Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ పిల్లాడి మాటలతో అవ్యక్తమైన ఆనందంతో రతన్ టాటా కళ్లు చెమర్చాయి… 

October 10, 2024 by M S R

“అసలైన ఆనందం” – రతన్ టాటా
————————————-

‘నేను జీవితంలో ఎన్నో దశలను దాటి ఇక్కడి వరకు వచ్చాను. నేను చేసిన ఎన్నో పనులు నాకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదు, కానీ అనుకోకుండా చేసిన ఒక పని మాత్రం నాలో జీవితానికి సరిపడా ఆనందాన్ని ఇచ్చింది.’ అని చెప్పుకొచ్చారు రతన్ టాటా ఒకసారి…

ఆయన చెప్పిన ప్రకారం… ఒకసారి ఆయన మిత్రుడొకరు వచ్చి కొంతమంది వికలాంగ పిల్లలకు వీల్ ఛైర్స్ కొనివ్వమని అడిగారు. రతన్ టాటా 200 వీల్ ఛైర్స్ కొని స్నేహితుడి కోరిక నెరవేర్చారు. ఆ స్నేహితుడు వాటిని పంపిణీ చేసేందుకు రతన్ టాటాను కూడా రమ్మన్నారు. పిల్లలకు తన చేతులతోనే ఆ కుర్చీలను అందించారు.

Ads

ఆ కుర్చీలు అందుకున్న పిల్లలు ఎంతో ఆనందపడ్డారు. వాటితో ఇటూ అటూ తిరుగుతూ అప్పుడే రెక్కలొచ్చిన పక్షుల్లా తిరిగారు. పిల్లలంతా వాటిపైనే రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు. ఎవరు గెలిచారో వారికి వచ్చిన బహుమతిని ఆ పిల్లలంతా పంచుకున్నారు. ఆ పిల్లలను చూసి రతన్ టాటా ఎంతో ఆనందపడ్డారు.

అక్కడున్న పిల్లల్లో ఒక పిల్లవాడు రతన్ టాటా కాలు పట్టుకున్నాడు. రతన్ టాటా అతడిని చూడగానే… ఆ పిల్లవాడు అతడిని చూస్తూ అలాగే ఉండిపోయాడు. అప్పుడు రతన్ టాటా ‘ఎందుకలా చూస్తున్నావ్, నీకు ఇంకేమైనా కావాలా’ అని అడిగారు. దానికి ఆ పిల్లవాడు ‘మిమ్మల్ని కాసేపు ఇలాగే చూడనీయండి. మీ ముఖం నాకు బాగా గుర్తుండాలి కదా, మిమ్మల్ని ఎప్పుడైనా స్వర్గంలో చూస్తే నేను మిమ్మల్ని గుర్తుపట్టాలి కదా, అప్పుడు నేను ఈ వీల్ ఛైర్ ఇచ్చినందుకు మళ్లీ ధన్యవాదాలు చెబుతాను’ అన్నాడు.

పిల్లవాడి మాటలు విన్న రతన్ టాటా ఆశ్చర్యపోయారు. అసలైన ఆనందం అంటే అప్పుడే అతనికి అర్థమైంది. జీవితంలో ఎన్నో సాధించినా కూడా రాని సంతోషం ఆ పిల్లలకు చేసిన సాయంలో తెలిసింది. తన కళ్లు చెమర్చాయి… రతన్ టాటా కోట్లకు కోట్లు డబ్బు సంపాదించినప్పుడు, భారత కుబేరుడిగా ఎదిగినప్పుడు, ఆసియాలోనే అతి పెద్ద ప్రాజెక్టులను దక్కించుకున్నప్పుడు ఆయనకు సంతోషం దక్కలేదు. కానీ దివ్యాంగ పిల్లలకు చేసిన సాయంలో ఆయనకు అసలైన ఆనందం దక్కింది….

(ఈ స్టోరీ చాన్నాళ్లుగా ఇంటర్ నెట్‌లో తిరుగుతూనే ఉంది… నిజమెంతో అబద్ధమెంతో తెలియదు… కానీ రతన్ టాటా తాలూకు అనేకానేక వార్తల్లో ఇది విశేషంగా అనిపిస్తుంది అప్పుడప్పుడూ…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హిందూ సంప్రదాయం ప్రకారం దత్తత అంత పెద్ద నేరమా..?!
  • మస్క్ ఓటమి- సోరోస్ గెలుపు… ఇండియాపై మిడ్ టరమ్ ప్రభావమెంత..?
  • New Alchemy – పరుసవేది – నిజంగానే పాదరసం బంగారం అవుతుందా?!
  • మనిషిని వెతుక్కుంటూ వెళ్లిన కుక్క… మనసును తాకే రెండు కథలు!
  • ‘Congestion Tax’…! A New Lesson for Hyderabad from New York..!!
  • ‘రద్దీ పన్ను’…! హైదరాబాద్‌కు న్యూయార్క్ చెప్పే ఓ కొత్త పాఠం !!
  • ఆన్‌లైన్‌లో ఏదో కొరియర్ ఆర్డర్ ఇచ్చి… దావూద్ ‘డ్రగ్స్ హ్యాండ్’ దొరికాడు…
  • పాకిస్థాన్ శునకానందం ! ఇండియాను గెలిచేసినట్టు ఓ ఫేక్ సంబురం !!
  • Ten Heads, Ten Minds: A Masterstroke or a Cinematic Mess?
  • పది తలలకు పది వేర్వేరు వ్యక్తిత్వాలట… పదింతల వెర్రితనం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions