Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కశ్మీర్‌లో యూఎన్ ధర్మసత్రం షట్‌డౌన్… శెభాష్ జైశంకర్… ఇదీ టెంపర్‌మెంట్..!!

May 20, 2025 by M S R

.

పార్ధసారధి పోట్లూరి …. 74 సంవత్సరాల చెదలు పట్టిన చెట్టుని ఆసాంతం నరికేసిన మోడీ & జై శంకర్ !

యునైటెడ్ నేషన్స్ మిలటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్థాన్ (United Nations Military Observer Group in India and Pakistan) అనేది ఐక్యరాజ్యసమితికి సంబంధించిన పరిశీలక బృందం… ఈ బృందం ముఖ్య ఉద్దేశ్యం భారత పాకిస్థాన్ మధ్య సైనిక ఘర్షణ మీద నిత్యం నివేదకలు ఇవ్వడం!

Ads

948 లో నెహ్రూ కాశ్మీర్ సమస్యని ఐక్యరాజ్య సమితికి అప్పచెప్పడం వలన UN దీన్ని ఏర్పాటు చేసింది. 1948 నుండి ఈ బృందానికి ఒక ఆఫీసు ఏర్పాటు చేసి, వాళ్ళకి జీత భత్యాలతో సకల సదుపాయాలు ఏర్పాటు చేసి, కాశ్మీర్ మీద నిత్యం అబద్ధాలని ప్రపంచానికి తెలియచేయడానికి అన్నమాట !

రెండేళ్ల క్రితం ఈ పరిశీలక బృందం జమ్మూ కాశ్మీర్ సమస్య అనేది భారత పాకిస్థాన్ మధ్య ఉన్నదే కాకుండా చైనాకి కూడా ఈ సమస్యలో భాగం ఉన్నది అంటూ ఒక నివేదిక ఇచ్చింది UN కి …! అంతే కాకుండా తమ కార్యకలాపాలకి భారత్ తో పాటు చైనా కూడా అడ్డంకులు కల్పిస్తున్నది అంటూ ఫిర్యాదు చేసింది.

అంతేకాదు, మాకు ఇప్పటివరకు ఇస్తున్న జీత భత్యాలు ఏమాత్రం సరిపోవడం లేదనీ, తమకి ఇస్తున్న ఆర్ధిక పరమయిన సహాయాన్ని ఇంకా పెంచాలని కోరుతూ భారత ప్రభుత్వానికి మరియు ఐక్యరాజ్య సమితికి ఒక మెమోరాండం ఇచ్చింది. ఇది ఎలా ఉన్నది అంటే అన్నం పెట్టే యజమాని మీద కుక్క మొరగడంలాగా అన్నమాట !

*************************************************************************

ఎప్పుడయితే మాకు ఇస్తున్న జీత భత్యాలు సరిపోవడం లేదని, వాటిని బాగా పెంచాలని అడిగారో… వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా United Nations Military Observer Group in India and Pakistan పరిశీలక బృందంలో పనిచేస్తున్న 40 మంది వీసాలు రద్దు చేసి, 10 రోజుల లోపు దేశం విడిచి వెళ్లిపొమ్మని ఆదేశాలు ఇచ్చింది భారత విదేశాంగ శాఖ ! ‘’ తిక్క కుదిరింది రోకలిని మెడకి చుట్టారు ‘’ ‘’action speaks louder than words’’

*******************************************************************

ఈ పరిశీలక బృందానికి జీత భత్యాలు ఐక్యరాజ్యసమితి బడ్జెట్ నుండి వస్తాయి ! మరి భారత్ ఎందుకు అదనంగా ఈ 40 మంది బృందానికి జీతాలు ఇస్తున్నది అన్నదే ప్రశ్న ! నిజానికి ఈ పరిశీలక బృందానికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ రెండు చోట్ల ఉన్నాయి. ఒకటి శ్రీనగర్ లోని గుప్కార్ రోడ్ లో ఉన్న ఆఫీసు [May to October ] రెండవది ఇస్లామాబాద్ లో [November to April ]. ఈ రెండు చోట్ల కార్యాలయాలు భారత్ పాకిస్థాన్ దేశాలు నిర్మించినవే.

