Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ ముస్లిం టెర్రరిస్టు సంస్థ ఇండియా సాయం కోరుతోంది… చైనా నుంచి రక్షణకు…

February 21, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి ……… మమ్మల్ని కాపాడండి భారత్ కి విజ్ఞప్తి చేసిన .. వుయఘర్ ముస్లిమ్స్ ! తుర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీ [TIP] డిప్యూటీ కమాండర్ ‘అబ్దు సలాం అత్ తురకిస్తానీ ‘ ఈ ప్రకటన చేశాడు ! చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్ లో ఉన్న వుయ్ఘర్ ప్రాంతంలో ఉన్న ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ‘తుర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీ ‘ చైనా నుండి మమ్మల్ని విడిపించమంటూ భారత్ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసింది !

చైనా మమ్మల్ని అణిచివేస్తున్నది ! మా చేత బలవంతంగా మా మత పరమయిన విశ్వాసాలని కించపరుస్తూ మమ్మలని నాస్తికులుగా మారమని బలవంతం చేస్తున్నది. చైనాని ధీటుగా ఎదుర్కోగల దేశం భారత్ మాత్రమే కాబట్టి మీరు జింజియాంగ్ మీద దాడి చేసి మమ్మల్ని విడిపించండి మరియు మీరు కనుక చైనా మీద దాడిచేస్తే వుయఘర్‌లో ఉన్న మొత్తం ముస్లిం సమాజం భారత సైన్యానికి సహకరిస్తుంది ! తుర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీని ఉగ్రవాద సంస్థగా చైనా ప్రకటించింది ! తుర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీ అనేది చైనాకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నమిలిటెంట్ సంస్థ !

*********************

Ads

బ్రిటన్ కేంద్రంగా ఉన్న ఇస్లామిక్ థియాలజీ కౌంటర్ టెర్రరిజం [Islamic Theology of Counter-Terrorism-ITCT ] కి చెందిన TIP నాయకుడు అబ్దు సలాం అత్ తుర్కిస్తానీ మాట్లాడుతూ ‘‘చైనా తన భూభాగాన్ని భారత్ లోకి విస్తరించాలనే యోచనలో ఉంది. వుయఘర్ ప్రాంతం జింజియాంగ్ ప్రావిన్స్ లో ఉంది మరియు ఈ ప్రావిన్స్ కి భారత్ లోని లడాక్ తో సరిహద్దులు కలిగి ఉంది. ఇదే మంచి సమయం భారత్ జింజియాంగ్ మీద దాడి చేయడానికి… భారత్ కనుక జింజియాంగ్ మీద దాడి చేస్తే కోటి మందికి పైగా ఉన్న వుయఘర్ ముస్లిం సమాజం భారత్ సైన్యానికి సహాయ సహకారాలని అందిస్తారు. ఆయుధాలు ఇస్తే భారత సైన్యంతో కలిసి చైనా మీద యుద్ధం కూడా చేస్తారు. భారత్ కనుక మాకు సహాయం చేస్తే తిరిగి మేము భారత్ కి సహాయం చేస్తాం !’’ అని ప్రకటించాడు…

*******************

ITCT నివేదిక ప్రకారం TIP మిలిటెంట్లు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా దేశాలలో ఉన్నారు. చాలా కాలంగా అంటే మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత TIP భారత్ కి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నది: వుయఘర్ ముస్లిమ్స్ కి భారత్ లో ఆశ్రయం ఇవ్వమంటూ పలుసార్లు విజ్ఞప్తి చేసింది. టిబెటన్ ప్రజలకి భారత్ ఆశ్రయం ఇచ్చినట్లుగా మాకు కూడా ఆశ్రయం ఇస్తే మేము చైనాకి వ్యతిరేకంగా పోరాడతాము! భారత్ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనబోమని హామీ ఇస్తాము అని…

*******************

అయితే TIP కి అల్ ఖైదాతోపాటు ISIS తో దగ్గర సంబంధాలున్నాయి. TIP మాత్రం మేము చైనాకి వ్యతిరేకంగా పోరాడడానికి మాత్రమే ఒక గ్రూపుగా ఏర్పడ్డాము తప్పితే మిగతా సంస్థలలాగా ఇతర ఆశలు, ఆశయాలు ఏమీ లేవు. వుయఘర్‌ను మేము ప్రత్యేక దేశంగా ఉండాలని కోరుకుంటున్నాము తప్పితే ఇతర ఉద్దేశాలు ఏమీ లేవని ఆ TIP నాయకుడు భారత దేశానికి చేసిన అభ్యర్ధనలో అన్నాడు. అల్ ఖైదా నుండి మద్దతు తీసుకుంటున్నది కేవలం చైనాకి వ్యతిరేకంగా పోరాడడానికి మాత్రమే ! అలా అని అల్ ఖైదాతో కానీ ISIS తో కానీ మాకు ఎలాంటి దగ్గరి సంబంధాలు లేవు.

