.
సినిమా జర్నలిస్టులను చూసి నిర్మాతలు అలా తయారవుతున్నారా..? నిర్మాతల పిచ్చి వ్యాఖ్యలకు ప్రభావితులై జర్నలిస్టుల ప్రశ్నలూ అలా తయారవుతున్నాయా..?
మొత్తానికి ఏం తయారయ్యారురా బాబూ అనే డైలాగు గుర్తొస్తోంది… ఆమధ్య పలు ప్రెస్‌మీట్లలో మన జర్నలిస్టులు అడిగిన పిచ్చి ప్రశ్నల గురించి చాలా చెప్పుకుని, మన మీద మనమే జాలిపడ్డాం కదా ఫాఫం…
Ads
అసలే కల్కి కర్ణుడిపై అనంత శ్రీరామ్, పలు సందర్భాల్లో నాగవంశీ, పిచ్చి కూతల శ్రీకాంత్ అయ్యంగార్, నిజామబాద్ సభలో దిల్ రాజు… సగటు ప్రేక్షకులకు సినిమా వాళ్ల పట్ల ఏవగింపును కలగచేస్తున్నారు కదా… తాజాగా మరొకటి…
ఇంకెవరిది..? అదే రీసెంట్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ నాగవంశీదే… ఐతే ఇక్కడ జర్నలిస్టులను చూసి జాలేయడం అదనపు విశేషం అన్నమాట,.. ఎన్టీవీ ప్రసారం చేసిన చిన్న వీడియో బిట్ లింక్ ఇదుగో…
అదే డాకూ మహారాజ్ సినిమా ప్రమోషన్ బాపతు ప్రెస్ మీట్… దబిడి దిబిడి సాంగ్ జస్ట్, బాలయ్య సినిమాల్లోని డైలాగులను అక్కడక్కడా పేర్చి రాయబడిన పాట… కొన్నాళ్లుగా అగ్లీ స్టెప్పుల డాన్స్ మాస్టర్‌గా పేరుపొందుతున్న శేఖర్ మాస్టర్ దీనికి వెగటు స్టెప్పులు కంపోజ్ చేశాడు…
చెప్పుకున్నాం కదా ముందే… ఊర్వశి రౌతాలాతో బాలయ్య వేసిన ఆ స్టెప్పుల తీరు, ఆమె పృష్టభాగం మీద కసికసిగా చరుపులు, అరుపులు… వెగటు… బాలయ్య స్టేటస్ ఏమిటి…? తన ప్రజాజీవితం ఏమిటి..? ఈ వేషాలు ఏమిటనే విమర్శలు బాగా వచ్చాయి… ఎవరో డాన్స్ కంపోజర్ చెబితే తనెందుకు అంగీకరించాడు..?
ఐతే సదరు ప్రెస్‌మీట్‌లో ఇవేవీ అడగలేక, అడగకుండా ఉండలేక, ఎలా అడగాలో తెలియక ‘‘అలా కొట్టడంలో మీ టేస్టేమిటి’’ అని అడిగారు జర్నలిస్టులు… ఫాఫం… ఈమధ్య పాత్రికేయం కూడా సిగ్గుపడుతోంది… అరె, కొట్టింది బాలయ్య, నడుమ నా ఇంట్రస్టేమిటి..? నేను కాదు కదా కొట్టింది అంటాడు నాగవంశీ…
మళ్లీ అదే ప్రశ్న… నిజానికి ఈ నీచాభిరుచి మీదేనా మాస్టారూ అనడగాలి..? అక్కడ మర్యాదు కాదు కాబట్టి నేరుగా అలా అనలేరు, సో, ఆ స్టెప్పుల తీరు మీద విమర్శలొస్తున్నాయి, మీరెలా అంగీకరించారు అలా స్టెప్పులను మీ సినిమాలో అనడిగేస్తే సరిపోయేది…
చివరకు ఆ నాగవంశీకి కూడా చిరాకెత్తి… అబ్బే, ఈ ఇద్దరు హీరోయిన్లు బాలయ్య అలా కొట్టడానికి ఒప్పుకోలేదు, అందుకే ఊర్వశిని తీసుకున్నాం అన్నాడు… అంటే, ఊర్వశికి ముందే బాలయ్య అలా కొడతాడు అని చెప్పి మరీ తీసుకుని కొట్టించారా..? నీచమైన సమర్థన, ఆ స్టెప్పుల్లాగే ఉంది..! మీకూ అలాగే అనిపిస్తోందా..? ‘‘మీరెక్కడ తయారయ్యార్రా బాబూ…’’
Share this Article