ఆమధ్య శ్రీనగర్ లో ఉన్న UN పరిశీలక బృందం ఆఫీసు మునిసిపల్ నిబంధనలని అతిక్రమించి కట్టారని నోటీసులు ఇచ్చింది అక్కడి మునిసిపాలిటీ ! అంటే ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టారు ! ఇక 40 మంది బృందానికి విలాసవంతమయిన ఇళ్ళు, వాహనాలు, ఇళ్ళలో పని వాళ్ళు… ఇలా చాలా సదుపాయాలు భారత ప్రభుత్వమే భరిస్తున్నది గత 74 ఏళ్లు గా… !

ఇవి కాక ఇతర అలవెన్సుల పేరుతో భారీగా ఖర్చు అవుతున్నది. వీళ్ళకి వ్యక్తిగత వాహనాలతో పాటు సరిహద్దుల దగ్గరికి వెళ్ళి రావడానికి మిలటరీ వాహనాలని సమకూర్చాల్సి ఉంటుంది… అలాగే వీటికి అయ్యే డీజిల్ ఇతర నిర్వహణ ఖర్చులు కూడా భారీగానే ఉంటున్నాయి. వీటినే ఇప్పుడు ఇస్తున్న వాటి కంటే ఇంకా పెంచమని డిమాండ్ చేస్తున్నారు !

*****************************************************************************

ఇంతకీ ఈ పేరు మోసిన UN పరిశీలక బృందం చేసిన పని ఏమిటీ ?

జస్ట్, భారత్ పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి ఏం జరుగుతుందో ఐక్యరాజ్య భద్రతా సమితిని నివేదిక ఇస్తూ ఉంటుంది ! అని బయటి ప్రపంచానికి తెలిసేది ! కానీ వీళ్ళు ఎప్పటికప్పుడు అమెరికాకి వేరే నివేదిక ఇస్తూ వస్తున్నారు గత 74 ఏళ్లుగా ! అమెరికాకి భారత్ వైపు సరిహద్దుల వెంట ఏమి జరుగుతున్నదో వివరాలు కావాలి, తమ గూఢచార ఉపగ్రహాలు ఇచ్చే సమాచారానికి అదనంగా UN పరిశీలక బృందం ఇచ్చే రిపోర్ట్ కూడా కావాలి !

74 ఏళ్ల నుండి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎలాంటి చర్య తీసుకోకుండా చోద్యం చూస్తూ ఇలాంటి పరిశీలక బృందాలని మన దేశంలో ఎందుకు ఉంచినట్లు ? భారత ప్రభుత్వాలు మాకు మీ పరిశీలక బృందాలు అక్కరలేదు వెంటనే తీసేయండి అని చెప్పలేకపోయాయి !

1971 బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా భారత సైన్యం కదలికలని అమెరికాకి చేరవేసింది ఈ UN పరిశీలక బృందమే ! అప్పట్లో ఇప్పుడున్నటువంటి హై రిజల్యూషన్ ఫోటోలు తీసే ఉపగ్రహాలు లేవు అమెరికా దగ్గర, కాబట్టి UN పరిశీలక బృందం ఇచ్చిన సమాచారమే కీలక పాత్ర పోషించింది. అమెరికా తన 7 th Fleet నావికా దళాన్ని పాకిస్థాన్ కి సహాయంగా పంపడానికి చేసిన ప్రయత్నం, దానిని అప్పటి సోవియట్ విఫల చేయడం చరిత్ర !