*******************

1989 లో ఇదే TIP చైనాతో పాటు మధ్య ఆసియా దేశాలలో బాంబు దాడులకి పాల్పడింది ! TIP కి ఆఫ్ఘన్ తాలిబాన్ తో పాటు అల్ ఖైదాతో సంబంధాలు ఉన్నాయి… కానీ TIP మాత్రం ఆఫ్ఘన్ తాలిబాన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఒప్పుకుంటున్నది కానీ అల్ ఖైదాతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్తున్నది.

*****************

2008 లో జరిగిన బీజింగ్ ఒలంపిక్స్ మీద దాడులు చేస్తామని హెచ్చరికలు చేసింది TIP. అలాగే అమెరికాలోని గ్వాంటనామా బే [Gauntanamo Bay Naval Base ] నావల్ బేస్ లోకి చొరబడ్డ TIP సభ్యులని అమెరికన్ నావీ అరెస్ట్ చేసింది.

*************

అసలు ఈ సంస్థ చరిత్ర ఏమిటి..? 

తుర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీ – TIP అనేది గతంలో చాలాసార్లు తన పేరు మార్చుకుంది సమయానుకూలంగా… అవి : ఈస్ట్ తుర్కిస్థాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ [East Turkistan Islamic Movement ], ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఈస్ట్ తుర్కిస్తాన్ [Islamic Movement of East Turkistan ], ఇస్లామిక్ పార్టీ ఆఫ్ ఈస్ట్ తుర్కిస్తాన్ [Islamic Party of East Turkistan ] ఇలా చాలాసార్లు పేర్లు మార్చుకొని, ఇప్పుడు తుర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీ TIP గా స్థిరంగా ఉంది.

ఇన్ని పేర్లు మార్చుకోవడానికి కారణం ఉంది, అది అమెరికా పైన పేర్కొన్న సంస్థలని ప్రమాదకర ఉగ్రవాద సంస్థలుగా గుర్తించడం… 2020 లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ TIP ని ఉగ్రవాద సంస్థల లిస్ట్ నుండి తొలగించాడు… ఎందుకంటే చైనా వుయఘర్ ముస్లిమ్స్ పట్ల అణిచివేత ధోరణిని ప్రదర్శిస్తున్నది అనే కారణం వలన… దీని మీద చైనా అభ్యంతరం చెప్పింది కానీ ట్రంప్ లెక్క చేయలేదు. బహుశా ఈ కారణం చేతనే చైనా ట్రంప్ కి వ్యతిరేకంగా ఎన్నికలలో నిధులు ఖర్చుపెట్టింది. ఒకవేళ కనుక ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నిక అయి ఉంటే మాత్రం సిఐఏ ద్వారా ఆయుధాలు, నిధులు ఇప్పించి చైనాని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసి ఉండేవాడని ఒక అంచనా!

************************

TIP ఉన్నట్లుండి ఇలా భారత ప్రధానిని సహాయం అడగడం [నిన్నటి రోజున ] అనేది విస్మయం కలిగించింది ! మోడీ ఒకవైపు తాలిబాన్ ప్రభుత్వానికి సహాయం చేయడం, అలాగే తాలిబన్లతో TIP కి దగ్గరి సంబంధం ఉండడం ఒక కారణం కాగా 10 రోజుల కింద టర్కీ భూకంపం బాధితుల కోసం ఏకంగా 40 మంది సభ్యుల కల NDRF బృందాన్ని వేగంగా టర్కీకి పంపించడం మరో కారణం అయిఉండవచ్చు.

వుయఘర్ ముస్లిమ్స్ నిజానికి టర్కీలోని తూర్పు ప్రాంతం నుండి వలస వచ్చి జింజియాంగ్ ప్రావిన్స్ లోని స్థిరపడ్డవాళ్ళు. చైనాని ధీటుగా ఎదుర్కుంటున్న ఒకే ఒక ప్రధాని మోడీ కావడం వలన ఇలా సహాయం అడిగి ఉండవచ్చు !

