.
ముందుగా సాక్షి పాత్రికేయ మిత్రుడు, రచయిత Poodoori Rajireddy ఫేస్‌బుక్ వాల్ మీద షేర్ చేసుకున్న ఈ పోస్టు చదవండి… చదవగానే మీకు సరిగ్గా సమజ్ కాదు, నమ్మరు, అందుకని మళ్లీ మళ్లీ చదవండి…
·
Ads
పోయిన్నెల మా కరెంట్ బిల్లు 51 రూపాయలు!
2025 ఏప్రిల్ నెలకుగానూ హైదరాబాద్‌లోని మా (అద్దె) ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు 51 రూపాయలు. మేము ఏసీ, ఫ్రిజ్ లాంటివి వాడం కాబట్టి మామూలుగా బిల్లులు తక్కువగానే వస్తుంటాయి. ఆ తక్కువల్లోనూ ఇది ఇంకా తక్కువ.
నేను ఒక్కడినే ఉంటే గనక ఎంత వేడిగా ఉన్నా ఫ్యాను కూడా వేయను. శరీరాన్ని అట్లా అలవాటు చేయడానికి సాధన చేస్తున్నా.
వేసవి సెలవులకు మావాళ్లు ఊరికి వెళ్లడంతో ఇంక రాత్రిపూట కాసేపు ఒకట్రెండు బల్బులు; ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్, (వారానికోసారి) ట్రిమ్మర్ చార్జింగుల కోసం తప్ప ఇంక దేనికీ పెద్దగా కరెంట్ వాడింది లేదు. బిల్లు ప్రకారం 4 యూనిట్లు కాలింది.
నాకు తెలిసిన ఒక మేడమ్ వాళ్లకు పోయిన్నెల పది వేల బిల్లు వచ్చిందంటే (అలాంటి వస్తువులూ, వాటికి తగిన వాడకమూ ఉన్నాయన్నారు) ఇది రాయబుద్ధయింది…
ట్రెమండస్… ఈ మాట ఎందుకంటున్నానూ అంటే… జస్ట్, 4 యూనిట్లు… అన్ బిలీవబుల్ కదా, అందుకే షేర్ చేసుకుంటున్నా… 51 రూపాయల బిల్లు అనేది వదిలేయండి… జీరో యూనిట్లు కాలినా సరే 40 రూపాయల కస్టమర్ ఛార్జీలు ఎలాగూ బాదేవాళ్లే… పైగా 7.80 రూపాయల వాడకానికి 10 రూపాయల ఫిక్స్‌డ్ ఛార్జీలు…
సెక్యూరిటీ డిపాజిట్ మీద సర్కారు వారు అత్యంత దయతో ప్రసాదించిన 6.71 రూపాయలు పోగా నికర బిల్లు 51… అసలు ఈరోజుల్లో ఇంత పొదుపు వాడకానికి ఇంత పర్‌ఫెక్ట్ ఉదాహరణ మరొకటి ఉండదేమో… అర్జెంటుగా రాజిరెడ్డికి విద్యుత్తు పొదుపరుల సంఘం తరఫున సన్మానించాలి… (సరదాగా…)
నిజమే… ఈరోజుల్లో ఏసీ, ఫ్రిజ్జుల సంగతి ఎలా ఉన్నా సరే… ఇంత తక్కువ కరెంటు వాడకం అసాధారణమే… ఓపట్టాన నమ్మబుద్ధి కాదు, అందుకెే తను బిల్లును కూడా చూపిస్తున్నాడు… (ఎవరినో నమ్మించడానికి కాదు, తన పోస్టుకు సాధికారత కోసం…) తరచూ వార్తలు రాస్తుంటాం కదా, నామమాత్రం వాడకానికి లక్షల్లో బిల్లులు వస్తున్నట్టు… ఇది వెయ్యి శాతం రివర్స్ బిల్లు…
ఈ బిల్లు విషయం తెలిస్తే వేసవి వాడకంలో కొత్త కొత్త రికార్డులు నమోదవుతూ, దానికి తగిన సరఫరా చేయడానికి విద్యుత్తు పంపిణీ సంస్థలు నానాపాట్లూ పడుతున్నవేళ… ఈ బిల్లు చూసి కరెంటోళ్లు రాజిరెడ్డికే ఉల్టా ఆ 51 రూపాయలు చెల్లించడంతోపాటు ఎంతోకొంత అభినందన మొత్తాన్ని కూడా పంపించాలి… కానీ… నెవ్వర్, అలా చేస్తే కరెంటోళ్లు అనిపించుకోరు కదా…
జాగ్రత్త… అసలు మీటర్‌లోనే ఏదో లోపం ఉందని అనుమానించి, సాంకేతిక శల్య పరీక్షలు జరిపి… అర్జెంటుగా గిర్రున తిరిగే మరో చైనా మీటర్ వెతికి మరీ ఫిట్ చేసే ప్రమాదముంది… ఏమో, సర్వీస్ ఛార్జీలు అదనం కావచ్చు కూడా బహుశా..!! (ఈ స్టోరీ కోసం వాడబడిన చిత్రం కేవలం ప్రతీకాత్మకమే తప్ప ప్రతీకారాత్మకం కాదని గమనించగలరు…)
Share this Article