******************************************************

PoK లో కొద్ది భాగాన్ని పాకిస్థాన్ చైనాకి దానం చేసిన సంగతి తెలిసిందే ! కానీ ఇందులో చైనాని కలపడం దేనికి ? భారత్ PoK ని స్వాధీనం చేసుకుంటే అప్పుడు పాకిస్థాన్ చైనాకి దానం చేసిన భూమి కూడా మన అధీనంలోకి వచ్చినట్లే టెక్నికల్ గా. అప్పుడు చైనా ఎలా ప్రతిస్పందిస్తుందో దానిని బట్టి భారత్ ప్రతిస్పందన ఉంటుంది… అంతే కానీ సమస్య భారత్ పాకిస్థాన్ ల మధ్య అయితే చైనాని పార్టీగా చేయడంలో UN పరిశీలక బృందం వ్యూహం ఏమిటో అర్ధమతోంది కదా… వీళ్ళ ఉద్దేశ్యం కాశ్మీర్ అంశాన్ని మరింత జటిలం చేయాలి. దానికి గాను చైనాని కూడా ఇంకో పార్టీగా చేరిస్తే సరి !

*************************************************************

మొన్నటి ఎన్నికలకు ముందు UN పరిశీలక బృందం మరో చిచ్చు పెట్టే ప్రయత్నంలో ఉన్నది అని పసిగట్టిన మోడీ, జై శంకర్ వెంటనే వీళ్ళని దేశం వదిలి వెళ్లిపొమ్మని ఆదేశించింది ! ఇరాన్- ఇరాక్, ఇజ్రాయెల్ – పాలస్తీనా , టర్కీ –సైప్రస్ , దక్షిణ కొరియా –ఉత్తర కొరియా , చైనా – సరిహద్దు 7 దేశాలు , వాటితో ఉన్న సమస్యల విషయంలో ఇలాంటి పరిశీలక బృందాలు ఏర్పాటు చేయలేదు ఇంతవరకు… కానీ ఒక్క కాశ్మీర్ విషయంలోనే ఎందుకు ?

***********************************************************

74 ఏళ్ల క్రితం నెహ్రూ నాటిన విషపు మొక్క అది… పెరిగి పెద్దది అయిపోయి మహా వృక్షంగా మారి చెదలు పట్టి ఆ చెదలు పక్కన ఉన్న మంచి చెట్లకి పాకి వాటి నాశనానకి కారణం అవుతూ వస్తున్నా… ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ధైర్యంగా ఆ చెట్టుని సమూలంగా నరికివేయడానికి ముందుకు రాలేదు. ఈ బృందాన్ని వెనక్కి వెళ్లిపొమ్మని వాళ్ళ వీసాలు రద్దు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం ధైర్యంతో తీసుకున్న చర్యే…

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘ఉచిత ప్రలోభాల’ పార్టీలు చదవాల్సిన ‘కర్నాటక సర్వే’ ఫలితాల కథ..!!
  • AI … కొలువులే కాదు, ప్రాణాలూ తీస్తోంది… బహుపరాక్‌‌…
  • ఛాలెంజ్..! ‘మెదడుకు మేత’ నవలను సినిమాకరించడం ఛాలెంజే..!!
  • కూలిపోతున్న మినీ బంగ్లాదేశ్… కానీ ఇలాంటివి దేశంలో కోకొల్లలు..!!
  • నో పవర్, నో నెట్, నో ఫోన్, నో టీవీ… 17 ఏళ్ల ఏకాంతంలో… ఓ వన్యప్రాణిలా…!!
  • ఎస్.., ఓ అవకాశం ఇవ్వాల్సిందే..! ధిక్కార తూటా శాంతిమంత్రం..!!
  • చార్‌ ధామ్ కాదు… ఇది పంచ కేదార్..! వెరీ ఇంట్రస్టింగ్ కారిడార్..!
  • ఒక మనిషి మరణించబోతున్నాడు… దేవుడొచ్చాడు చేతిలో ఓ పెట్టెతో…
  • రమ్యకృష్ణ నిజమే చెప్పింది…. మళ్లీ లైంగిక దోపిడీ వార్తల్లోకి వచ్చింది…
  • ఆ అద్భుత ఆధ్యాత్మిక యాత్ర మళ్లీ ఆరంభం అవుతోంది..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions