.
Pardha Saradhi Potluri …… సిరియా ని మాకు వదిలేయ్.. ఉక్రెయిన్ ని నీకు వదిలేస్తాం.. డీప్ స్టేట్ పుతిన్ తో చేసుకున్న ఒప్పందం ఇది!
ఈ ఒప్పందం ప్రకారం పుతిన్ సిరియా నుండి తన కీలక సైన్యాన్ని ఉన్నట్లుండి వెనక్కి పిలిపించాడు! అంతకు ముందే అప్పటి సిరియా అధ్యక్షుడు అస్సాద్ కి ఫోన్ చేసి మాస్కో వచ్చేయమని సలహా ఇచ్చాడు! బహుశా ఒప్పందానికి సరే అంటే అస్సాద్ కి సేఫ్ పాసేజ్ ఇస్తామని హామీ ఇచ్చి ఉండవచ్చు డీప్ డీప్ స్టేట్!
ఈ ఒప్పందం జరిగే సమయానికి బిడెన్ ఇంకా అధికారంలోనే ఉన్నాడు! ట్రంప్ ద్వారా పుతిన్ కి సమాచారం వెళ్ళింది!
Ads
ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ జనవరి 18 న జో బిడెన్ పత్రికా ముఖంగానే ట్రంప్ ని విమర్శిస్తూ అమెరికా రేపటి నుండి (జనవరి 20 నుండి ) రష్యన్ ఓలిగార్చ్ ల చేతిలోకి వెళ్ళిపోబోతున్నది అంటూ అసలు విషయం కుండ బద్దలు కొట్టేశాడు!
పశ్చిమ దేశాల మీడియా రష్యన్ పారిశ్రామికవేత్తలని ఓలిగార్చ్ ( Oligarch )లని పిలుస్తుంది కానీ ఓలిగార్చ్ అనే పదం రోమన్ భాష నుండి పుట్టింది కాబట్టి ఒరిజనల్ గా అది పశ్చిమ దేశాలకి చెందినదే! సోవియట్ యూనియన్ 1991 లో విచ్చిన్నం అయినప్పుడు రష్యన్ పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ, ప్రయివేట్ పారిశ్రామిక, వ్యాపార సంస్థలని భారీ మొత్తంలో కొనేసి మోనోపలి సాధించారు!
ఇలాంటి వాళ్ళని దయాదాక్షిణ్యం లేని ఓలిగార్చ్ లని విమర్శించడం మొదలుపెట్టాయి పశ్చిమ దేశాల మీడియా! మరి లాక్ హీడ్ మార్టిన్, బోయింగ్ లాంటి సంస్థల యజమానులు పారిశ్రామిక వేత్తలు ఎలా అవుతారు? డీప్ స్టేట్ లో అతిపెద్ద భాగస్వామి Lockheed Martin కాదా? అమెరికన్ ఫార్మా ఓలిగార్చ్ కాదా? జో బిడెన్ కొడుకు హంటర్ బిడెన్ ఉక్రెయిన్ లో ఆయిల్, సహజ వాయువు నిక్షేపాల వ్యాపార భాగస్వామి కాదా? హంటర్ బిడెన్ కూడా ఓలిగార్చ్ కేటగిరిలోకే వస్తాడు!
జో బిడెన్ కి తెలుసు డీప్ స్టేట్ కి పుతిన్ కి మధ్య వారధిలా ట్రంప్ వ్యవహరిస్తున్నాడు అనీ, సిరియా నుండి పుతిన్ ఎలాంటి వ్యాఖ్య చేయకుండా నిశ్శబ్దంగా వెనక్కి వెళుతున్నాడు అంటే ఉక్రెయిన్ ని పుతిన్ కి అప్పచెప్పే విధంగా ఒప్పందం జరిగిందని! అందుకే అమెరికా రష్యన్ ఓలిగార్చ్ ల చేతిలోకి వెళ్ళిపోతుందని అన్నాడు!
సరిగ్గా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి రెండు రోజుల ముందు సిరియా తీరంలో ఉన్న చివరి రష్యన్ యుద్ధ నౌక ఖాళీ చేసి తాపీగా వెళ్ళిపోయింది!
సిరియా లో పెద్దగా హింస లేకుండానే అధికార మార్పిడి ఎలా సాధ్యం అయింది?
So! పుతిన్ సిరియాని అమెరికాకి అప్పచెప్పాడు, బదులుగా అమెరికా ఉక్రెయిన్ ని నాటోలో చేర్చుకోబోము అని ప్రకటించి సహాయం ఆపేసింది!
ఉక్రెయిన్ ని నాటోలో చేర్చుకుంటామని హామీ ఇచ్చి రష్యాని రెచ్చగొట్టిందే మొదట్లో అమెరికా! మిగతా నాటో దేశాలు వంత పాడాయి! చివరికి ఉక్రెయిన్, రష్యాలు రెండూ ఆర్ధికంగా, జనాభా పరంగా నాశనం అయ్యాయి!
******************
ట్రంప్ జనవరి 20 న ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వెంటనే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోతుందని భావించారు కానీ నిన్న కూడా ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో రష్యా మీద విరుచుకుపడింది!
ట్రంప్ మొదట జెలెన్స్కీ ని పుతిన్ తో సంధి చేసుకోమని బహిరంగ ప్రకటనలో కోరాడు! జెలన్స్కీ సంధికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు! కానీ ఉక్రెయిన్ రక్షణకి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు!
జెలెన్స్కీ డిమాండ్ చేయడం సబబు!
బుడాపేస్ట్ ఒప్పందం – Memorandum of Budapest!
1991లో USSR ( Union of Socialist Soviet Republic ) విచ్చిన్నం అయిపోయి సోవియట్ రిపబ్లిక్స్ స్వాతంత్య్రం ప్రకటించుకున్న వేళ ఉక్రెయిన్ లో ఉన్న సోవియట్ రక్షణరంగ పరిశ్రమలు ఏమి చేయాలి..? ఈ ప్రశ్న ఉత్పనమైనప్పుడు రక్షణరంగ పరిశ్రమలు ఉక్రెయిన్ కే వదిలేసి, ఉక్రెయిన్ లో ఉన్న అణు ఆయుధాలని రష్యాకి ఇచ్చేట్లు డిసెంబర్ 5, 1994 న హంగరీ దేశ రాజధాని బుడాపేస్ట్ లో బేలారస్, కజఖస్తాన్, ఉక్రెయిన్ లు అణు ఆయుధ తయారీ, నిల్వ ఉంచుకోకుండా NPT ( Non – Proliferation Treaty ) మీద సంతకాలు చేసాయి! బదులుగా భవిష్యత్ లో రష్యా తమని ఆక్రమించుకోకుండా రక్షణ కల్పిస్తామని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు హామీ ఇచ్చాయి!
అప్పటి రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు క్రావ్ చుక్ ఈ ఒప్పందం మీద సంతకాలు చేశారు!
మెమోరాండం అఫ్ బుడాపెస్ట్ ప్రకారం 2014 లో రష్యా క్రిమియాని స్వాధీనం చేసుకున్నప్పుడు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు కలుగచేసుకోలేదు, ఎందుకంటే క్రిమియాలో ప్లేబిసైట్ లో మెజారిటీ ఓటర్లు తాము రష్యాలో కలుస్తాము అని ఓటు వేశారు!
ఇప్పుడు రష్యాతో శాంతి ఒప్పందం చేసుకోవాలి అంటే ఉక్రెయిన్ రక్షణకి జెలెన్స్కీ అడగడంలో తప్పులేదు! లేకపోతె 1994 బుడాపెస్ట్ ఒప్పందానికి విలువ ఎక్కడ ఉంటుంది?
గత నెలలో యూరోపియన్ యూనియన్ నాయకులతో జెలెన్స్కీ సమావేశం అయ్యి ట్రంప్ ప్రతిపాదన మీద చర్చలు జరిపారు! జెలెన్స్కీ మెమోరాండం అఫ్ బుడాపెస్ట్ విషయం లేవనేత్తాడు! సహజంగానే బ్రిటన్ ప్రధాని బామర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తమకి బాధ్యత ఉంది కాబట్టి జెలెన్స్కీ కి మద్దతు పలికారు!
Share this Article