****************************

వారం క్రితం NSA అజిత్ దోవల్ అమెరికా, బ్రిటన్ పర్యటన చేసి రావడం వెనుక కారణం ఏమిటి ?

అంతర్జాతీయ మీడియాలో మాత్రం ఖలిస్తాన్ ఉద్యమం వెనక ఉండి నడిపిస్తున్న సంస్థలు అమెరికా, బ్రిటన్ లో ఉండడం, వాటిమీద చర్యలు తీసుకోవాలి అని గట్టిగా చెప్పడానికి వెళ్లారు అని… కానీ నిన్నటి TIP అభ్యర్ధన చేసిన సమయాన్ని కనుక పరిగణనలోకి తీసుకుంటే ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని, అమెరికా, బ్రిటన్ దేశాలని కేంద్రాలుగా చేసుకొని నిధులు అందిస్తున్న వాళ్ళని కట్టడి చేయాలని కోరడానికి… అయినా పనిలో పనిగా TIP విషయం కూడా ప్రస్తావించి ఉండవచ్చు !

ఎందుకంటే రెండు దశాబ్దాలుగా చైనా పాకిస్థాన్ లోని ఉగ్ర గ్రూపులకి వత్తాసుగా ఉంటున్నది. అమెరికా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాక్ ఉగ్ర గ్రూపుల మీద అంతర్జాతీయంగా నిషేదం విధించాలని ప్రవేశపెట్టిన అన్ని తీర్మానాలని చైనా తన వీటో హక్కుతో వాటిని అడ్డుకుంటూ వచ్చింది.

ఇప్పుడు చైనా వంతు వచ్చింది TIP విషయంలో ! ఈ అవకాశాన్ని భారత్ ఎలా వదులుకుంటుంది?

ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలిసిపోతున్నది! అది భారత దేశంలో మోడీ ముస్లిమ్స్ కి వ్యతిరేకి అన్న ముద్ర అంతర్జాతీయ వేదికల మీద ఎప్పుడూ విషం కక్కే కొందరికి… ఇప్పుడు తాలిబన్లకు కావొచ్చు, టర్కీకి పంపిన సహాయం వల్ల కావొచ్చు, అది తప్పని ఋజువు చేసినట్లయింది. పైగా TIP అభ్యర్ధన ఈ విషయాన్ని మరింత బలపరుస్తున్నది. బహుశా తాలిబన్లు సలహా ఇచ్చి ఉండవచ్చు TIP కి మోడీ సహాయం కోసం అడగమని!

TIP అభ్యర్ధన మాత్రం అటు అమెరికా, ఇటు బ్రిటన్ లకి కూడా తెలుసు, కాబట్టి చైనాకి వ్యతిరేకంగా పనిచేస్తున్న TIP విషయంలో చూసి చూడనట్లుగా తటస్థంగా ఉండే అవకాశం ఉంది! చూద్దాం TIP విషయంలో భారత్ ఎలా స్పందిస్తుందో !

గతంలో మిజోరం విషయంలో అక్కడి మిజో ఉగ్రవాదులకి చైనా సహకరించింది ! ఒక దశలో మోజోరం మన దేశం నుండి విడిపోతుంది అనేదాకా తీసుకొచ్చింది చైనా ! ఇందిర ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నెలలోపే మిజోరం రాష్ట్రంలోని చాలా భాగం అక్కడి మిజో నేషనలిస్ట్ ఉగ్ర సంస్థ అధీనంలోకి వెళ్ళి పోయింది. మన రక్షణ దళాలు మధ్యలో ఉండి పోయి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, మందులు, ఆహారం సప్లై చేయలేని స్థితి వచ్చింది !

చివరికి మన ఎయిర్ ఫోర్స్ మిజోరం మీద బాంబుల వర్షం కురిపించిన తరువాతే మళ్ళీ మన సైన్యానికి పట్టు దొరికింది అక్కడ. ఇదంతా 1971 లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం తరువాత ఇందిర మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన నెల లోపే జరిగింది! ఇప్పుడు అదే చైనా మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు ఎలా వదులుకుంటాము ? పైగా TIP తనంత తానుగా అడుగుతున్నది బహిరంగంగా ! చైనా మనకి ఇచ్చిన అప్పుని తిరిగి చెల్లించాల్సిన సమయం వచ్చింది కదా ?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions