.
గతంలోలాగా కాదు… ఏ పండుగైనా సరే, ప్రత్యేకించి సిటీల్లో… న్యూక్లియర్ ఫ్యామిలీస్ కదా, చేతనైన స్వీటు ఏదో చేసుకోవడం, లేదంటే జొమాటో లేదా స్విగ్గీ… టీవీల్లో ఏవైనా స్పెషల్స్ వస్తే చూడటం… అదే పండుగ అయిపోతోంది… అవి నచ్చకపోతే ఓటీటీలో ఏదైనా కొత్త మూవీ వేసుకుని, తింటూ చూడటం…
కానీ మనకున్నవే మూడు వినోద చానెళ్లు… (జెమిని లేనట్టే కదా…) పండుగ స్పెషల్స్ చేసేవి ఈ మూడు చానెళ్లే… కమెడియన్లు, టీవీ సీరియళ్ల నటీనటులు, యూట్యూబర్లు, ఒకరిద్దరు గెస్టులు, సినిమా ప్రమోషన్లు, పిచ్చి ఆటల పోటీలు, నాలుగు జోకులు… అంతే కదా… (న్యూస్ చానెళ్ల డిబేట్ల కామెడీ వదిలేస్తే.. కొందరు వాటినీ కామెడీ షోలుగా ఎంజాయ్ చేస్తారు…)
Ads
ఈసారి ఉగాది స్పెషల్స్ బాగా నిరాశపరిచాయి… నితిన్, మనోజ్, విజయశాంతి, కల్యాణరామ్… చివరకు మాచిరాజు ప్రదీప్ కూడా… తమ సినిమాల ప్రమోషన్ల కోసం వచ్చారు… విజయశాంతి, కల్యాణరామ్ విసిగించారు… హోస్ట్- యాంకర్ ప్రదీప్‌ను గెస్టుగా చూడటం ఎందుకోగానీ ఆకట్టుకోలేదు… ఈసారి పెద్ద రిలీఫ్ శ్రీముఖి ఏ షోకూ హోస్ట్ కాదు… ఆ అరుపులు, కేకలు వినబడలేదు… ఆహా…
కాకపోతే ఈసారి యాంకర్ రవికి రెండు షోలలో ఇంపార్టెన్స్… మరీ రమ్యకృష్ణను పదే పదే బతిమిలాడుతూ, కాళ్ల దగ్గర కూర్చుకుంటూ తెగ విసిగించాడు… పూర్ యాంకరింగ్… నిజానికి తను సీనియర్ యాంకర్… ప్రాబ్లం ఏదో తెలియదు గానీ పెద్దగా హోస్టింగ్ అవకాశాలు రావడం లేదు… ఈటీవీకి ఎలాగూ రష్మి ఆస్థాన యాంకరిణియే కదా…
మరో టీవీ చానెల్‌లో బెట్టింగ్ విష్ణుప్రియ కోహోస్ట్… మొత్తం మూడు స్పెషల్స్ పరిశీలిస్తే కొత్తగా బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ యాంకర్‌గా కనిపించాడు, బాగా చేశాడు… కంటిన్యూ చేయడం బెటర్… మరో షోలో సిరి హన్మంతు కోహోస్ట్… పర్లేదు, చాన్స్ ఇస్తే రాణించగలదు… ఎటొచ్చీ అక్కడక్కడా ఇలియానా చిరాకెత్తించింది… తన టోన్ తనకు పెద్ద మైనస్…
ఇక హైపర్ ఆది సరేసరి… రోజురోజుకూ తనను ఈటీవీ నెత్తిన పెట్టుకుని విసిగిస్తోంది… తన పంచులకు జనం ఇంకా నవ్వుతున్నారనే భ్రమల్లో ఉన్నట్టున్నాడు… సరే, ఇవన్నీ వదిలేస్తే కాస్త నచ్చింది సింగర్ సమీరా భరధ్వాజ్… (ఈమధ్య కొన్ని సర్కాస్టిక్ కామెడీ రీల్స్ కూడా భలే టైమింగుతో చేస్తోంది..) ఆమె తల్లి పార్వతి (?) భలే పాడింది ఈ షోలో ఓ ప్రొఫెషనల్ సింగర్ అనుకునేట్టు… సమీరా బిడ్డ కావచ్చు, చిన్న పిల్ల తనూ పాడింది… త్రీ జనరేషన్స్… ముచ్చట గొలిపిన సీన్లు…
త్రినయని సీరియల్ ఫేమ్ చందు గౌడ్ బిడ్డ సమైరాకు అక్షరాభ్యాసం కూడా ముద్దుగా బాగుంది… అఫ్‌కోర్స్ గగన్, భూమిల పెళ్లి ఎపిసోడ్ కూడా బాగుంది… స్థూలంగా మూడు షోలూ రక్తికట్టలేదు, ఇప్పుడు చెప్పుకున్న ఒకటీరెండు ఎపిసోడ్లు మినహా… రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ మాత్రం ఈ షోను భలే ఎంజాయ్ చేసినట్టు కనిపించింది… రవి ఓవరాక్షన్ లేకపోతే ఇంకాస్త బాగుండేదేమో…
మొత్తానికి ఈ ఉగాదిని ఈ మూడు చానెళ్లూ రక్తికట్టించలేదు… ఇంకా నయం, పంచాంగ శ్రవణాలను కూడా కామెడీగా చూపించలేదు… సంతోషం… లేకపోతే ఇంకెంత భ్రష్టుపట్టించేవాళ్లో…! మొత్తానికి అర్థమయ్యింది ఏమిటంటే..? ఈ మూడు చానెళ్ల క్రియేటివ్ టీమ్స్ ఏమీ కొత్తగా ఆలోచించలేకపోతున్నాయి… ఎండిపోయాయి..!!
Share this Article