ఐటమ్ సాంగుకు అంతే వెగటు స్టెప్పుల్ని అదే శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశాడనీ, జనమంతా ఛీత్కరిస్తున్నారని మరిచిపోయినట్టున్నాడు… బాలయ్య బాబు గారూ, ఇదంతా విన్నారా..? ఓసారి లుక్కేశారా..?
నిజంగా ఒక ప్రశ్న… జనం చీదరించుకునే స్టెప్పుల్ని, మహిళా కమిషన్ హెచ్చరికలు జారీ చేస్తున్న వెకిలి స్టెప్పుల్ని పదే పదే ఇలా… చివరకు పండుగ ప్రోగ్రామ్‌లో కూడా చూపాలా, చేయించాలా..? ఈటీవీ సిగ్గుపడాలి మళ్లీ మళ్లీ…
మంచు మనోజ్, నారా రోహిత్ కూడా పార్టిసిపేట్ చేశారు ఈ షోలో… అరియానా పిచ్చి యాక్షన్ చేస్తుంటే… ఆకు టాటూ చూపిస్తుంటే… నితిన్ ‘ఆకురా’ అని ఓ బూతు ధ్వనించే తిక్క వ్యాఖ్య చేశాడు… మొత్తానికి అక్కడికి వెళ్తే అందరికీ ఆ జబర్దస్త్ బాపతు లక్షణాలు అంటుతాయేమో… మామూలుగా హోస్టుగా కనిపించే ప్రదీప్ ఈ షోకు గెస్టుగా వచ్చాడు… అందుకే రష్మి తనను ఉద్దేశించి ‘పిందె పండయ్యింది’ అని సరదాగా వ్యాఖ్యానించింది… ఇదీ లింకు…
అనగనగా ఈ ఉగాదికి టైటిల్‌తో వచ్చే ఈ ప్రోగ్రాంలో రష్మి కోహోస్ట్ నందుకు… ఏ ప్రోగ్రామైనా సరే… సుడిగాలి సుధీర్ ప్రస్తావన లేకుండా కాలం గడవడం లేదు వీళ్లకు… ఇందులోనూ… ఫాఫం, క్రియేటివ్ టీమ్స్‌లో క్రియేటివిటీ అడుగుంటినప్పుడు ఇలాంటి ఆలోచనలే వస్తాయి…
పండుగపూట ఉదయమే 10 గంటలకు ఈ ప్రోగ్రాం… ఎప్పటిలాగే రోజులో మూడు వేర్వేరు వేళల్లో జీతెలుగు, ఈటీవీ, స్టార్‌మా పండుగ స్పెషల్స్ ప్రసారం అవుతాయని అనుకుంటే… కాదు, ఈటీవీ ఉదయం వేళలో… కానీ స్టార్ మా, జీతెలుగు మాత్రం సాయంత్రం ఆరు గంటలకు పోటీపడబోతున్నయ్ రేటింగ్స్ సాధనలో…
జీతెలుగులో టైటిల్ ఉగాది మాస్ జాతర… ఇక్కడా రాబిన్ హుడ్ ప్రమోషన్… ప్రోమోలో ఐశ్వర్యా రాజేష్, రమ్యకృష్ణ కూడా కనిపిస్తున్నారు… హోస్ట్ రవి… జాగ్రత్తగా గమనించండి… ఈ మూడు పండుగ స్పెషల్స్‌లో ఎందులోనూ శ్రీముఖి హోస్టింగు లేదు… సుమ అస్సలు లేదు…
స్టార్ మా పండుగ స్పెషల్ టైటిల్ మా ఇంటి పండుగ… దీనికి బెట్టింగ్ క్వీన్ విష్ణుప్రియ హోస్ట్… ఏదో కొత్త సినిమా వస్తోంది కదా… విజయశాంతి, నందమూరి కల్యాణరామ్‌ది… ఆ సినిమా ప్రమోషన్‌కు ఈ ప్రోగ్రాం అంకితం చేసినట్టున్నారు… ఈ మూడు స్పెషల్స్‌లోనూ పెద్ద క్రియేటివిటీ లేదు, జస్ట్, సినిమా ప్రమోషన్స్, శ్రీదేవి డ్రామా కంపెనీ బాపతు ఫార్మాట్… ప్చ్…!!
.
చివరగా…. ఈటీవీలో మరో ఉగాది స్పెషల్ ఉందట… అదే సుమ అడ్డా షో… ఏమీ లేదు, గెస్టులకు ఉగాది పచ్చడి ఇచ్చింది ఆమె… అంతే, ఉగాది స్పెషల్ షో అయిపోయింది… కంటెంటు, షో మొత్తం అదే సోది మూస… ఫాఫం, అందుకే ఆ షో ఎవడూ దేకడం లేదు… ఏదో సినిమా ప్రమోషన్లు చేసుకోవడానికి సుమకు అదొక అడ్డా, అంతే…
Share this Article